మళ్లీ అతడే... బంతితోనూ... బ్యాట్‌తోనూ కదం తొక్కాడు. ఫలితం ఆస్ట్రేలియా ఘన విజయం. అద్భుత ఫామ్‌లో ఉన్న షేన్ వాట్సన్ మరోసారి ఆల్‌రౌండ్ ప్రదర్శన చేశాడు. దీంతో పటిష్టమైన దక్షిణాఫ్రికా జట్టు తెల్లబోయింది. సూపర్ ఎయిట్‌లో రెండు పరాజయాలతో సెమీస్ బెర్త్‌ను క్లిష్టం చేసుకుంది.షేన్ వాట్సన్ (47 బంతుల్లో 70; 8 ఫోర్లు, 2 సిక్సర్లు; 2/29) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆస్ట్రేలియా టి20 ప్రపంచ కప్ సూపర్ ఎయిట్‌లో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది.
ఇక్కడి ప్రేమదాస స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 8 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. పీటర్సన్ (19 బంతుల్లో 32 నాటౌట్; 6 ఫోర్లు), బెహర్దీన్ (27 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్సర్), డుమిని (25 బంతుల్లో 30; 4 ఫోర్లు) జట్టు స్కోరులో తలో చేయి వేశారు. ఆసీస్ బౌలర్లలో దోహర్తికి 3 వికెట్లు దక్కాయి. అనంతరం ఆస్ట్రేలియా 17.4 ఓవర్లలో 2 వికెట్లకు 147 పరుగులు చేసి విజయాన్నందుకుంది. వాట్సన్, మైక్ హస్సీ (37 బంతుల్లో 45 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కలిసి రెండో వికెట్‌కు 99 పరుగులు జోడించారు. వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ వాట్సన్‌కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కడం విశేషం. ఈ విజయంతో ఆసీస్ సెమీస్ చేరుకోవడం దాదాపు ఖాయమైంది. మరోవైపు రెండు ఓటములతో దక్షిణాఫ్రికా సెమీస్ అవకాశాల్ని క్లిష్టం చేసుకుంది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more