టీం ఇండియా జట్టు వరుస విజయాలతో దూసుకుపోవడమే కాకుండా అన్ని విభాగాల్లో రాణించి ఛాంపియన్స్ ట్రోఫీ ని చేజిక్కుకొని నెంబర్ వన్ టీమ్ అంటే ఇదే అని అనిపించుకున్నారు. అది మొన్నటి మాట. ఛాంపియన్స్ ట్రోఫీ విజయానందంలో ఎంతో ఉత్సాహాంగా ముక్కోణపు సిరీస్ లో విండీస్ గడ్డ పై అడుగు పెట్టిన మన జట్టు మొదటి మ్యాచ్ లో పోరాడి ఓడింది. పోనీ రెండో మ్యాచ్ లో అయినా లంక పై అదరగొడతారని అందరు అనుకున్నారు. కానీ లంక సింహాల గర్జింపుకు తలవంచడమే కాకుండా, వారి ఆట తీరు చూసిన సగటు ప్రేక్షకుడికి ఈ జట్టేనా వారం క్రితం ఇంగ్లాండ్ ను ఓడించింది అనే సందేహం కలిగి ఉంటుంది. మ్యాచ్ ఓడటం కంటే ఓడిన తీరే అందరినీ కలవర పెట్టడమే కాకుండా, విదేశీ గడ్డ పై మా తీరు ఇంతేనని మరోసారి నిరూపించుకున్నారు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో టీం ఇండియా వ్యూహాలన్నీ బెడిసి కొట్టాయి. బౌలింగ్ లోపాలు, ఫీల్డింగ్ తప్పిదాల మాట అటుంచితే బ్యాట్స్ మెన్ ఆట తీరే మరీ ఆందోళన కలిగించింది. బౌలర్లు, ఫీల్డింగ్ తప్పిదాల వల్ల భారీ పరుగులు సమర్పించుకున్నా కానీ, బ్యాటింగ్ కి వచ్చే సరికి తడబడింది. భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చినప్పుడు రన్ రేట్ ని పరిగణలోకి తీసుకోకుండా నెమ్మదిగా బ్యాటింగ్ చేయడం ఆశ్చర్యపరిచేదే. ఓవర్లు 15 దాటినా రన్ రేట్ మాత్రం 4 దాటలేదు బ్యాటింగ్ లో అదరగొడుతున్న ధావన్, విజయ్ ఆట తీరు చూస్తే... భారత్ కి విజయం పై శ్రద్ధ ఉన్నట్లే అనిపించలేదు. వికెట్లు పడుతున్నాయి, స్కోరు కదలట్లేదు... అయినా పవర్ ప్లే తీసుకోలేదు. మ్యాచ్ పూర్తిగా చేజారాక పవర్ ప్లే తీసుకున్నారు. మొత్తానికి పేవలమైన ఆట తీరుతో మ్యాచ్ చేజార్జుకున్నా అభిమాలు బాధపడరు కానీ, ఇలాంటి ఆట తీరును ఏ ప్రేక్షకుడు సహించడు. ఇప్పటికైనా పక్కా ప్రణాళికతో వచ్చే మ్యాచ్ లలోనైనా గెలవాలని ప్రతి అభిమాని కోరుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more