Dasari narayana rao small class to mega fans about the clashes between him and chiranjeevi

dasari narayana rao, dasari narayana rao latest news, dasari narayana rao facebook, dasari narayana rao social media, dasari narayana rao social networking websites, dasari narayana rao chiranjeevi, dasari narayana rao chiranjeevi fight news, chiranjeevi latest news, chiranjeevi movie updates, chiranjeevi fans, mega fans

dasari narayana rao small class to mega fans about the clashes between him and chiranjeevi

‘‘మెగా’’భిమానులకు దాసరి పంచ్ డైలాగులు!

Posted: 10/16/2014 08:50 PM IST
Dasari narayana rao small class to mega fans about the clashes between him and chiranjeevi

గతంలో మెగాస్టార్ చిరంజీవి, దర్శకరత్న దాసరి నారాయణరావుల మధ్య విభేదాలు వచ్చిన విషయం తెలిసిందే! అయితే ఆ తర్వాత వీళ్లిద్దరూ అప్పుడప్పుడు కలుసుకోవడం, ముచ్చటించుకోవడం వంటి సందర్భాలు కెమెరాకి చాలాసార్లే దొరికాయి. వ్యక్తిగతంగా ఇప్పటికీ వీరిమధ్య విభేదాలు వున్నాయో లేవో తెలీదు కానీ... తెరమీద మాత్రం అన్యోన్యంగానే కనువిందు చేస్తుంటారు. అయితే ఇంతలోనే ఏమయిందో ఏమో తెలీదు కానీ.. తాజాగా దాసరి మెగాభిమానులకు దిమ్మతిరిగేలా కొన్ని పంచ్ డైలాగులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లవరకు చిరుకు, తనకు మధ్య విభేదాల వ్యవహారాన్ని చర్చించని దాసరి.. మరోసారి ఆ విషయాన్ని తెరమీదకు తీసుకొచ్చారు.

అసలు జరిగిన విషయం ఏమిటంటే.. గతకొంతకాలం నుంచి దాసరి నారాయణరావు ఫేస్ బుక్ ద్వారా తన అభిమానులతో ముచ్చటించడం మొదలుపెట్టారు. సినిమా విషయాలుగానీ, వ్యక్తిగత విషయాలుగానీ, రాజకీయపరంగాగానీ.. ఆయన ప్రతిఒక్క విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటున్నారు. అయితే అందులోనే మెగాభిమానుల నుంచి కూడా తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. గతంలో దాసరి, చిరుపై చేసిన కొన్ని ఘాటు వ్యాఖ్యానాల నేపథ్యంలో ఇప్పటికీ మెగాఫ్యాన్స్ ఆయనపై కోపంగానే వున్నట్లు తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ అందరూ ఆయనపై ఫేస్ బుక్ ద్వారా దాడి చేయడం మొదలుపెట్టేశారు. మొదట్లో ఈ విషయాన్ని లైట్ తీసుకున్న దాసరి.. రానురాను మరీ ఎక్కువ కావడంతో వారికి ఒక చిన్న క్లాస్ పీకినట్లు తెలుస్తోంది.

అదేమిటటే.. ‘‘అభిమానులందరూ హీరోల తరఫున నన్ను విమర్శించడం తప్పులేదు కానీ ప్రతి విషయాన్ని నెగెటివ్ గా తీసుకోవడం మంచిది కాదు. పరిశ్రమలో ఎవరికీ ఏది నష్టం వచ్చినా.. వారి తరఫున మాట్లాడటం నాకు అలవాటు. ఒక హీరో అనుకోని పరిస్థితుల్లో చనిపోతే.. ఎవరినో టార్గెట్ చేశానని ఆరోపణలు చేయడం తగదు. అదే నిజాన్ని రాస్తే ‘మా హీరో కూడా పేదవాడేనని’ మరొకరు కామెంట్ చేశారు. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అవసరమా? చనిపోయిన హీరోకి అవకాశాలు లేక ఫోన్ చేసిన పలకించేవాళ్లు లేకపోవడంతో కుమిలిపోయి ఆత్మహత్య చేసుకోవడం అబద్ధమా..? నేనూ పరిశ్రమలో ఒక బాధ్యత గల వ్యక్తిగా ఆ విషాదంపై బాధతో స్పందించాను. అది తప్పా..? ఎవరు చనిపోయినా ఇలాగే స్పందిస్తాను’’ అంటూ మొదట్లో చిన్న క్లాస్ పీకారు.

అలాగే మెగాస్టార్ చిరంజీవి పేరు ఎత్తకుండా ఆయన అభిమానులకు కూడా ఆయన పంచ్ డైలాగులు పేల్చారు. ‘‘అభిమానులందరూ ఏ హీరో కోసం అయితే మీరు నన్ను కామెంట్ చేశారో.. ఆ హీరో మీ అందరికంటే నాకు కావాల్సిన వాడు. ఆత్మీయుడు, బంధువు. నాలా అతను కూడా స్వయంకృషితోనే ఎదిగాడని చాలాసార్లు చెప్పాను. అప్పుడప్పుడు సభల్లో టాప్ హీరోల్లో అతని ప్రస్తావన కూడా తీసుకొచ్చాను. అయినా ఇప్పటికీ మీరంతా వ్యతిరేకంగా భావిస్తూ వ్యాఖ్యానాలు చేయడం ఎంతవరకు సమంజసం?’’ అంటూ అభిమానులనే ప్రశ్నించారు. చివరికి దాసరి ఇక్కడ ఇచ్చిన క్లారిటీ ఏమిటంటే... తనకు, ఇండస్ట్రీలో వున్న ఏ అగ్రహీరోలతోనూ ముఖ్యంగా చిరుతో ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dasari narayana rao  chiranjeevi  facebook  mega fans  tollywood  telugu news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more