భారత క్రికెట్ లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాడు యువ ఆటగాడు పుజారా. వన్డే ఫార్మట్‌లో మెరుపులు మెరిపించడం, తద్వారా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించి టెస్టు జట్టులో స్థానం పొందడం అనే పద్ధతిని భారత బ్యాట్స్ మెన్ పాటిస్తూ వస్తున్నారు. అయితే చేతేశ్వర్ పుజారా విషయంలో ఇది రివర్స్ అయ్యింది. టెస్టు స్పెషలిస్ట్ గా పేరుగాంచిన పుజారా టెస్టుల్లో ప్రతిభ నిరూపించుకుని వన్డేల్లో అడుగు పెడుతున్నాడు. ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు అతడ్ని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. టెస్టు క్రికెట్‌లో ప్రవేశించిన తరువాత ఐదేళ్లకుగానీ అతడికి వన్డేల్లో ఆడే అవకాశం లభించలేదు. దేశవాళీ క్రికెట్‌లో వన్డే ఫార్మట్‌లో మంచి రికార్డు కలిగిఉన్నప్పటికీ అతడికి అవకాశం తలుపు తట్టలేదు.
ఇంకా, ముగ్గురు సీనియర్ క్రీడాకారులు-సచిన్, సెహ్వాగ్, గంభీర్ జట్టులో ఉండటం అతడికి ప్రతిబంధకాలు కల్పించింది. వీరు ముగ్గురూ ఓపెనర్లు కావడం వల్ల సమస్య వచ్చిపడింది. విరాట్ కొహ్లి నెంబర్ త్రీ స్థానంలో రాణించడం పుజారాకు అవకాశం లభించక పోవడానికి మరో కారణం. సచిన్ రిటైర్ కావడం, వీరూ ఫామ్‌లో లేకపోవడంతో పుజారాకు అవకాశం కలిసివచ్చింది. ఛాలెంజర్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మన్‌గా నిలవడంతో పుజారాకు పిలుపు వచ్చింది. ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌లో తనకు పిలుపు వస్తుందని ముందే భావించానని పుజారా అంటున్నడు.. ఏమైనా, ఆల్ ది బెస్ట్ పుజా..
...avnk
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more