Junior ntr puri jagannath latest movie title fixed as temper according to film industry news

junior ntr news, junior ntr movies, junior ntr latest movie news, junior ntr puri jagannath movie news, puri jagannath junior ntr movie news, kajal agarwal latest news, junior ntr kajal agarwal news, junior ntr movie title temper, temper movie, junior ntr temper movie, balakrishna legend, junior ntr temper movie updates

junior ntr puri jagannath latest movie title fixed as temper according to film industry news

బాబాయ్ నోటిమాటను లాగేసుకున్న అబ్బాయ్!

Posted: 10/18/2014 08:34 PM IST
Junior ntr puri jagannath latest movie title fixed as temper according to film industry news

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆయర్, ‘‘లెజెండ్’’ బాలకృష్ణల మధ్య విభేదాలు వచ్చినట్లు గతంలో ఎన్నో వార్తాకథనాలు వచ్చిన విషయం తెలిసిందే! వ్యక్తిగత కారణాలో లేక రాజకీయపరంగానూ వారిమధ్య విభేదాలు వచ్చాయోలేదో తెలీదు కానీ.. ఇప్పటికీ వీరిమధ్య తగాదాలు వున్నట్లు వార్తలు వస్తూనే వున్నాయి. ఇటీవలే నందమూరి కుటుంబంలో జరిగిన పెళ్లికి జూ.ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ, కళ్యాణ్ రామ్ ఇద్దరూ హాజరయ్యారు కానీ.. ఎన్టీఆర్ మాత్రం కాలేదు. దీంతో వీరిమధ్య ఇంకా వ్యక్తిగత విభేదాలు వుండొచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి. ఆమధ్య బాలకృష్ణకు సినిమా షూటింగ్ నేపథ్యంలో ఎన్టీఆర్ స్పందించాడు కానీ... బాలయ్య ఆ విషయం మీద ఏమీ మాట్లాడలేదు. మొత్తంగా చెప్పదలచుకున్నదేమీటంటే... బాలయ్య, ఎన్టీఆర్ ల వ్యక్తిగతంగా ఒకేసారి మీడియా ముందుకు రాకపోవడంతో ఇంకా ఏవో లొసుగులు జరుగుతూనే వున్నాయని పుకార్లు వస్తున్నాయి.

ఇదిలావుండగా... వీరిమధ్య చీలికలున్న విషయం కాస్త పక్కనపెడితే.. తాజాగా జూ.ఎన్టీఆర్ తన బాబాయ్ నోటిమాటను లాగేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇది వీరి వ్యక్తిగత వ్యవహారమయితే కాదులెండి... ఒక సినిమాకోసం ఎన్టీఆర్ తన బాబాయ్ నోటిమాటను టైటిల్ గా పెట్టుకున్నట్లు ఫిలింనగర్ సమాచారం! అదేనండి... బాలయ్యా హీరోగా ఇటీవలే విడుదలై సరికొత్త రికార్డులు సృష్టించిన ‘‘లెజెండ్’’ సినిమాలో ‘‘టెంపర్ లేచుద్ది’’ అనే డైలాగ్ లోని ‘‘టెంపర్’’ అనే పదాన్ని తన సినిమా టైటిల్ గా పెట్టుకున్నాడనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో జోరందుకున్నాయి. గతంలో పూరీ - ఎన్టీఆర్ సినిమాకు ‘‘నేనోరకం’’ అనే టైటిల్ ను ఖరారుచేసినట్లు వార్తలు వచ్చాయి కానీ.. తర్వాత తమ చిత్రానికి ఇంకా ఏ టైటిల్ అనుకోలేదని దర్శకనిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా ఈ చిత్రానికి ‘‘టెంపర్’’ అనే టైటిల్ ఖరారయినట్లు ఇండస్ట్రీ నుంచి అందుతున్న సమాచారం!

ఈ సినిమాలో ఎన్టీఆర్ సరికొత్త పోలీస్ ఆఫీసర్ గెటప్ లో కనిపించబోతున్నాడనే వార్తలు ఇదివరకే వచ్చాయి. ఈ చిత్రంలో అతని డైలాగ్స్ హైలైట్ గా నిలుస్తాయని యూనిట్ వర్గాలు అంటున్నాయి. ఎన్టీఆర్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను బండ్లగణేష్ నిర్మించనున్నాడు. ‘‘దీపావళి’’ పండుగ సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఏకధాటిగా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ‘‘టెంపర్’’ అనే టైటిల్ ను ఖరారు చేస్తున్నట్లు ఇంకా అధికారికంగా వార్తలు రాలేదు. టైటిల్ సరికొత్తగా వుండేలా దర్శకనిర్మాతలు ఆలోచనల్లో పడిపోయారనే వార్తలు వస్తున్నాయి. మరి ఈ సినిమా టైటిల్ ‘‘టెంపర్’’గా వుంటుందా లేక మారుతుందా..? అనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : junior ntr  director puri jagannath  temper movie title  kajal agarwal  balakrishna news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more