పాత జోక్ ఒకటి ఉండేది- ఒక అమెరికన్ సన్నటి సూదిని తయారు చేస్తే రష్యన్ దానికి అతి చాకచక్యంగా బెజ్జం పెట్టాడట. ఏదీ ఇటివ్వు అని తీసుకుని ఇండియన్ దాని మీద 'మేడ్ ఇన్ ఇండియా' అని రాసాడట. ఇది చాలా పాత జోక్. ఇప్పుడు ఉత్పాదనలో భారతదేశం మిగిలిన దేశాలకేమీ తీసిపోదనుకోండి.
ఎన్నో కష్టాలకోర్చి ఎంతో ఖర్చు చేసి ఎందరి సమిష్టి కృషి ఫలితంగా రూపొందేదే సినిమా. అంత కష్టపడ్డ సినిమా తీస్తే మొదటి వారంలోనే దాని ఫలితం వచ్చేస్తుంది- విజయమో వీరస్వర్గమో అన్నది. విజయం సాధించినా దాన్ని గద్దల్లా తన్నుకుపోయేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళే పైరసీ చేసే చోరులు. సినీరంగానికి పెద్ద శాపంలా తయారైందీ పైరసీ భూతం. ఎంత మంది భూతవైద్యులూ దీన్ని పట్టి సీసాలో బంధించలేకపోతున్నారు,
చివరకో పైరసీ భూతం 31 సంవత్సరాల మనోజ్ కుమార్ రూపంలో 25 కె కేమెరాతో సులభంగా రెండు గంటల సినిమాను మొట్టమొదటి షోలోనే చిత్రీకరిస్తూ థియేటర్లో దొరికిపోయాడు. ఇంకా ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ అతి పెద్ద భూతాన్ని పట్టివేసారన్న ఆనందం సినీ పరిశ్రమలో కలుగుతోంది.
పోలీసులు చూసి అరెస్ట్ చేసే సమయానికి మనోజ్ కుమార్ కాచిగూడ ఐనాక్స్ థియేటర్లో రెండు గంటల పైసా సినిమాని తన కాంపాక్ట్ కేమెరాలో రికార్డ్ చేసాడు. అతని నోట అతని వ్యాపార రహస్యాలు తెలుసుకున్న పోలీసులు మనోజ్ కుమార్ అలా ఎన్నో సినిమాలను మొదటి షో నాడే థియేటర్లో తన కేమెరాలో రికార్డ్ చేసి గుంటూరు లోని పూర్ణచంద్రరావుకి పంపిస్తే అతను టకటకా వాటి కాపీలను తీసేసి అమ్మేస్తుంటాడని చెప్పారు.
అయితే పైరసీ బారిన పడ్డ సినిమాలు ఎన్నో ఉన్నాయి కానీ, వాటిలోకెల్లా పెద్ద దెబ్బ తగిలింది పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాకి. థియేటర్లోకి రాకముందే పైరేటెడ్ కాపీలు నెట్లో పెట్టెయ్యటం జరిగింది. అయినా ఆ సినిమా రికార్డ్ కలెక్షన్లను సాధించిందంటే అది సమయానికి తీసుకున్న చర్యలు, పవన్ కళ్యాణ్ ఛరిష్మా వల్లనే. బద్రీనాథ్, 1 నేనొక్కడినే, ఎవడు, ఏమో గుర్రం ఎగరావచ్చు లాంటి సినిమాలన్నీ పైరసీ బారిన పడ్డవే.
ఇప్పటికైనా పైరసీ చేస్తున్న ఒక పెద్ద తిమింగలం దొరికటంతో సినీ పరిశ్రమ హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more