Adivi Sesh Playing Husband Role To Anushka In Oopiri Movie | Nagarjuna Updates | Karthi Movies

Anushka shetty husband role adivi sesh oopiri movie nagarjuna karthi tamanna

anushka shetty news, adivi sesh news, anushka with adivi sesh, anushka movies list, oopiri movie updates, nagarjuna news, karthi updates, tamanna bhatia

Anushka Shetty Husband Role Adivi Sesh Oopiri Movie Nagarjuna Karthi Tamanna : Adivi Sesh Playing Husband Role To Anushka In Oopiri Movie.

అనుష్కకు కాబోయే భర్త ఎవరో తెలిసిపోయిందోచ్!

Posted: 09/21/2015 01:56 PM IST
Anushka shetty husband role adivi sesh oopiri movie nagarjuna karthi tamanna

ఎట్టకేలకు ముద్దుగుమ్మ అనుష్కకు కాబోయే భర్త ఎవరో తెలిసిపోయింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ విషయంపైనే చర్చించుకుంటున్నారు. విభిన్న పాత్రల్లో నటిస్తూ దూసుకుపోతున్న ఈ అమ్మడికి జోడిగా ఆమె తరహాలోనే నటించే ఓ యువనటుడు తోడు కాబోతున్నాడని సమాచారం. అతను మరెవ్వరో కాదు.. ‘బాహుబలి’ చిత్రంలో భద్రగా నటించిన అడివి శేష్. అయితే.. ఇది రియల్ లైఫ్ లో కాదులెండి.. రీల్ లైఫ్ లో!

అసలు విషయం ఏమిటంటే.. ప్రస్తుతం ‘జీరో సైజ్’ సినిమా షూటింగ్ ఫుల్ బిజీగా వున్న అనుష్క ‘ఊపిరి’ చిత్రంలోనూ ఓ కీలకపాత్రలో నటిస్తోంది. అక్కినేని నాగార్జున, కార్తి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో అనుష్క నాగ్ కి లవర్ గా నటించనుంది. ఈ చిత్రంలో వారిద్దరి ప్రేమ ఫలిస్తుందో లేదో తెలీదు కానీ.. ఈ సినిమాలోనే అనుష్క భర్తగా అడివి శేష్ నటిస్తున్నట్టు సమాచారం. ‘బాహుబలి’ సినిమాలో భల్లాలదేవ (దగ్గుబాటి రానా) తనయుడు భద్ర పాత్రలో నటించిన శేష్.. తాజాగా ‘ఊపిరి’లో అనుష్క సరసన నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. అయితే.. ఈ విషయం ఇంకా అధికారికంగా వెలువడి కావాల్సి వుంది. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే!

ఇదిలావుండగా.. అనుష్క ప్రధానపాత్రలో రూపొందుతున్న ‘సైజ్ జీరో’ సినిమాలోనూ నాగార్జున ఓ కీలకపాత్రలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే.. నాగ్ నటించబోయే ఆ పాత్ర వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ చిత్రంలో అనుష్క సరసన ఆర్య నటిస్తున్న విషయం విదితమే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anushka shetty  adivi sesh  nagarjuna  oopiri movie  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more