Land issue

Land Issue.GIF

Posted: 02/06/2012 08:41 PM IST
Land issue

Inam_Land_Issue

మా నాన్నగారికి ఇనాం భూమి 2 ఎకరముల 10 గుంటలు పొలం (మా తాతగారు నుండి సంక్రమించిన భూమిని కలుపుకొని) ఉన్నది. ఆ భూమిని దాదాపు 18 సంవత్సరాల నుండి సాగు చేశారు. దానిని కూడా మేము అనుభవిస్తున్నాము. అప్పుడు మా గ్రామములో ఒక పెద్ద మనిషి, రాజకీయ నాయకుడు అది ఇనాం భూమి (అనగా ఇది ప్రభుత్వం భూమి) అది మా ఆధీనంలో ఉంటుంది. అని మా కుటుంబాన్ని అన్ని విధాలుగా వేధిస్తున్నాడు. రాజకీయ ఒత్తిడితో తన ఆధీనంలో తీసుకున్నాడు. దీని పై మాకు ఎలాంటి హక్కులు కలదు.

     మీ ఆదీనంలో ఉన్న భూమి ఇనాం అని చెప్పుచున్నారు. అయితే ఇనాం భూమి చాలా రకాలుగా ఉంటుంది. అది ఏ రకానికి చెందినప్పటికీ ఇనాం భూమి అనగానే ప్రభుత్వ భూమి అని చెప్పవచ్చు. అలాంటి భూమి కనీసం 14 సంవత్సరాలు స్వాధీనంలో ఉన్నట్లు భూమి కిస్తు చెల్లించి పహాణిలో... అనగా మండలాధికారి (రెవెన్యూ రికార్డులో) పేరు ఉండి... ఆ భూమి దేవాలయానికి గానీ, మసీదు, చెరువులు, కుంటలు, రోడ్డులకు మొదలగు వాటికి ఉపయోగం కాకుండా... కేవలం ఇండ్లకు వ్యవసాయానికి సంబంధించిన ఇనాం భూమి అయితే దాని పై మీకు సర్వ హక్కులు కలవు.

   ఈ విషయంలో సుప్రీమ్ కోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. కావున మీరు వెంటనే మీ దగ్గర్లోని న్యాయవాదిని సంప్రదించి మీ పై అధికారం, రాజకీయ ఒత్తిడి చేసి ఇనాం భూమి ఆక్రమించుకున్న వ్యక్తిపై కేసు వేయగలరు. దీనిలోని ప్రభుత్వాన్ని కూడా పార్టి చేసి (ఇన్ జంక్షన్ సూట్) సివిల్ దావా వేస్తూ.... అతని పై క్రిమినల్ కేసు కూడా పెట్టవచ్చును. మీరు ఇనాం భూమిని అనుభవిస్తున్నందు వలన ఎవరికి ఎలాంటి రుసుములు, కౌలు రూపం గానీ, కిరాయి రూపముగా గానీ ఎలాంటి లావాదేవీలు చేయవలసిన అవసరం లేదు. ఈ భూమిపై మీరు చెప్పిన దానిని బట్టి న్యాయపరంగా మీకే హక్కు కలదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Child labour act
Marriage as per indian law  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles