Australia vs england ashes 3rd test day 4

England vs Australia Live Score, England vs Australia Live, The Ashes Live, Live streaming, Cricket Live,Ashes Third test, england

Cook departure has dealt a heavy blow to England already diminishing prospects of winning the Test.

పెర్త్ లో కంగారుల జోరు - ఇంగ్లాండ్ బేజారు

Posted: 12/16/2013 12:15 PM IST
Australia vs england ashes 3rd test day 4

తమ దేశం వచ్చిన పర్యాటక జట్టు ఇంగ్లాండ్ కు  ఆస్ట్రేలియా జట్టు యాషెస్ సిరీస్ లో చుక్కలు చూపిస్తుంది. స్వదేశి గడ్డ పై ఎవరికి వారే రారాజులు అని నిరూపించుకుంటుంది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ లో ఇప్పటికే రెండు టెస్టులు ఘోరంగా ఓడిన ఇంగ్లాండ్ మూడో టెస్టులో కూడా అదే ఫేవల ఫాంను కొనసాగిస్తుంది.

తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన కంగారూలు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌లో దుమ్మురేపారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 70 ఓవర్లలో 3 వికెట్లకు 235 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (140 బంతుల్లో 112; 17 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో చెలరేగి, తొలి వికెట్‌కు 157 పరుగులు జోడించారు. రెండుసార్లు స్టంపౌట్ ప్రమాదం నుంచి బయటపడ్డ వార్నర్ కెరీర్‌లో రెండో సెంచరీ నమోదు చేశాడు. క్లార్క్ (23) విఫలమయ్యాడు. బ్రెస్నన్, స్టోక్స్, స్వాన్ తలా ఓ వికెట్ తీశారు. ప్రస్తుతం ఆసీస్ 369 పరుగుల ఆధిక్యంలో ఉంది.

నాలుగో రోజు ఆట ప్రారంభిచిన ఆసీస్ 369-3 వికెట్ల వద్ద డిక్లేర్ చేసింది. అంతకుముందు 180/4 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 88 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆసీస్‌కు 134 పరుగుల ఆధిక్యం లభించింది. కంగారూల పేస్ ధాటికి కుక్‌సేన మిడిలార్డర్ ఘోరంగా విఫలమైంది.

హారిస్, సిడిల్ చెరో మూడు వికెట్లు తీయగా, జాన్సన్‌కు 2 వికెట్లు దక్కాయి. ఇదే ఆట కొనసాగిస్తే ఇంగ్లాండ్ ఈ టెస్టు కూడా ఓడిపోయి సిరీస్ ను చేజార్చుకోవాల్సి వస్తుంది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ రెండు వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles