అతనో ఫస్ట్ క్లాస్ క్రికెటర్... మంచి బ్యాటింగ్ శైలితో పాటు రంజీ జట్టుకు కెప్టెన్సీ కూడా వహిస్తు రాణిస్తున్న ఒక క్రికెటర్ కి జాతీయ జట్టు లోకి రావడానికి పట్టే సమయం మహా అంటే రెండేళ్లు. కానీ ఇతనికి మాత్రం పదేళ్ళు పట్టింది. అతనే తెలుగు తేజం అంబటి రాయుడు. ఇన్నాళ్ళకు అతనికి జాతీయ జట్టులో స్థానం దక్కితే దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. జింబాబ్వే సిరీస్ లో హాప్ సెంచరీ చేసిన రాయుడు నాటవుట్ గా నిలవడమే కాకుండా జట్టుకు మంచి విజయాన్ని అందించాడు. అయితే అంరంగ్రేట వన్డేలోనే తన సత్తా చాటడం వెనుక మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కార్ , కోచ్ రాబిన్ సింగ్ ల ప్రోత్సాహం ఉందని ఈ ఘనత వారికే దక్కుతుందని అన్నాడు. ‘తాను క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో వారిద్దరు ఎంతో ధైర్యం చెప్పడమే కాకుండా వెన్నంటి ఉన్నారని రాయుడు అన్నారు. ‘కఠోర శ్రమ చేస్తే ఏదో ఒక రోజు జట్టుకు ఆడతాననే నమ్మకం ఉండేదని, అది ఇన్నాళ్ళకు నెరవేరిందని అన్నారు. ఈ హాఫ్ సెంచరీ నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని అన్నాడు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more