టాలీవుడ్ చరిత్రలో ఇప్పటివరకు ఇలాంటివి చర్చలు జరిగినట్లు గతంలో ఎన్నాడు జరగలేదని టాలీవుడ్ పెద్దలు అంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాన్ రాజకీయ పార్టీ పెడుతున్నారనే విషయం నాలుదిశలవైపుకు పాకిపోయింది.
దీంతో టాలీవుడ్ లో సినిమాలను పక్కన పెట్టి, పవన్ కళ్యాణ్ పార్టీ పై సుదీర్ఘ చర్చలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ పొలిటికల్ పార్టీ కోసం టాలీవుడ్ లో ఒక కమిటి పని చేస్తుందని టాలీవుడ్ వాసులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెడితే , యువ హీరోలు, ఆయన స్నేహితులు, అందరు పవన్ కే సపోర్టు చేస్తారు. అలాంటి వారిలో ఇప్పుడు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కూడా ఉన్నారు.
మహేష్ బాబు పబ్లిక్ లోకి పెద్దగా రాకపోయిన, పబ్లిసిటీలో నెం.1 గా దూసుకుపోతున్నాడు. ఇప్పుడు జరుగుతున్న రాజకీయలతో మహేష్ బాబుకు భయం పట్టుకుందని టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. మహేస్ బాబు, పవన్ కళ్యాణ్ మంచి స్నేహితులు, వీరిద్దరి మద్య ఎవరికి కనిపించిన ఆత్మీయత బంధం ఉందని టాలీవుడ్ టాక్ ఉంది.
ఒక వేళ పవన్ కళ్యాణ్ పార్టీ పెడితే.. తప్పనిసరిగా మహేష్ బాబు ఎన్నికల ప్రచారం రంగంలోకి దిగాలి. అందుకు మహేష్ బాబు సిద్దంగా ఉన్నప్పటికి, ఆయన కుటుంబం నుంచి ఒత్తిడి వస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల తెలుగుదేశం పార్టీలోకి గల్లా అరుణ కుమారి తనయుడు గల్లా జయదేవ్ చేరిన విషయం తెలిసిందే. గల్లా కుటుంబం, మహేష్ బాబు కుటుంబానికి బందువులు. అయితే టీడీపీలో చేరిన రోజే గల్లా జయదేవ్, మహేష్ బాబు రాజకీయల్లోకి రాడు గానీ, నా కోసం ఎన్నికల ప్రచారం చేస్తాడని మీడియా ద్వారా చెప్పటం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మహేష్ బాబు తలపట్టుకున్నట్లు సమాచారం.
అసలే రాజకీయాలకు దూరంగా ఉండే.. నన్ను ఇలా ఇబ్బంది పెట్టడం ఏం బాగాలేదని.. తండ్రి క్రిష్ణతో మహేష్ బాబు చెప్పినట్లు టాలీవుడ్ లో పుకార్లు నడుస్తున్నాయి. నా వ్యక్తి స్వేచ్చను కూడా ఇలా వాడేసుకుంటే నేనేం చెయ్యాలని మహేష్ బాబు తన సన్నిహితులతో చెప్పుకొని బాధపడినట్లు టాలీవుడ్ టాక్. ఇటు పవన్ కళ్యాన్ , అటూ కుటుంబం బంధువుల రాజకీయలతో మహేష్ బాబు భయపడుతున్నట్లు ఫిలింనగర్ వాసులు గుసగుసలాడుకుంటున్నారు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more