‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల ఊహల సుందరిగా మారిన రాశి ఖన్నా ప్రస్తుతం ఇండస్ర్టీలో లేటెస్ట్ హీరోయిన్స్ బెస్ట్ లిస్ట్ లో చోటు సంపాదించింది. తొలి సినిమాతోనే ఆకట్టుకోవటంతో ముంబై ముద్దుగుమ్మ కోసం టాలీవుడ్ డైరెక్టర్లు తెగ ఫోన్లు చేస్తున్నారట. ఎప్పుడెప్పుడు రాశితో మాట్లాడి సినిమాలకు డేట్లు ఫిక్స్ చేసుకోవాలా అని చూస్తున్నారు. ఇలా అందరూ వెయింటింగ్ లో ఉండగానే అమ్మడిని మాస్ హీరో ఎగరేసుకుపోయినట్లు టాక్ విన్పిస్తోంది. త్వరలో తెరకెక్కనున్న ‘బెంగాల్ టైగర్’ మూవీ కోసం డైరెక్టర్ రాశిని ఎంపిక చేసినట్లు ఫిలింనగర్ వర్గాల సమాచారం.
ఈ మూవీలో తమన్నా లీడ్ రోల్ చేస్తుందని ఇప్పటికే మూవీ యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. దీంతో అమ్మడిది సెకండ్ ట్రాక్ క్యారెక్టర్ అంటే సెకండ్ లీడ్ అని చెప్తున్నారు. ‘పవిత్ర పుష్పం కావాలంటే దేవుడి మెడలోనే ఉండాలా.. పాదాల దగ్గరైనా పర్వాలేదు’ అన్నట్లుగా రవితేజ సినిమాలో ఎక్కడ ఉన్నా హీరోయిన్ హైలైట్ అవుతుంది. ఈ మూవీ రాశికి పెద్ద ఆఫర్ అనే చెప్పాలి. అయితే అమ్మడి ఎంపికపై మూవీ యూనిట్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ‘ఊహలు గుసగుసలాడే’లో సైలెంట్ క్యారెక్టర్ చేసిన రాశి.., రవితేజ లాంటి ఫుల్ ఎనర్జీ హీరో పక్కన సూట్ అవుతుందా అని డౌట్ కలుగుతోంది.
సంపత్ నంది డైరెక్ట్ చేయనున్న ‘బెంగాల్ టైగర్’ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె. రాధా మోహన్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నాడు. ఇకపోతే బాలీవుడ్ లో ‘మద్రాస్ కేఫ్’తో ఇండస్ర్టికి ఎంట్రీ ఇచ్చిన ముంబై మోడల్ తొలి సినిమాతోనే హాట్ గర్ల్ అన్పించుకుంది. నటనకు మంచి మార్కులు పడటంతో తెలుగులో ‘ఊహలు గుసగుసలాడే’లోకి తీసుకున్నారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more