Pawan no remuneration for gabbar singh 2

Pawan kalyan, Gabbar singh-2, Atharintiki Daredi, remuneration, 18 Crores, Pawan Kalyan Gabbar Singh 2, Actor Pawan Kalyan, Pawan Kalyan remuneration, Power Star Pawan Kalyan, Pawan Gabbar Singh 2, Gabbar Singh 2 Movie, Pawan in Gabbar Singh 2, Sampath Nandi

Power Star Pawan Kalyan wont be taking any remuneration for his upcoming film Gabbar Singh 2. Instead, Pawan will be taking the Nizam region collections and satellite rights of the film as remuneration said the reports.

పవన్ కళ్యాణ్ రూపాయి తీసుకోవడం లేదు ?

Posted: 12/24/2013 01:35 PM IST
Pawan no remuneration for gabbar singh 2

గబ్బర్ సింగ్ , అత్తారింటికి దారేది చిత్రాలు సూపర్ హిట్ కావడంతో పవన్ కళ్యాణ్ రేంజ్, ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయాయి. ఎంతలా అంటే ‘పవనిజం ’ రేంజ్ లో. ఈయనకు ఇంత క్రేజ్ రావడానికి కేవలం సినిమా హిట్లే కాదు.. ఈయన మంచి తనం కూడా. ఇక రెమ్యునరేషన్ విషయానికి వస్తే కూడా ఈయనే టాప్.

ప్రస్తుతం టాలీవుడ్ లో భారీ మొత్తం తీసుకుంటున్న హీరోగా కూడా పేరుంది. దాదాపు 16 నుండి 20 కోట్ల వరకు తీసుకుంటున్నాడని ట్రేడ్ వర్గాల సమాచారం. గబ్బర్ సింగ్ టైంలో దాదాపు 18 కోట్లు తీసుకున్నాడని అంటే... ఇప్పుడు దానికి సీక్వెల్ గా వచ్చే ‘గబ్బర్ సింగ్ 2 ’ ఇంకెంత తీసుకుంటాడో అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... గ‌బ్బర్ సింగ్ 2 కోసం ప‌వ‌న్ ఇప్పటి వ‌ర‌కూ చిల్లిగ‌వ్వ పారితోషికం కూడా తీసుకోలేద‌ట‌.

ఈ సినిమా త‌న స్నేహితుడు శ‌ర‌త్ మ‌రార్ కి ఎప్పుడో ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి ప‌వ‌న్ ఈ సినిమా చేస్తున్నాడని అంటున్నారు. కానీ..... నైజాం హ‌క్కుల్ని మాత్రం త‌న‌కే కావాల‌ని తన ఫ్రెండ్ కి చెప్పాడట. పవన్ సినిమాకు నైజాం ఏరియాలో ఫుల్ కలెక్షన్లు వస్తాయి. అందుకే దానికి హక్కుల్ని ఇవ్వాలని ఖండిషన్ పెట్టాడట. అత్తారింటికి దారేది సినిమాకి గానూ నైజాంలో దాదాపు రూ.20 కోట్లు వ‌సూళ్లు ద‌క్కాయ‌ని తెలిసింది.

ఈ లెక్కన చూసుకుంటే పవన్ అందరికంటే ఎక్కువే తీసుకుంటున్నాడని అనుకోవచ్చు. కానీ కొంతమంది మాత్రం పేరుకు రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని ప్రచారం చేసి, ఆయన్ను హైలైట్ చేస్తున్నారని, అంత ఉదారత ఉన్నవాడు అయితే ఏరియా హక్కుల్ని కూడా కూడా తీసుకోకూడదని అంటున్నారు. అటు స్నేహితుడికి ఇచ్చిన మాట నిల‌బెట్టుకొంటూనే, సైలెంటుగా రూ.20 కోట్లు గుంజుతున్నాడని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more