మొన్నటి వరకు వరుస విజయాలతో బుసకొట్టి ప్లే ఆఫ్ రేసుకు దగ్గరై, చిరరి రెండు మ్యాచ్ ల్లో తప్పనిసరిగా గెలవాల్సిన సమయంలో రెండు వరుస ఓటములతో బెంగుళూరు ప్లే ఆఫ్ రేసును సంక్లిష్టం చేసుకుంది. నిన్న పంజాబ్ కింగ్స్ లెవన్ తో జరిగిన మ్యాచ్ లో సొంత మైదానంలో ఓడిపోయింది. పంజాబ్ సింహాలు అయిన గిల్ క్రిస్ట్, మహమూద్ ల పంజా ధాటికి నిలవలేక పోయింది. ఇక ఈ సీజన్ లో తొలిసారి మెరిసిన గిల్ క్రిస్ట్ కి మ్యాచ్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వచ్చింది. చిన్నస్వామి స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో గిల్‌క్రిస్ట్ సేన ఏడు వికెట్ల తేడాతో కోహ్లి బృందాన్ని ఓడించింది. మొదట టాస్ గెలిచి బెంగుళూరును బ్యాటింగ్ కి ఆహ్వానించిన పంజాబ్ భారీ స్కోరునే సమర్పించుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. పుజారా (19) తొందరగా అవుటైనా... క్రిస్‌గేల్ (53 బంతుల్లో 77; 4 ఫోర్లు, 6 సిక్సర్లు), కెప్టెన్ కోహ్లి (43 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీలతో చెలరేగి ఆడటంతో భారీ స్కోరును సాధించింది. భారీ స్కోరును చేధించడానికి బరిలోకి దిగిన పంజాబ్ గెలుపు కష్టమే అనుకున్నారు వారి గత ప్రదర్శన తీరు చూసి. కానీ పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు 18.1 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసి గెలిచింది. షాన్‌మార్ష్ (8) విఫలమైనా... కెప్టెన్ గిల్‌క్రిస్ట్ (54 బంతుల్లో 85 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), అజహర్ మహమూద్ (41 బంతుల్లో 61; 8 ఫోర్లు, 1 సిక్సర్) కలిసి లక్ష్యఛేదనను నడిపించారు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 118 పరుగులు జోడించారు. . బెంగళూరు బౌలర్లలో జహీర్, జయదేవ్, మురళీధరన్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more