Ram gopal varma police vehicle selfie photos controversy

ram gopal varma news, ram gopal varma police vehicle, ram gopal varma police photos, telangana police new vehicles, telangana govt, varma latest news, ram gopal varma twitter

ram gopal varma police vehicle selfie photos controversy : The controversial director ram gopal varma has created another sensation by taking selfies in telangana police vans.

పోలీస్ వాహనంలో కూర్చొని సంచలనం రేపిన వర్మ!

Posted: 03/02/2015 12:47 PM IST
Ram gopal varma police vehicle selfie photos controversy

నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలనం సృష్టించే వర్మ.. ఈసారి పోలీస్ వాహనంలో కూర్చొని మరో దుమారం రేపినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ దర్శకుడు తెలంగాణ ప్రభుత్వ పోలీస్ వాహనంలో కూర్చొని రెండు ఫోటోలకు పోజులిచ్చాడు. అందులో ఒక ఫోటోకి ‘ఐ యామ్ ది పోలీస్’ అని, మరొక ఫోటోకి ‘నేను అరెస్ట్ అయ్యాను’ అంటూ క్యాప్షన్లు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వీటిని వీక్షించిన వర్మ అభిమానులు సరదాగా కామెంట్లు చేసుకోగా.. మరికొందరు మాత్రం తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ రెండింటిలో ‘ఐ యామ్ ది పోలీస్’ అంటూ పెట్టిన ఫోటోపై కొందరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘వర్మ ఒక ప్రముఖ దర్శకుడు కావొచ్చుగానీ.. కేవలం ఒక ఫోటో కోసం ప్రభుత్వ వాహనాన్నే ఎలా వాడుకుంటారు..? అసలు ప్రభుత్వం ఎలా అనుమతి ఇచ్చింది..?’’ అంటూ ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. ‘‘అత్యవసర సమయాల్లో ప్రజలకు రక్షణ కల్పించడానికి ప్రభుత్వం పోలీసులకు ఈ వాహనాలను కేటాయించారు కానీ.. ఇలా సెలబ్రెటీలు ఫోటోలు తీసుకోవడం కోసం కాదు’ అంటూ కొందరు హితువు పలుకుతున్నారు.

ram-gopal-varma-1

ఇక రెండో ఫోటోపై ‘నేను అరెస్ట్ అయ్యాను’ అంటూ వర్మ పెట్టిన క్యాప్షన్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ‘ఫోటోను చూస్తుంటే అరెస్ట్ అయినట్లు లేదు.. పోలీస్ వాళ్లతో కలిసి రైడ్ కి వెళ్లినట్లుంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో ఈ ఫోటోపై కుళ్లుజోకులు, సెటైర్లు వేసుకుంటూ, పిచ్చిపిచ్చిరాతలు రాసేసుకుంటున్నారు.

అయితే.. ఈ ఫోటోలపై కొందరు విమర్శకులు, సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. సినిమా షూటింగ్ నేపథ్యంలో పోలీస్ వాహనాలను అద్దెకు తీసుకోవచ్చుగానీ.. ఇలా ఫోటోల ఫోజుల కోసం ఆ వాహనాలను ఎలా వాడుకుంటారంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఈసారి ప్రభుత్వ వాహనాలతో వర్మ మరోసారి వివాదాల్లోకెక్కాడు. మరి ఈ విషయంపై వర్మ ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ram gopal varma news  varma police vehicle photos  varma twitter account  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more