Chiranjeevi | Kaththi | Remake | Remuneration

Megastar chiranjeevi 150th film remuneration details

Megastar Chiranjeevi 150th film Remuneration, Chiranjeevi 150th film Confirmed, Chiranjeevi 150 film kaththi, Megastar Chiranjeevi in kaththi remake, Megastar Chiranjeevi kaththi remake confirmed, Chiranjeevi 150th film news, Chiranjeevi 150th film updates, Chiranjeevi 150th film details, Chiranjeevi 150th film latest news, Chiranjeevi 150th movie details, Chiranjeevi latest stills

Megastar Chiranjeevi 150th film Remuneration Details: Tollywood Megastar Chiranjeevi 150th film confirmed by mega powerstar ram charan tej. Chiranjeevi 150th film is tamil star hero Vijay`s block buster film Kaththi. This film will be remake director VV Vinayak.

మెగాస్టార్ ‘కత్తి’ రీమేక్ కు కోట్లల్లో రెమ్యునరేషన్

Posted: 01/04/2016 01:16 PM IST
Megastar chiranjeevi 150th film remuneration details

మెగాస్టార్ చిరంజీవి చేయబోయే 150వ సినిమా గురించి రోజుకో వార్త హాట్ టాపిక్ గా మారుతోంది. గతకొద్ది రోజులుగా సరైన కథ దొరకలేదంటూ 150వ సినిమాను వాయిదా వేస్తూ వచ్చారు. కానీ తాజాగా తమిళంలో ఘన విజయం సాధించిన ‘కత్తి’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. ఈ రీమేక్ లోనే చిరంజీవి హీరోగా నటించనున్నారని రాంచరణ్ అధికారికంగా ప్రకటించారు.

అయితే ఈ వార్త విని మెగా అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. ఇలాంటి రీమేక్ సినిమా అయితే ఇప్పటికే ప్రారంభించేసి వుంటే బాగుండేదంటూ కాస్త నిరాశ చెందారు. కొత్త కథ కావాలంటూ ఇంతకాలం ఎదురుచూసినా చిరంజీవి.. చివరకు తమిళ రీమేక్ పై పడటంతో మెగా అభిమానులు తీవ్ర నిరాశ చెందినప్పటికీ.. మొత్తానికి 150వ సినిమా స్టార్ అవ్వబోతుందనే వార్తతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాను లైకా సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. లైకా సంస్థ వారు ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవికి అక్షరాల 30 కోట్ల రెమ్యునరేషన్ ను ఇవ్వనున్నారని, అందులో సగం 15 కోట్ల అడ్వాన్స్ ను ఇప్పటికే చిరంజీవికి అందజేసిన వార్త ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ ఇదే నిజమైతే టాలీవుడ్ హీరోల్లో అత్యధిక మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో చిరంజీవే అవుతారు. మరి ఇందులో ఎంత నిజముందో త్వరలోనే తెలియనుంది.

ప్రస్తుతం ఈ రీమేక్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో నటించబోయే నటీనటులు, సాంకేతికవర్గ నిపుణుల వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  Kaththi  Remake  Remuneration  Ram charan  Confirmed  stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more