Gopichand next movie name jill

gopichand next movie, gopichand jill movie, gopichand in jill movie, gopichand son, gopichand uv productions, latest telugu movies, uv productions movies, jill movie updates

gopichand latest movie name is jill : recently father turned gopichand acting in uv productions named as jill but its not confirmed by film unit the first look of this movie came as production no 3 got good response

ప్రొడక్షన్ నెం.3, లక్కీ నెంబర్ 2

Posted: 10/16/2014 01:34 PM IST
Gopichand next movie name jill

‘లౌక్యం’ తెలిసిన హీరోగా పేరు తెచ్చుకున్న గోపిచంద్ గురించి ఓ కొత్త విషయం తెలిసింది. ప్రస్తుతం ఈ హీరో యువి ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజా అప్ డేట్ ఏమిటంటే.., ఈ సినిమాకు ‘జిల్’ అనే పేరు పెట్టారట. అయితే దీన్ని ఇంకా అధికారికంగా దృవీకరించలేదు. టైటిల్ కు తగినట్లు క్యాప్షన్ (ట్యాగ్ లైన్) ఉంటే ఇదే ఫైనల్ అవుతుంది లేదు అంటే మారుతుంది అంటున్నారు. మిగతా హీరోల లాగానే టైటిల్ పరంగా గోపిచంద్ ఓ సెంటిమెంట్ ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.

గోపిచంద్ విషయానికి వస్తే గతంలో రెండు అక్షరాలతో వచ్చిన సినిమాలు ‘జయం’, ‘యజ్ఞం’, ‘లక్ష్యం’, ‘శౌర్యం’, తాజాగా ‘లౌక్యం’ సినిమాలు ప్రజాదరణ పొందాయి. కొత్తగా వస్తున్న సినిమాకు పరిశీలిస్తున్న పేరు ‘జిల్’ కూడ రెండు అక్షరాలే కావటం విశేషం. ఇంకో సంగతి ఏమిటంటే ఈ మద్య ‘లౌక్యం’ హిట్ సంతోషంతో పాటు హీరో తండ్రి కావటం మరో సంతోషం ఇవి కూడా రెండు విశేషాలేనని టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇక తాజా ప్రాజెక్టు అప్ డేట్స్ విషయానికి వస్తే.., శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ వీలయితే సంక్రాంతికి విడుదల కావచ్చు.. కుదరక పోతే ఆ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది.

‘మిర్చి’, ‘రన్ రాజా రన్’ సినిమాలు అందించిన యువి ప్రొడక్షన్స్ తీస్తున్న మూడవ సినిమా ఇది. దీనికి టైటిల్ పెట్టక ముందే.., ‘ప్రొడక్షన్ నెంబర్ 3’ అనే పేరుతో ఫస్ట్ లుక్ విడుదల చేశారు. . దీనికి మంచి స్పందన వచ్చింది. ఈ మూవీలో హీరోయిన్ గా ‘ఊహలు గుసగుసలాడే’ ఫేం రాశి ఖన్నా నటిస్తోంది. సంగీతం విషయానికి వస్తే మణిశర్మ తనయుడు సాగర్ మహతి అందిస్తున్నాడు. ఈ కధ ద్వారా రాధాకృష్ణ అనే డైరెక్టర్ ఇండస్ర్టీకి పరిచయం అవుతున్నాడు. మూవీకి సంబంధించి మరిన్ని విశేషాలు త్వరలోనే అందిస్తాము.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jill  gopichand  uv productions  latest updates  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more