తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తరువాత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు .. కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకొని.. సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కొత్త రాష్ట్రం , కొత్త సర్కార్ ఏమిటో? ఎలా ఉంటుందో ? ఈ పాటికి అందరికి అర్థమైంది. అక్రమా ఆస్తుల పై ఉక్కు పాదం పెట్టిన కేసిఆర్ సర్కార్ దెబ్బకు.. కొన్ని చోట్ల పునాదులు నెలమట్టం అయ్యాయి. దీంతో.. బడా బాబులు కోర్టు మెట్లు ఎక్కిన విషయం తెలిసిందే. ఇలాంటి వారిలో టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున ఒకరు.
హైదరాబాదర్ లోని మాదాపూర్ వద్ద నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఉన్న విషయం తెలిసిందే. అయితే దీనిపై కేసిఆర్ సర్కార్ దృష్టి పెట్టి, ఇది అక్రమా ఆస్తి అంటూ ..తాటికాయాంత అక్షరాలతో.. నాగార్జున్ బిల్డింగ్ పై జీఎస్ఎంసీ వారు రాయటం జరిగింది. దీంతో ఖంగారుపడిన నాగార్జున వెంటనే హైకోర్టు ఆశ్రయించారు. నాగ్ ఫిటిషన్ పరిశీలించి.. కొంచెం ఉపశమనం కలిగించి, కేసిఆర్ సర్కార్ కు బ్రేక్ లు వేయటం జరిగింది. ప్రభుత్వ అధికారులు కూడా నాగార్జున ఎన్ కన్వెన్షన్ జోలికి వెళ్లటం మానుకున్నారు. కానీ గడిచిన ఈ నాలుగు రోజుల్లో ఏం జరిగిందో తెలియదు గానీ నాగార్జున్ మాత్రం ఎన్ కన్వెన్షన్ లోని ఒక బిల్డింగ్ ను తొలగించే పనిలో బిజీగా ఉన్నారు.
అయితే ఇప్పుడు టాలీవుడ్, కొన్ని మీడియా ఛానల్స్, నాగార్జున ఎన్ కన్వెన్షన్ విషయం పై కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. నాగ్ కోర్టు నుంచి ఉపశమనం పొందిన తరువాత తుమ్మిడిగుంట చెరువులోని నిర్మాణాలు ఎన్ కన్వెన్షన్ స్వయంగా కూల్చివేయటంతో అందరికి అనుమానం కలుగుతుంది. కేసిఆర్ సర్కార్ తీసుకున్న నిర్ణయం కరెక్టేనా? లేక నాగార్జున కేసిఆర్ సర్కార్ కు భయపడ్డడా? లేక నాగ్ తప్పు తెలుసుకొని, సరిదిద్దుకుంటున్నాడా? అనే అనుమానం అందరికి కలుగుతుందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
నాగ్ కోర్టులో ఎన్ కన్వెన్షన్ ఆస్తులు న్యాయ బద్దంగా సంపాదించినవే అని చెప్పి, ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ హాల్ నిర్మాణాలను కూల్చేటం చూస్తుంటే.. నాగ్ నిజంగానే భయపడినట్లు తెలుస్తోంది. లేకపోతే.. కేసిఆర్ సర్కార్ రాజకీయ ఒత్తిడి పెరగటంతో.. నాగ్ స్వయంగా కూల్చివేయటం జరిగిందా? లేక నాగ్ తప్పు తెలుసుకున్నాడా? అని ఆయన తరుపున వాదించిన లాయర్లు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదీ ఏమైన నాగ్ మాత్రం కేసిఆర్ సర్కార్ భయపడే భవనం హాల్ ను కూల్చుతున్నట్లు టాలీవుడ్ లో పుకార్లు వినిపిస్తున్నాయి. నాగ్ , కేసిఆర్ సర్కార్ మద్య ఏం జరిగిందో అనేది ..అంత పేరుమళ్లకే తెలియాలి.
RS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more