Sunrisers hyderabad in nail biting eliminator

Brad Hodge, Darren Sammy, Rajasthan Royals, Sunrisers Hyderabad, RR vs SRH, IPL, IPL 6, IPL 2013, IPL Eliminator

Rajasthan Royals knock out Sunrisers Hyderabad in nail-biting Eliminator - An under-pressure unbeaten half-century from Brad Hodge snatched a four-wicket win for the Rajasthan Royals over the Sunrisers Hyderabad in the Indian Premier League (IPL) Eliminator

రైజర్ప్ పోరు ముగిసింది

Posted: 05/23/2013 10:13 AM IST
Sunrisers hyderabad in nail biting eliminator

ఏ మాత్రం అంచనాలు లేకుండా ఈ సీజన్ బరిలో దిగిన హైదరాబాద్ సన్ రైజర్స్ లీగ్ దశలో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.... ప్లే ఆఫ్ కి అర్హత సాధించింది. ప్లే ఆఫ్ లో కూడా చివరి వరకు పోరాడిన సన్ రైజర్స్ జట్టు రాజస్ధాన్ చేతిలో ఓటమిపాలై ఐపీఎల్ సీజన్ నుండి అస్తమించింది. ఇక నిన్నటి మ్యాచ్ లో హైదరాబాద్ గత కొన్ని రోజులుగా సెంటిమెంటుగా చెప్పుకుంటున్న 130 పరుగుల స్కోరు వర్కట్ కాలేదు. టి20లో తలపండిన ఆటగాడు అయిన హాడ్జ్ మెరుపు ఆటతో సన్ రైజర్స్ ఓటమి పాలైంది. ఈ విజయం తో రాజస్థాన్ ఫైనల్ స్థానం కోసం ముంబై ఇండియన్ టీంతో తలపడనుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. ధావన్ (39 బంతుల్లో 33; 3 ఫోర్లు), వైట్ (28 బంతుల్లో 31; 5 ఫోర్లు), స్యామీ (21 బంతుల్లో 29; 3 సిక్స్‌లు) జట్టు స్కోరులో కీలక పాత్ర పోషించారు. అనంతరం రాజస్థాన్ రాయల్స్ 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 135 పరుగులు చేసి విజయాన్నందుకుంది. హాడ్జ్ అద్భుత ఇన్నింగ్స్‌తో పాటు వాట్సన్ (15 బంతుల్లో 24; 5 ఫోర్లు) ఆరంభంలో రాణించాడు. ఈ గెలుపుతో రాజస్థాన్ అక్టోబర్‌లో జరిగే చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీకి అర్హత సాధించింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు హాడ్జ్ కి దక్కింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more