Tamanna bhatia bags the heroine chance in nagarjuna karthi multistarrer movie

tamanna bhatia, tamanna bhatia latest news, tamanna bhatia hot photos, tamanna bhatia hot gossips, tamanna bhatia hot gallery, tamanna bhatia latest photo shoot, nagarjuna, nagarjuna latest news, hero karthi, nagarjuna karthi multi starrer movie

tamanna bhatia bags the heroine chance in nagarjuna karthi multistarrer movie which is directed by vamsi paidipally and produced by pvp banner

దొరికిపోయిన తమన్నా.. బడాబాబులతో రొమాన్స్!

Posted: 10/27/2014 08:50 PM IST
Tamanna bhatia bags the heroine chance in nagarjuna karthi multistarrer movie

బాలీవుడ్ లో మిల్కీబ్యూటీ తమన్నా నటించిన సినిమాలన్నీ వరుసగా బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడ్డంతో తిరిగి టాలీవుడ్ కి వచ్చేసిన సంగతి తెలిసిందే! అయితే ఇక్కడ కూడా ఈ అమ్మడికి అటువంటి చేదు అనుభవమే ఎదురుకావడంతో ఐరెన్ లెగ్ గా పేరు తెచ్చేసుకుంది. దీంతో ఈ అమ్మడికి తమ సినిమాల్లో తీసుకోవాలా..? వద్దా..? అనే ఆలోచనల్లో పడిపోయారు దర్శకనిర్మాతలు! ‘‘బాహుబలి’’లాంటి ప్రతిష్టాత్మక చిత్రంలో ఒక కీలకపాత్రలో నటిస్తోందే తప్ప... మిగతా ఆఫర్లు ఇంకా ఏమీ రాలేదు. అందుకే.. తమ్ము సినిమా అవకాశాలకోసం సౌత్ చిత్రపరిశ్రమలో బాగానే చక్కర్లు కొడుతోందని సమాచారం! వరుస ఫ్లాపుల కారణంగా స్టార్ డమ్ ను కోల్పోయిన ఈ బ్యూటీ.. తిరిగి తన స్టార్ డమ్ ను సంపాదించుకోవడం కోసం నానాతంటాలు పడుతోందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ అమ్మడు ఇద్దరు బడాబాబులతో రొమాన్స్ చేయడానికి సిద్ధమైందనే వార్తలు బయటకు వస్తున్నాయి.

అసలు విషయం ఏమిటంటే.. అక్కినేని నాగార్జున - తమిళ హీరో కార్తీ కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతున్న విషయం ఇదివరకే తెలిసిందే! వంశీపైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పివిపి సంస్థ నిర్మించనుంది. ఇప్పటికే చాలా ఆలస్యం కావడంతో ఈ సినిమాను త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లాలనే ప్లాన్ లో వున్నారని చిత్రబృందం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో హీరోయిన్ల విషయంలో క్లారిటీ రాకపోవడం వల్లే ఇంతవరకు సెట్స్ పైకి వెళ్లలేదని యూనిట్ వర్గాలు తెలుపుతున్నాయి. మల్టీస్టారర్ కావడం వల్ల నిన్నమొన్నటివరకు ఇందులో ఇద్దరు హీరోయిన్లు వుంటారని అనుకున్నారు కానీ.. తాజాగా అందుతున్న సమాచారాల ప్రకారం ఒకే హీరోయిన్ వుంటుందని సమాచారం! అంటే ఈ ఇద్దరు బడాహీరోలు ఒకే హీరోయిన్ తో రొమాన్స్ చేయనున్నారన్నమాట!

ఈ సినిమాలో హీరోయిన్ కోసం ఎంతోమందిని విశ్లేషించిన అనంతరం చివరకు మిల్కీబ్యూటీ తమన్నాను తీసుకున్నారని యూనిట్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం! ఎంతోకష్టపడి అన్వేషిస్తే చివరకు తమకు తమన్నా దొరికిందని.. ఇద్దరు హీరోలతో రొమాన్స్ చేయడానికి తాను ఒప్పుకుందని చెప్పుకుంటున్నారు. తనకు ఆఫర్లు లేని సమయంలో ఇలా మల్టీస్టారర్ సినిమాలో రావడంతో ఆమె వెంటనే ఓకే అనేసిందని.. ఈ సినిమాతో తన దశ మళ్లీ తిరుగుతుందనే ఆశాభావంతో తమన్నా వున్నట్లు తెలుస్తోంది. గతంలో కార్తీ-తమన్నా హీరోహీరోయిన్లుగా రెండు తమిళ సినిమాల్లోనూ నటించారు. మరి ఈ మల్టీస్టారర్ సినిమాలో తమ్ము ఎవరికి దక్కుతుందనేది మాత్రం సస్సెన్స్!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tamanna bhatia  nagarjuna  hero karthi  pvp banner  director vamsi paidipally  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more