Director maruthi sentiment in radha movie

director maruthi, radha movie, Maruthi to direct Venkatesh Radha, Venkatesh Radha Movie, Venkatesh Radha Telugu Movie with Maruthi, Venkatesh Radha Movie in Maruthi Movie Direction, Venkatesh Radha Telugu Movie.

director maruthi sentiment in radha movie, maruthi name sentiment in radha movie

రాధాతో దర్శకుడు మారుతి సెంటిమెంట్?

Posted: 02/06/2014 07:46 PM IST
Director maruthi sentiment in radha movie

అతి తక్కువ సమయంలో ప్రముఖ దర్శకుల లిస్టులో చేరిపోయిన యువ దర్శకుడు మారుతికి ఇప్పుడు సెంటిమెంట్ తో ముందుకు పోతున్నాడు.  తక్కువ బడ్జెట్ తో సినిమాలు తీసి  నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్న దర్శకుడిగా టాలీవుడ్ లో పేరు తెచ్చుకున్నాడు. అయితే ఈరోజు  రాధాతో కలిసి .. తన సెంటిమెంట్ ను బయటపెట్టుకున్నారు. రాధా అంటే ఎవరో కాదులేండి.. టాలీవుడ్ విక్టరీ వెంకటేష్,  మారుతి దర్శకత్వంలో  రాధా అనే చిత్రం  షూటింగును  ఈరోజు ప్రారంభించారు.  ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు మారుతి, వి.వి. వినాయక్  క్లాప్ కొట్టారు. ఈ కార్యక్రమానికి  నిర్మాతలు రామానాయుడు, అల్లు అరవింద్, దర్శకుడు గోపిచంద్, కోనవెంకట్ తదితరులు  హాజరయ్యారు.  

అయితే ఇక్కడే  దర్శకుడు మారుతీ సెంటిమెంట్ ఏమిటో బయటపడింది. ఆయన సెంటిమెంట్ ఏమిటంటే.. తన పేరు మార్చుకున్నాడు. అంటే కొత్త పేరు పెట్టుకోలేదుగానీ,  తన పేరునే కాస్త సరికొత్తగా మార్చుకున్నాడు.  అంటే మారుతి( maruthi) అని గతంలో ఉండేది.  కానీ రాధా చిత్రంతో  ఆయన పేరు ఇప్పుడు  మారుతీ(maruthee ) గా మార్చుకున్నాడు. ఈ  సినిమా దర్శకుడు మారుతీకి  నాలుగో సినిమా కావటం,   వెంకటేష్ నయనతార  కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కాబట్టి  తన పేరును మార్చుకున్నట్లు ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి.  రాధా సినిమా వాల్ పేపర్ల పై కూడా   దర్శకుడు మారుతీ అని ఉంటాడం విశేషం. 

అయితే ఇంత సడన్ గా పేరును మార్చుకున్నారని  సినీ పెద్దలు అడగటంతో..  దర్శకుడు మారుతి నవ్వుతూ..  తానేమిటో రుజువు చేసుకోవటానికే అని చెప్పటం జరిగింది. అంటే  గతంలో   మారుతిని  బూతు దర్శకుడిగా టాలీవుడ్ లో కొంత మంది గుర్తించిన విషయం తెలిసిందే.   ఇక నుండి అలాంటి వాటికి దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే తన పేరును మార్చుకోవటం జరిగిందట.  అదీ కూడా  న్యూమరాలజీ  ప్రకారం తన పేరును కాస్త మార్చుకున్నట్లు  ఈ యువ దర్శకుడు చెప్పటం జరిగింది. ఇక దర్శకుడి మారుతీలో  రాధా సెంటిమెంట్ ఎలా ఉంటుందో చూడాలి.  అయిన సినిమావాళ్లకి  ఇలాంటి సెంటిమెంట్ ఉండటం సహజమే అని  సినిజనాలు అంటున్నారు. 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more