ముక్కోణపు సిరీస్ లో భాగంగా గత రెండు మ్యాచ్ ల్లో ఛాంపియన్స్ జట్టు మూడో మ్యాచ్ లో తన సత్తా చాటింది. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో విండీస్ పై ఘన విజయం సాధించి ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. నిన్న రాత్రి వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో సమిష్టిగా రాణించి, 102 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విండీస్ జట్టు భారత్ ని బ్యాటింగ్ కి ఆహ్వానించింది. గత రెండు మ్యాచ్ ల్లో విఫలం అయిన ఓపెనర్లు నిన్న మంచి శుభారంభాన్ని ఇచ్చాడు. ధావన్, రోహిత్ లు కలిసి తొలి వికెట్ కు 123 పరుగులు జోడించారు. 69 పరుగులు చేసి మంచి ఊపు మీద కనిపించిన శిఖర్ ధావన్ ను రోచ్ అవుట్ చేయగా, రోహిత్ శర్మను 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బెస్ట్ పెవిలియన్ కు పంపాడు. ఆతర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ (102) విజృంభించి సెంచరీ చేయడంతో వెస్టిండీస్ ముందు 312 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచింది. భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది. భారత్ నిర్థేశించిన విజయ లక్ష్యానికి వరణుడు ఆటకం కలిగించడంతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం మ్యాచ్ ని 39 ఓవర్లకు కుదించి, 274 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్ణయించారు. కానీ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్ మూడేసి వికెట్లు, ఇషాంత్ శర్మ, జడేజాలు రెండేసి వికెట్లు పడగొట్టడంతో విండీస్ 171 పరుగులకే ఆలౌట్ అయింది. చార్లెస్ (45), రోచ్ (34), నరైన్(24) కాస్త పోరాడినా ఫలితం లేకపోయింది. ఇక కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన క్లోహ్లీకి మ్యాచ్ ఆఫ్ అవార్డు దక్కింది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more