అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘దోచేయ్’ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఏప్రిల్ 3వ తేదిన ఘనంగా జరుగనుందని చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ఆడియో కార్యక్రమం వాయిదా పడినట్లుగా తెలిసింది.
సుధీర్ వర్మ దర్శకత్వంలో నాగచైతన్య, కృతిసనన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సన్నీ.ఎం.ఆర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలోని పాటలను రోజుకొకటి చొప్పున టీజర్ గా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు పాటలు విడుదలయ్యాయి.
మరో రెండు రోజుల్లో ఆడియో కార్యక్రమం వుందనగా... ఈ చిత్ర ఆడియో విడుదలను వాయిదా వేసినట్లుగా తెలిసింది. కారణాలైతే తెలియవు గానీ... ఈ ఆడియో విడుదలను ఏప్రిల్ 11న నిర్వహించనున్నట్లుగా తెలిసింది. త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు.
శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర బ్యానర్లో నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో విడుదల ఆలస్యమైతే... సినిమా విడుదల కూడా ఏప్రిల్ 17న కాకుండా మరింత ఆలస్యం అయ్యేలా వుంది. మరి ఏం జరుగనుందో త్వరలోనే తెలియనుంది.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more