Sachin floored by rajinikanth humility

Sachin Tendulkar, Rajinikanth, superstar Rajinikanth, Rajinikanth,Sachin Tendulkar,humility,new delhi,Sachin floored by Rajinikanth humility

Indians call him the God of cricket but Sachin Tendulkar is clearly in awe of superstar Rajinikanth.

రజినీకాంత్ కి నేను పెద్ద అభిమానిని

Posted: 12/17/2013 02:53 PM IST
Sachin floored by rajinikanth humility

తానో పెద్ద క్రికెటర్. ప్రపంచ దేశాభిమానులు క్రికెట్ దేవుడిగా కొలిచే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సౌత్ ఇండియా  సినీ హీరోలలో ఎవరంటే ఇష్టం. ఇప్పటి వరకు ఈ విషయాన్ని ఎప్పుడు చెప్పకపోయినా ఇటీవలే ఆయన స్వయంగా తన అభిమాన హీరోను కలిసి ఎంతో ఆనందాన్ని పొందాడు. ఆయనెవరో కాదు. సూపర్ స్టార్ రజినీ కాంత్.

  నెల రోజుల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైరైన సచిన్ ఇప్పుడు తన జీవితాన్ని ఇలా ఇష్టమైన వారితో, తన కుటుంబ సభ్యులతో గడుపుతున్నాడు. రజినీ ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాల నుండి ఉన్నాడు. సచిన్ దాదాపు పాతికేళ్ళు అంతర్జాతీయ క్రికెట్ కి సేవలు అందించాడు. ఇన్ని సంవత్సరాలలో ఒక్కసారి కూడా కలుసుకోని వీరిద్దరు ఇటీవలే కలుసుకున్నారు. ఈ సందర్భంగా సచిన్ రజినీ పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఇన్నేళ్ల పాటు రజనీ సార్‌ను కలవలేకపోవడం నిజంగా దురదృష్టకరం.

ఎప్పుడూ ఆ అవకాశం నాకు రాలేదు. ఇప్పుడు మా భేటీ గొప్పగా జరిగింది. దక్షిణాది నుంచి వచ్చిన అనేక మంది క్రికెటర్లతో తాను కలిసి ఆడానని, వారిలాగే తాను కూడా రజనీ అభిమానినని సచిన్ చెప్పుకొచ్చాడు. నెల రోజుల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌నుంచి రిటైరైన సచిన్ ఇప్పటికీ ఆ విషయాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పాడు. స్టార్ ఆటగాడు అయిన సచిన్ రజినీ పై చూపించిన అభిమానానికి పొంగిపోయాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles