Telugu successful movie made disaster in hindi

Telugu successful movie made disaster in Hindi, Telugu Stalin movie, Jai Ho Hindi movie, Pokiri Telug movie

Telugu successful movie made disaster in Hindi

అరటిపండు వొలిచిచ్చినా తినలేని సల్మాన్

Posted: 01/29/2014 10:00 AM IST
Telugu successful movie made disaster in hindi

అన్నీ అమర్చి పెట్టినా నోట్లో వేసుకోలేనట్లు, అరటి పండు వొలిచిచ్చినా తినలేనట్లు ఉందంటున్నారు సల్మాన్ ఖాన్ జయ్ హో చూసినవాళ్ళల్లో చిరంజీవి స్టాలిన్ చూసినవారంతా.  స్టాలిన్ చిత్రం చూడనివాళ్ళు ఇంతోటి కథకు రిమేక్ కూడానా సల్మాన్ కి బుద్దుండాలి అంటున్నారు ఎందుకంటే చిరంజీవి నటించిన సినిమాల్లో బాగా పేరు వచ్చిన సినిమాల్లో స్టాలిన్ ఒకటి అని తెలియదు కనుక.

నిజానికి రిమేక్ చాలా సులభం.  కథ, స్క్రీన్ ప్లే నిర్మాణంలో తోడ్పడటంతో పాటు ఆ సినిమా సాధించిన విజయం కూడా ప్రోత్సాహమిస్తుంది.  ఇదొక్కటే కాదు తెలుగు సినిమా కథలలోని ఆత్మను వదిలేసి పైపై విషయాలను పట్టుకుని సినిమా కథను నాశనం చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. 

రికార్డ్ లను తిరగరాసిన మహేష్ బాబు పోకిరి సినిమా కథను సల్మాన్ ఖాన్ వాంటెడ్ లో చిత్రహింస చేసాడు.  అంతకు ముందు కూడా ఎన్నో మంచి తెలుగు సినిమాలు హిందీలో వాటి సుగంధాన్ని పోగొట్టుకుని కాగితం పూలుగా మారిపోయాయి.  శంకరాభరణం, యమగోల అలాంటివే. 

తెలుగులో స్టాలిన్ చూసి ఇష్టపడ్డ సోహైల్ ఖాన్ దాని శోభను హిందీలోకి తీసుకెళ్ళలేకపోయాడంటే అది దర్శకత్వంలో లోపమే.  మూడొందల కోట్లను వసూలు చేస్తుందనుకున్న జయ్ హో సినిమా మూడు రోజులు ఆడి కూలబడింది.  ఆ మూడు రోజులైనా ఆడటానికి కారణం సల్మాన్ ఖాన్ మీద అభిమానం, శని ఆదివారాలు రావటం.  సినిమా ప్రచారం వలన వచ్చిన క్రేజ్ వలన ఆ మూడు రోజులు కిక్కిరిసి ఆడిన థియేటర్లు బయటకు వచ్చిన టాక్ వలన బోసిపోతున్నాయి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more