Mahesh babu denies the rumours movie with tamil director shankar

mahesh babu, tamil director shankar, mahesh babu latest news, mahesh babu shankar, mahesh babu news, mahesh babu gallery, mahesh babu aagadu movie, aagadu movie news, mahesh babu movies, shankar movies

mahesh babu denies the rumours movie with tamil director shankar : Tollywood prince mahesh babu finally gave clarification on the rumours that he will do movie with tamil ace director shankar.

శంకర్ తో చేతులు కలిపిన మహేష్! కానీ...

Posted: 09/10/2014 10:54 AM IST
Mahesh babu denies the rumours movie with tamil director shankar

తమిళ ప్రముఖ దర్శకుడు శంకర్ తో కలిసి టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు త్వరలోనే ఓ సినిమా తీయబోతున్నారనే వార్త ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది. ఇటీవలే మహేష్ ‘‘ఆగడు’’ మూవీ ఆడియో ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా శంకర్ విచ్చేసిన సందర్భంలో ఈ పుకార్లు షికార్లు చేయడం మొదలయ్యాయి. దీంతో ప్రిన్స్ అభిమానులు చాలా సంతోష పడ్డారు. వీరిద్దరి కాంబినేషన్ లో అదిరిపోయే సినిమా రావడం ఖాయమని అందరూ ఆశించారు. కానీ.. మహేష్ బాబు మాత్రం వారి ఆశల మీద నీళ్లు చల్లేశారు. తాను శంకర్ తో కలిసి సినిమా తీయడం లేదని తేల్చి చెప్పేశారు.

మంగళవారం హైదరాబాద్ లో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన మహేష్ బాబు ఈ రూమర్ ని కొట్టిపారేశారు. తాను శంకర్ దర్శకత్వంలో నటించడం లేదని.. అలాంటి ప్రపోజల్ తన దగ్గరకు రాలేదని.. అసలు శంకర్ కీ తనకూ మధ్య సినిమా ప్రస్తావనే రాలేదని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఈ వార్తకు తెరపడినట్టైంది. నిన్నమొన్నటివరకు ఆనందంలో మునిగిపోయిన టాలీవుడ్ అభిమానులకు ఇది చేదునిజంగా మిగిలిపోయింది. ఇదిలావుండగా.. ఈ సమావేశ నేపథ్యంలోనే మహేష్ తన మూవీ గురించి మరిన్ని విషయాలను సరదాగా షేర్ చేసుకున్నారు.

ఇందులో భాగంగా మహేష్ ‘‘ఆగడ’’ మూవీ గురించి మాట్లాడుతూ.. ఈనెల 19వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. అలాగే.. ‘‘నేను ‘పోకిరి, దూకుడు’ చిత్రాల్లో పోలీస్ పాత్ర పోషించిినా.. పూర్తిస్థాయి పోలీస్ గా నటించడం ఇదే ప్రథమం. ఇందులో నా పాత్ర గత సినిమాలకంటే చాలా కొత్తగా, శక్తిమంతంగా వుంటుంది. ఇటీవలే నాన్నగారు ఈ సినిమా చూసి సూపర్బ్ గా వుందని చెప్పారు. ఆయన జడ్జిమెంట్ (కల)ను ‘ఆగడు’ సినిమా ఖచ్చితంగా నెరవేరుస్తుంది’’ అని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇక, తన అబ్బాయి గౌతమ్ మళ్లీ తెరపైకి ఎప్పుడు కనిపిస్తాడు..? అన్న ప్రశ్నకు చిరునవ్వుతో.. ‘‘వాడు ఇంకా చదువుకోవాలిగా!’’ అంటూ బదులిచ్చారు. త్వరలోనే కొరటాల శివ, పూరీజగన్నాథ్ లతో కలిసి సినిమాలు చేయనున్నట్టు వెల్లడించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu  director shankar  aagadu movie  superstar krishna  tollywood news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more