ఈ సీజన్ లో మంచి ఊపులో ఉన్న హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు కు పటిష్టమైన చెన్నై జట్టు నుండి ఓటమి తప్పలేదు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో చెన్నై విజయం సాధించింది. ధోని అద్భుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకొని ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. చెన్నై చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 159 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు చేసింది. ఇన్నిరోజులు గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్న శిఖర్ ధావన్ శిఖర్ ధావన్ (45 బంతుల్లో 63 నాటౌట్; 10 ఫోర్లు) పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. ధావన్ నిలకడగా ఆడి అర్ధసెంచరీ సాధించడంతో పాటు... ఆశిష్ రెడ్డి (16 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో సన్‌రైజర్స్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. వీరికి తోడు స్యామీ (12 బంతుల్లో 19; 2 ఫోర్లు, 1 సిక్సర్) రాణించాడు.
అనంతరం లక్ష్యాన్ని ఛేధించడానికి బరిలోకి దిగిన చెన్నై బ్యాట్స్ మెన్స్ హస్సీ మరోసారి తన మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. ఓపెనర్ గా వచ్చిన మైక్ హస్సీ (26 బంతుల్లో 45; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) తో రాణించాడు. మిగతా చెన్నై బ్యాట్స్ మెన్స్ పెద్దగా రాణించలేకపోయిన కెప్టెన్ ధోని 37 బంతుల్లో 67 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీతో ఒంటరిపోరాటం చేసి... జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. బ్యాటింగ్ కి వచ్చి పరుగులేమీ చేయకుండా ధోని ఇచ్చిన క్యాచ్ ని మిశ్రా జారవిడవటంతో ఆ సదవకాశాన్ని వినియోగించుకొని చెలరేగి ఆడి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో అమిత్ మిశ్రా మూడు వికెట్లు తీసుకున్నాడు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more