Anushka agrees to do a film with pvp

anushka next movie, anushka latest news, anushka lady oriented movies, anushka rudramadevi photos, anushka birthday special, tollywood latest news, pvp productions movies, pvp abbrivation

anushka agrees to do a film with pvp : director prakash kovelamudi plans to make a movie with anushka and rumors that anushka also agrees to act in the movie. with pvp agreement anushka to come up with an other lady oriented movie

విజయశాంతి అవుతున్న యోగాటీచర్

Posted: 11/07/2014 01:33 PM IST
Anushka agrees to do a film with pvp

ఒకప్పుడు లేడి ఓరియంటెడ్ సినిమాలు అంటే వెంటనే గుర్తుకువచ్చే పేరు విజయశాంతి. హీరోయిన్ గా, ఆర్మీ అధికారి, కలెక్టర్, నక్సలైట్, టీచర్ ఇలా అనేక లేడి ఓరియంటెడ్ పాత్రల్లో నటించింది. అప్పట్లో సినిమా కూడా లేడీ సినిమా యాక్షన్ మూవీ అంటే విజయశాంతి అని ఊహించుకునేవారు. అంతలా సినిమాలు చేయటంతో పాటు, నటనను ప్రదర్శించింది. ఈ తరానికి కూడా మనకో విజయశాంతి ఉందండి. ఆమెవరో కాదు అందాల భామ అనుష్క షెట్టి. గ్లామర్ పాత్రలు, హీరోయిన్ వేషాలతో పాటు, లేడీ ఓరియంటెడ్ సినిమాలతో అభిమానులను సొంతం చేసుకుంది.

‘అరుంధతి’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగా.. తాజాగా ‘రుద్రమదేవి’లో భారీ అంచనాలు, బడ్జెట్ తో తెరకెక్కింది. దీంట్లో అమ్మడి ఫైట్స్, యాక్షన్, అద్బుతంగా ఉన్నాయని ఫొటోలు చూస్తే అర్థం అవుతుంది. ప్రస్తుతం ఈ మూవీ ఇంకా విడుదల కానేలేదు మరో లేడి కథతో సినిమా సిధ్దమయింది. ఇందుకు బొమ్మాళి కూడా ఓకే చెప్పేసిందుని ఫిలింనగర్ లో అనుకుంటున్నారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ దర్శకత్వం వహించనున్న కొత్త సినిమాలో అనుష్క నటించేందుకు అంగీకరించిందట. ఇక ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ పీవీపీ తెరకెక్కించనుందని తెలుస్తోంది.

ప్రస్తుతం కధకు సంబంధించి మార్పులు, తుది మెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది. చాలామంది డైరెక్టర్లు కధలతో సిద్ధంగా ఉన్నా.., రాఘవేంద్రరావు మార్కు కావటంతో నటించేందుకు అనుష్క డేట్లు అడ్జస్ట్ చేస్తోంది. అంటే అరుంధతిగా వచ్చిన రుద్రమదేవిని త్వరలో మరో యాక్షన్ కధలో చూడవచ్చన్నమాట. ఇది కెరీర్ కు బాగానే ఉపయోగపడుతున్నా.., ఇక అనుష్క అంటే లేడి ఓరియంటెడ్ సినిమా హీరోయిన్ అనే ముద్రపడే అవకాశం ఉంది. వీటిని జాగ్రత్తగా బేరిజు వేసుకుంటూ వెళ్తే మంచిది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anushka  tollywood  pvp  latest news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more