అవసరానికి అయినవాళ్ళే కదా సాయముండేది! తన మొదటి భార్య అమృతా సింగ్ తో విడాకులు తీసుకోవటంలో అనుభవమున్న సైఫ్ అలీ ఖాన్ తన రెండవ భార్య కరీనా అక్క కరిష్మాకి విడాకులు తీసుకోవటంలో దగ్గరుండి సాయం చేస్తున్నారట!
2003 లో ఢిల్లీ పారిశ్రామిక వేత్త సంజయ్ కపూర్ ని పెళ్ళి చేసుకున్న కరిష్మా కపూర్ కి ఆ సమయంలో సినిమా అవకాశాలు బాగానే ఉండేవి. వాళ్ళకి 2005 లో కూతురు సమైరా పుట్టిన తర్వాత వాళ్ళ మధ్య ఎడముఖం పెడముఖమైంది. దానితో ముంబైకి మకాం మార్చిన కరిష్మాకి సంజయ్ కి మధ్య మరోసారి రాజీ కుదరటంతో 2010 లో కుమారుడు కియాన్ రాజ్ కపూర్ ఉదయించాడు. అయితే సంజయ్ తనను మోసం చేస్తూ మరొకరితో సంబంధం పెట్టుకుంటున్నాడంటూ కరిష్మా అభియోగం.
ఏది ఏమైతేనేం ఇద్దరూ విడాకులకు సిద్ధమయ్యారు. అందులో ఎటువంటి పేచీలు లేకుండా పనంతా సాఫీగా సాగిపోవాలని కూడా కోరుకుంటున్నారు.
ఇంకేమిటి, నేనున్నానంటూ రంగంలోకి దిగాడు కరీనా భర్త సైఫ్ అలీ ఖాన్. తనకున్న అనుభవంలో ఎటువంటి చికాకులూ లేకుండా సులభంగా విడిపోయి ఎవరి ఆకుల్లో వారు విడివిడిగా తినటానికి ఏర్పాట్లను నేను చేస్తానంటున్నాడు. అంతే కాదు బాంద్రా కోర్టుకి కూడా కరిష్మాకి తోడుగా వెళ్లాడు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more