Exclusive interview chinnari pellikuthuru heroine anandhi

Exclusive Interview Chinnari Pellikuthuru Heroine Anandhi

Exclusive Interview Chinnari Pellikuthuru Heroine Anandhi

చినారి పెళ్ళి కూతరు హీరోయిన్ అనంది

Posted: 08/09/2012 12:11 PM IST
Exclusive interview chinnari pellikuthuru heroine anandhi

Anandi_interview

Anandiఅమాయకమైన ముఖం, అంతకంటే అమాయకంగా అడిగే ప్రశ్నలు, తెలిసీ తెలియక చేసే చిలిపి పనులు వెరసి ఆనంది... ‘చిన్నారి పెళ్లికూతురు’లో కథానాయిక. ఆ పాత్రకు ప్రాణం పోసిన నటి... అవికా గోర్. ఓ డబ్బింగ్ సీరియల్‌ను తెలుగువారు అమితంగా ఆదరించారంటే దానికి కారణం ఆమె నటనే! అతి చిన్న వయసులోనే పరిణతి చెందిన నటనను ప్రదర్శించిన అవికా... ఇప్పుడు మరో హిందీ సీరియల్‌లో హీరోయిన్‌గా చేస్తోంది. తన కెరీర్ గురించి ఆమె చెప్పిన విషయాలు.

నటి కావాలని ఎందుకనిపించింది?

చిన్నప్పట్నుంచీ గ్లామర్ ఫీల్డ్ మీద చాలా ఆసక్తి. అమ్మానాన్న కూడా అందుకు అడ్డు చెప్పలేదు. దాంతో పెద్ద మోడల్‌ని అవ్వాలని కలలు కనేదాన్ని. ఎప్పటికైనా మిస్ యూనివర్స్ కావాలన్నది నా లక్ష్యం. అయితే అనుకోకుండా కొందరు నిర్మాతలు పిలిచి అవకాశాలు ఇవ్వడంతో చిన్న వయసులోనే నటిగా మారాను.

చైల్డ్ ఆర్టిస్టులు చాలామంది ఉంటారు. కానీ మీ ప్రత్యేకత ఏమిటి?

నిజమే. చిన్నప్పుడే నటించేవాళ్లు చాలామంది ఉంటారు. కానీ అందరికీ మంచి పాత్రలు వస్తాయని గ్యారంటీ లేదు కదా! నాకు వచ్చాయి. అదే నా ప్రత్యేకత.

‘ఆనంది’గా మారిన వైనం..?

అప్పటికే నేను కొన్ని సినిమాలు, సీరియల్స్ చేశాను. వాటిలో నా నటన చూసి ‘బాలికావధు (చిన్నారి పెళ్లికూతురు ఒరిజినల్)’లో అవకాశం ఇచ్చారు. అందుకుముందు నటించినా అవన్నీ మామూలు పాత్రలు. కానీ ఇది అలా కాదు. నాలో ఓ మంచి నటి ఉందని అందరికీ తెలియజేసింది.

చిన్న వయసులో అంత బరువైన పాత్ర చేయడం ఎలా అనిపించింది?

కాస్త కష్టపడాల్సి వచ్చింది కానీ మరీ అంత కష్టమైతే కాలేదు. అప్పటికే నటన అలవాటయ్యింది కదా! ఆనంది అల్లరి చేస్తుంది. తెలివిగా మాట్లాడుతుంది. ఒక్కోసారి విపరీతంగా పేచీ పెడుతుంది. ఒక్కోసారి పెద్దవాళ్లలా ప్రవర్తిస్తుంది. రకరకాల షేడ్స్ ఉన్న పాత్ర. చేసేటప్పుడు చాలా ఎంజాయ్ చేశాను.

Anandi_2ఆ పాత్రకీ మీకూ పోలికలేమైనా ఉన్నాయా?

బోలెడన్ని ఉన్నాయి. నేను కూడా అచ్చం ఆనంది లాంటిదాన్నే. గడగడా మాట్లాడ తాను. తెగ ప్రశ్నలేసి విసిగిస్తూ ఉంటాను. (నవ్వుతూ) కానీ ఆనందిలా చిన్న వయసులోనే పెళ్లి మాత్రం చేసుకోలేదు.

ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి?

మా టీమ్ దగ్గర్నుంచి పెద్ద పెద్ద నటీ నటుల వరకూ చాలామంది ప్రశంసిం చారు. నా నటన కోసమే ఆ సీరియల్ చూస్తున్నామని కొందరు చెప్పడం చాలా సంతోషాన్ని కలిగించింది. ఇంకా చెప్పాలంటే, ఆ సీరియల్‌లో నటించడం మొదలుపెట్టాకఅందరూ నా అసలు పేరును మర్చిపోయారు. ఆనందీ అని పిలవడం మొదలుపెట్టారు.

సీరియల్‌లో మీ పాత్ర ముగిసిపోయినప్పుడు ఎలా అనిపించింది?

(హిందీ వెర్షన్‌లో హీరోయిన్ వయసు పెరగడంతో అవికా స్థానంలో ప్రత్యూష బెనర్జీ అనే అమ్మాయి నటిస్తోంది. తెలుగులో సీరియల్ ఇంకా అంతవరకూ రాలేదు) కాస్త ఫీలయ్యా. ఇక రేపట్నుంచి నేనీ సీరియల్‌లో ఉండను కదా అనుకున్న ప్పుడు ఏదోలా అనిపించింది. ఏం చేస్తాం! చిన్నారి పెళ్లికూతురు పెద్ద వయసు పెళ్లికూతురయింది. నేనేమో చిన్నదాన్ని. అందుకే తప్పుకోవాల్సి వచ్చింది.

చిన్నారి పెళ్లికూతురు తర్వాత కాస్త గ్యాప్ వచ్చిందా?

అవును. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్‌గా మారే సమయంలో వచ్చిన గ్యాప్ అది. అది కూడా చాలా తక్కువ సమయమే. మధ్యలో ఒకట్రెండు సినిమాలు కూడా చేశాను. ఆ తర్వాత కలర్స్ చానల్‌లో ‘ససురాల్ సిమర్‌కా’ సీరియల్‌లో ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా ఎంపికయ్యాను. చాలా మంచి పాత్ర!

అది కూడా వయసుకు మించిన పాత్రే కదా?

నిజమే. పెళ్లై, పెద్దింటి కోడలిగా బాధ్యతా యుతంగా ప్రవర్తించే పాత్ర. నా వయసు తక్కువైనా, దానికి సరిపోతానని తెలుసు కాబట్టి ఓకే అన్నాను.

Anandi_1తెలుగువారికీ నచ్చారు. అవకాశం వస్తే తెలుగులో చేస్తారా?

తప్పకుండా. ఇక్కడ కూడా నన్నెంతో అభిమానిస్తున్నారు. అది నాకెంత సంతోషాన్నిస్తుందో చెప్పలేను. మంచి అవకాశం దొరికితే తెలుగులో తప్పక నటిస్తా.

ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి?

సినిమాలు, సీరియల్స్, రియాలిటీ షోలు... నా ప్రతిభను నిరూపించుకోవడానికి వచ్చే ఏ అవకాశాన్నీ నేను వదులుకోను. అంతే కాదు, ఓ సినిమా చేస్తున్నప్పుడు దర్శకుడు ప్రియదర్శన్ గారిని చూసి చాలా ఇన్‌స్పైర్ అయ్యా. అవకాశం దొరికితే ఆయన దగ్గర అసిస్టెంట్‌గా చేరిపోతా. అయితే... ఎన్ని చేసినా మిస్ యూనివర్స్ అవ్వాలన్న లక్ష్యాన్ని మాత్రం ఎప్పటికీ వదులుకోను.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Interview with prachi desai

    టీవి కమ్ యాక్ట్రస్ ప్రాచీదేశాయ్

    Aug 24 | టెలివిజన్ సీరియళ్లలో నటించినవాళ్లను సినిమా ఇండస్ట్రీ చిన్నచూపు చూస్తుంది అంటారు కొందరు. టీవీ వాళ్లు సినిమాలకు సరిపోరు అంటారు ఇంకొందరు. ఇలాంటి కామెంట్లన్నింటికీ ఒకే ఒక్క సమాధానం... ప్రాచీ దేశాయ్. ‘కసమ్‌సే’ సీరియల్‌లో మెరిసి,... Read more

  • Interview with mogalirekulu fame karuna

    మొగలిరేకులు ఫేం కరుణతో

    May 15 | 'బాలభవన్ ' నుండి 'బుల్లితెర ' వరకు కరుణ ప్రయాణం ... యావత్ టెలివిషన్ సీరియల్స్ అభిమానులనే ఉర్రూతలూగిస్తున్న సీరియల్ , శ్రీకాంత్ ప్రొడక్షన్స్ వారు అందించే 'మొగలిరేకులు' . ప్రతీ రోజు రాత్రి... Read more

  • Interview with goreti venkanna

    ప్రజా గాయకుడు గోరేటి వెంకన్న

    Mar 26 | అందరికీ ఎలా గుర్తుండి పోవాలని కోరుకుంటారు?ఒక చెట్టులా... పుట్టలా... పక్షిలా... ప్రకృతిలో ఒక భాగంలా. అంతేతప్ప, ఓ గొప్ప వ్యక్తిగానో, మరో రకంగానో కాదు. తరచుగా వాడే మాట?నీ కాల్మొక్త! చాలాసార్లు నా నోటినుంచి... Read more

  • Tv actor gurmeet choudhary interview

    Mar 08 | సీరియల్‌లో హీరో అంటే ఎలా ఉంటాడు? కూల్‌గా, సాఫ్ట్‌గా, సింపుల్‌గా ఉంటాడు. ఇది గురుమీత్ చౌదరి రాక ముందు! అతడు అడుగుపెట్టాక సీరియల్ హీరో మారిపోయాడు. కండలు తిరిగిన శరీరం, రిచ్ లుక్‌తో మోడల్‌కి... Read more

  • Mogalirekulu ravi krishna interview

    మొగలిరేకులు రవి కృష్ణ ఇంటర్వ్యూ

    Feb 26 | ప్రశాంతంగా కనిపిస్తాడు. అందంగా నవ్వుతాడు. అంతకంటే అందంగా నటిస్తాడు. అందరినీ ఆకట్టుకుని అలరిస్తాడు. అతడే రవికృష్ణ. ఇలా చెబితే ఎవరికీ తెలియకపోవచ్చు. మొగలిరేకులు ‘దుర్గ’ అంటే మాత్రం ఠక్కున గుర్తు పట్టేస్తారు. సెల్వస్వామి కొడుకుగా,... Read more