Jacques kallis retire from test cricket

Jacques Kallis retire, durban, south africa, Jacques Kallis, slip fielder, final test, talented cricketers, valuable cricketer

Jacques Kallis has announced that he will retire from Test cricket after the Boxing Day match against India

టెస్టులకు గుడ్ బై చెప్పిన కల్లీస్

Posted: 12/26/2013 09:07 AM IST
Jacques kallis retire from test cricket

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బౌలర్లలో ఒకడు, దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్లలో ఒకరైన జాక్వెస్ కల్లీస్ టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలకనున్నాడు. స్వదేశంలో పర్యాటక జట్టు భారత్ తో జరగుతున్న టెస్ట్ సిరీస్ చివరిదని ప్రకటించాడు. నాలుగు పదుల వయస్సుకు చేరువలో ఉన్న కల్లీస్ వన్డేల్లో మాత్రం కొనసాగుతానని అన్నాడు.

ఈ ప్రకటనతో నేటి నుండి జరిగే రెండో టెస్టు చివరిది కానుంది. 1995 డిసెంబర్‌లో ఇంగ్లండ్‌పై అరంగేట్రం చేసిన కలిస్ సఫారీ జట్టుకు చిరస్మరణీయ విజయాలు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. తన రిటైర్మెంట్‌పై కల్లీస్ మాట్లాడుతూ తాను తీసుకున్న నిర్ణయం బాధాకరమైనప్పటికీ... ఇదే సరైన సమయంగా భావించానని తెలిపాడు.

ఇప్పటిదాకా కెరీర్‌లో 165 టెస్టులు ఆడి 13 వేల 174 పరుగులు సాధించాడు. ఇందులో 44 సెంచరీలు ఉండడం విశేషం. అంతే కాకుండా బౌలర్‌గానూ రాణించి 292 వికెట్లు తీసి 199 క్యాచ్‌లు అందుకొని తానెంత విలువైన ఆటగాడో చాటి చెప్పాడు.

టెస్టు ఫార్మాట్‌లో దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, రాహుల్ ద్రవిడ్‌ల తర్వాత అత్యధిక పరుగుల వీరుడుగా కల్లీస్ చరిత్రకెక్కాడు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో కలిస్ ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నాడు. ఫిట్‌‌నెస్ సహకరిస్తే రానున్న వన్డే వరల్డ్ కప్‌లో ఆడతానని చెప్పాడు. కల్లీస్ లేని లోటు దక్షిణాఫ్రికా జట్టుకు తీరనదని చెప్పవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles