Rajnikanth political life private company survey tamilnadu politics anna dmk jayalalitha tamil hero vijay

rajnikanth latest news, rajnikanth political party, rajnikanth political life, rajnikanth politics, rajnikanth hot news, rajnikanth politics, rajnikanth movies, linga movie, rajnikanth linga movie, tamilnadu politics, anna dmk party, former cm jayalalitha, tamil hero vijay, tamil hero vijay political party, rajniakanth jayalalitha, rajnikanth anna dmk party, tamil hero vijay news

rajnikanth political life private company survey tamilnadu politics anna dmk jayalalitha tamil hero vijay

రజనీకి అంతా సత్తా లేదంటున్న సర్వే!

Posted: 11/24/2014 03:57 PM IST
Rajnikanth political life private company survey tamilnadu politics anna dmk jayalalitha tamil hero vijay

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్’కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంతమేర వుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దక్షిణాది హీరో అయిన ఈయన.. తన నటనాప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను జమ చేసుకున్నారు. ఇతర ప్రాంతాభిమానుల విషయం కాస్త పక్కనపెడితే.. తమిళనాడులో వున్న ఫ్యాన్స్ మాత్రం రజనీని దేవుడితో పోలుస్తారు. ఈయన సినిమా ఏదైనా రిలీజ్ అవుతోందంటే.. ఆరోజు మొత్తం సెలవుదినంగా స్వయంగా ఫ్యాన్సే ప్రకటించుకుని, ఒక పండుగదినంలా జరుపుకుంటారు.

అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్’ను దృష్టిలో పెట్టుకునే పొలిటికల్ పార్టీలన్నీ రజినీని తమతమ పార్టీలోకి రప్పించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. రజనీ తమ పార్టీలో జాయిన్ అయితే.. తమ పార్టీకి యావత్తు దక్షిణ భారతదేశంలో మంచి ఫాలోయింగ్ వస్తుందని, ఖచ్చితంగా తమ పార్టీ ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నారు. అయితే రజనీ మాత్రం తాను ఎట్టిపరిస్థితుల్లోనూ పాలిటిక్స్’లోకి ఎంట్రీ ఇవ్వబోనని ఎంత క్లారిటీ ఇచ్చినా... పొలిటికల్ పార్టీలు మాత్రం తమవంతు కృషితో ఆయన్ను జాయిన్ చేయించుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రజనీకాంత్ స్వయంగా పార్టీ పెట్టి, ఎలక్షన్లలో పోటీ చేసినా పెద్దగా ప్రయోగం వుండదని.. ఆయనకు సీఎం అయ్యే హోదా తమిళనాడులో లభించదని ఒక సర్వే వెల్లడిస్తోంది. తమిళనాడులోని నియోజకవర్గాల వ్యాప్తంగా శాంపిల్స్ తీసుకునొ తాము అధ్యయనం చేశామని ఒక సర్వే సంస్థ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. జయమ్మ అక్రమాస్తుల కేసులో దోషిగా తేలడం, డీఎంకే పార్టీపై అవినీతో ఆరోపణలు చుట్టుకోవడం వంటి కారణాల వల్ల అన్నాడీఎంకేకి ఇక పొలిటికల్ కెరీర్ ముగిసిందని.. దీంతో రజనీకాంత్ పొలిటికల్ కెరీర్ కి అనుకూల పరిస్థితి ఏర్పడిందని చెబుతున్న కారణాలను ఆ సంస్థ కొట్టిపడేసింది.

తమిళనాటలో ఇప్పటికీ అన్నాడీఎంకేకి పొలిటికల్’లో అనుకూల పరిస్థితులు వున్నాయని.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా ఆయన పార్టీకే తిరుగులేని విజయం దక్కే అవకాశాలు చాలావరకు వున్నాయని ఆ సర్వే సంస్థ అంచనా వేసింది. అమ్మకు శిక్ష పడటాన్ని కేవలం 14 శాతం మంది తమిళులే సమర్థిస్తున్నారని.. 60 శాతం మంది ఆమెకు అనుకూలంగా వున్నారని ఈ సర్వేలో తేలిందట! ఆమె సీఎం కాకపోయినా.. జనాల ఓటు మాత్రం చాలావరకు అన్నాడీఎంకేకే వుంటాయని ఆ సర్వే తన నివేదికలో వెల్లడిస్తోంది. అంటే.. చాలామంది తమిళులు అమ్మకే ఎక్కువ మద్దతు తెలుపుతున్నారని సారాంశం!

అదే రజనీకాంత్ స్వయంగా పార్టీ పెడితే అందుకు కేవలం 17 శాతం మంది మాత్రమే మద్దతు వుంటుందని.. అదేవిధంగా మరో తమిళ హీరో విజయ్ పార్టీ పెడితే ఆయనకు 21 శాతం మంది మద్దతు తెలిపే అవకాశాలున్నాయని సర్వేలో పేర్కొన్నారు. అంటే.. రాజకీయరంగంలో సూపర్’స్టార్ రజనీకాంత్ స్వయంగా పార్టీ పెట్టి పోటీలో పాల్గొంటే పెద్దగా ప్రయోజనం వుండదని ఆ సర్వే అభిప్రాయాన్ని వెల్లడించింది. దీన్నిబట్టి చూస్తుంటే.. రజనీకి కేవలం సినిమాపరంగానే మంచి ఫాలోయింగ్ వుందని, పొలిటికల్ రంగంలో అంతగా లేదని తేలిపోయిందన్నమాట!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more

Today on Telugu Wishesh