హీరోహీరోయిన్లు ఏ ఒక్క సినిమా సమయంలో క్లోజ్ గా వున్నా, బయట క్లోజ్ గా తిరిగినా కూడా వారి మధ్య ఏదో వుందంటూ పుకార్లు వస్తాయనే విషయం తెలిసిందే. కోలీవుడ్ లోని హీరోయిన్లకు నచ్చే నటుడు ఆర్య. తన ఎంటర్ టైన్మెంట్ తో అందరినీ ఆకట్టుకుంటూ వుంటాడు. ఇలా ప్రతి హీరోయిన్ తో కలిపి ఆర్యపై రుమార్లు వస్తుండటంతో వాటిని తేలికగా తీసుకున్నాడు.
అయితే తాజాగా అదే జాబితాలోకి అనుష్క వచ్చి చేరింది. అనుష్క, ఆర్య కలిసి ఇదివరకే ‘వర్ణ’ అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. దీంతో అనుకున్న స్థాయిలో సినిమా లేకపోవడం భారీగా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అయితే వీరిద్దరూ మరోసారి కలిసి నటిస్తున్నారు.
అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘సైజ్ జీరో’. తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనుష్క రెండు విభిన్న పాత్రలలో నటిస్తుంది. అలాగే ఇందులో ఆర్య ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. వీరిద్దరూ కలిసి మళ్లీ ఈ సినిమాలో నటిస్తుండటం వల్ల.. మళ్లీ వీరిద్దరిపై కోలీవుడ్ లో పుకార్లు మొదలయ్యాయి. వీరిద్దరి మధ్య ఏదో వుందంటూ కోలీవుడ్ జనాలు గుసగుసలాడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more