2nd test day 1 vijay and pujara put india in control

2nd Test, Day 1, MS Dhoni, Indian cricket team, Jacques Kallis, Cheteshwar Pujara, Murali Vijay

India take on South Africa in the second and final Test at Kingsmead, Durban. Catch all the highlights from Day 1

మొదటి రోజు మనోళ్ళదే ఆధిపత్యం

Posted: 12/27/2013 10:39 AM IST
2nd test day 1 vijay and pujara put india in control

సఫారీ గడ్డ పై భారత బ్యాట్స్ మెన్స్ నిలదొక్కుకోవడం కష్టమే అనుకున్నారు. ఏ మాత్రం అనుభవం లేని కుర్రాళ్ళ జట్టు నిలవడం కష్టమే అనుకున్నారు. వన్డేల్లో ఓడిపోయినా, టెస్టుల్లో మాత్రం తామేంటో నిరూపించుకుంటున్నారు. తొలిటెస్టులో సమర్థవంతంగా సఫారీ బౌలర్లను ఎదుర్కొన్న టీం ఇండియా టెస్టును డ్రా ముగించి తనలో ఆత్మవిశ్వాసం పెంచుకున్నారు.

అదే ఆత్మ విశ్వాసంతో రెండో టెస్టులో బరిలోకి దిగిన టీం ఇండియా రెండో టెస్టు మొదటి రోజు సఫారీ బౌలర్ల పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఫేసర్లను సమర్థవంతగా ఎదుర్కొని తొలిరోజు ఆట ముగిసే సమయానికి 181 చేసి కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయింది. శిఖర్ ధావన్ (49 బంతుల్లో 29; 4 ఫోర్లు) విఫలమైనా... ఫామ్‌తో ఇబ్బందుపడుతున్న మురళీ విజయ్ (201 బంతుల్లో 91 బ్యాటింగ్; 17 ఫోర్లు) గాడిలో పడ్డాడు.

వాండరర్స్ సెంచరీ హీరో చతేశ్వర్ పుజారా (117 బంతుల్లో 58 బ్యాటింగ్; 7 ఫోర్లు)తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను సాఫీగా నడిపించాడు. ఫలితంగా దక్షిణాఫ్రికాతో గురువారం ప్రారంభమైన రెండో టెస్టు తొలి రోజు టీమిండియా పూర్తి ఆధిపత్యం కనబర్చింది. విజయ్, పుజారా రెండో వికెట్‌కు అజేయంగా 140 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో ఉన్నారు. నేడు రెండో రోజు ఎలాంటి ఆటను ప్రదర్శించబోతున్నారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles