Mogalirekulu ravi krishna interview

mogalirekulu ravi krishna interview

mogalirekulu ravi krishna interview

మొగలిరేకులు రవి కృష్ణ ఇంటర్వ్యూ

Posted: 02/26/2013 08:45 PM IST
Mogalirekulu ravi krishna interview

ravi_krishnaప్రశాంతంగా కనిపిస్తాడు. అందంగా నవ్వుతాడు. అంతకంటే అందంగా నటిస్తాడు. అందరినీ ఆకట్టుకుని అలరిస్తాడు. అతడే రవికృష్ణ. ఇలా చెబితే ఎవరికీ తెలియకపోవచ్చు. మొగలిరేకులు ‘దుర్గ’ అంటే మాత్రం ఠక్కున గుర్తు పట్టేస్తారు. సెల్వస్వామి కొడుకుగా, పల్లవి ప్రేమికుడిగా పాత్రలో ఒదిగిపోయి కనిపించే రవికృష్ణ చెబుతోన్న కబుర్లు...

హాయ్ దుర్గా... ఎలా ఉన్నారు?

(నవ్వుతూ) మీరూ అలానే పిలుస్తున్నారా?

‘మొగలిరేకులు’ వల్ల అసలు పేరు పోయి, నా పేరు ‘దుర్గ’గా ఫిక్సైపోయింది.

ఇంతకీ, మొగలిరేకుల్లో చాన్‌ ఎలా వచ్చింది?

అది చెప్పాలంటే మా ఊరి నుంచి మొదలుపెట్టాలి. మాది విజయవాడ. నాన్న నన్నో పెద్ద ఉద్యోగిని చేయాలను కున్నారు. కానీ నాకు చిన్నప్పట్నుంచీ నటనంటే చాలా ఇష్టం. కానీ ఎవరికీ చెప్పలేదు. నలంద కాలేజీలో బీఎస్సీ పూర్తి చేసి, ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాను. కానీ మనసంతా నటన చుట్టూ తిరిగేది. అంతలో ఓ ఫ్రెండ్ ద్వారా అసిస్టెంట్ డెరైక్టరయ్యే చాన్స్ వచ్చింది. యాక్టింగ్ నేర్చుకోవచ్చు కదా అని చేరాలని డిసైడయ్యాను.

అయితే నటుడవుదామని సహాయ దర్శకుడయ్యారన్నమాట..?

ఎక్కడయ్యాను! అక్కడికి వెళ్లాక మంజులా నాయుడుగారి ఫ్రెండ్ మెహెర్ నన్ను చూశారు. ‘డెరైక్షన్ చేయడానికొచ్చావెం దుకు, నువ్వు నటుడిగా బాగుంటావు’ అంటూ శ్రీకాంత్ ప్రొడక్షన్స్‌కి పంపారు.

అవకాశం వెంటనే దొరికిందా?

నేను వెళ్లేసరికి అందరూ బిజీ. మూడు రోజుల పాటు పొద్దుట్నుంచీ సాయంత్రం వరకూ అక్కడే ఉండి, విసిగించి ఆడిషన్ చేయించుకున్నాను. నెల రోజుల తర్వాత మంజు మేడమ్ ఆఫీసు నుంచి పిలు పొచ్చింది. వెళ్తే ఆవిడ నాతో మాట్లాడి, ఇక వెళ్లిపొమ్మన్నారు. నాకు చాలా బెంగొచ్చే సింది. ఎందుకంటే, అప్పటికి ఈశ్వర్, శివ, ఫణి అగ్రిమెంట్లు రాస్తున్నారు. నాకు చాన్స్ ఇవ్వలేదే అని బాధగా వెళ్లిపో యాను. తర్వాత రోజు ఫోన్ చేసి, అగ్రిమెంట్ రాయకుండా వెళ్లిపోయావేంటి రమ్మన్నారు. అప్పుడు చూడాలి నా ఆనందం!

‘దుర్గ’కీ ‘రవికృష్ణ’కీ పోలిక ఉందా?

చాలా ఉంది. నిజానికిదుర్గ పాత్ర మొదట నెగిటివ్‌గా ఉండింది. కానీ నేను బయట అలా ఉండను. నవ్వుతూ, అందరితో కలుపుగోలుగా ఉంటాను. నన్ను అబ్జర్వ్ చేసిన బిందు మేడమ్, కావాలనే నా పాత్రను సాఫ్ట్‌గా మార్చేశారు. ‘భార్యా మణి’ సీరియల్లోనూ అలాగే జరిగింది. మొదట నెగిటివ్ అనుకున్న రోల్‌ను నాకు హీరో లుక్కుందని, పాజిటివ్ చేసేశారు.

బయటికెళ్లినప్పుడు అంతా గుర్తుపడతారా?

అమ్మో... ఊపిరాడనివ్వరు. దుర్గా దుర్గా అంటూ వచ్చేస్తారు. ఓసారి మా ఇంట్లో వాళ్లతో డిన్నర్‌కి వెళ్లా. అక్కడ ఒక కెమికల్ ఫ్యాక్టరీ ఓనర్ తన ఫ్యామిలీతో ఉన్నారు. ఆయన నన్ను చూసి చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అది తినండి, ఇది తినండి అంటూ ఆర్డర్ చేసేశారు. బిల్లు కూడా తానే కట్టేస్తానంటే బలవంతంగా ఆపాల్సి వచ్చింది. ఇలాంటివి చూసి నప్పుడు మా నాన్న ఎంత గర్వంగా ఫీలవు తుంటారో! ఇదంతా మంజు మేడమ్, బిందు మేడమ్, సుధాకర్‌సార్ల వల్లే. వాళ్లకి నేనెప్పుడూ రుణపడి ఉంటాను.

లేడీ ఫ్యాన్స్ కూడా ఎక్కువే ఉండి ఉండాలే?

బాగానే కాదు, బాగా.... ఉన్నారు. కొంతమందిని చూస్తే, అమ్మాయిలు ఇలాక్కూడా ఉంటారా అనిపిస్తుంది.

ఏం... ఇబ్బంది పెడుతుంటారా?

చాలా...! ఒకమ్మాయి నాకు ఫేస్‌బుక్‌లో తెగ మెసేజులు పెట్టేది. నేను రిప్లై ఇచ్చే వాడిని కాదు. ఒకసారైతే... తనకు ఒంట్లో బాలేదని, నేను ఫోన్ చేసేవరకూ మందు లేసుకోననీ అంది. తన నంబర్ ఇచ్చింది. నేను పట్టించుకోలేదు. దాంతో ఆమె ఫ్రెండ్సంతా మెసేజులివ్వడం మొదలె ట్టారు. ‘తనతో మాట్లాడు, మందులేసు కోవడం లేదు, తినడం లేదు’ అంటూ తినేశారు. చివరికి ఫోన్ చేయక తప్పలేదు. ఇంకొకమ్మాయి అయితే, నా ఫొటో తన ఫొటో పెట్టి వెడ్డింగ్‌కార్డ్ తయారు చేసింది. వామ్మో, మామూలు టెన్షన్ కాదు!

ఇంతకీ... మీకెలాంటి అమ్మాయిలు నచ్చుతారు?

ఇలా ఉండాలి, అలా ఉండాలి అని పెద్ద అభిప్రాయాలేమీ లేవు. కానీ ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. కాస్త బబ్లీగా కూడా ఉంటే బాగుంటుంది. భర్తతో పాటు అతని ఫ్యామిలీని కూడా ప్రేమించగలిగేదై ఉండాలి.సినిమాల వైపు వెళ్లే ఆలోచన ఏమైనా ఉందా?
ఉంది. చిన్నప్పుడు స్కూల్లో- నువ్వేమవు తావు అని టీచర్ అడిగితే అందరూ ఇంజినీర్, డాక్టర్, పోలీస్ అని చెప్పేవారు. నేను మాత్రం హీరో అనేవాడిని. ఇప్పటికీ అదే నా ఆశ. కొన్ని అవకాశాలు వచ్చాయి. కానీ ఏది పడితే అది చేసేయకూడదు కదా! అందుకే మంచి అవకాశం కోసం చూస్తున్నాను.

ఎప్పటికైనా చేసి తీరాలి అనుకునేదేంటి?

హీరోని కావడమే. ప్రస్తుతం అదే నా ముందున్న లక్ష్యం. మంచి మంచి సినిమాలు చేయాలి. ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’లో సూర్య లాగ డిఫరెంట్ రోల్స్ చేసి మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలి. అంతకంటే ఆశలు, ఆశ యాలు ఏమీ లేవు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tv actor gurmeet choudhary interview
Tv artist sridhar interview  
Rate This Article
(3 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Interview with prachi desai

    టీవి కమ్ యాక్ట్రస్ ప్రాచీదేశాయ్

    Aug 24 | టెలివిజన్ సీరియళ్లలో నటించినవాళ్లను సినిమా ఇండస్ట్రీ చిన్నచూపు చూస్తుంది అంటారు కొందరు. టీవీ వాళ్లు సినిమాలకు సరిపోరు అంటారు ఇంకొందరు. ఇలాంటి కామెంట్లన్నింటికీ ఒకే ఒక్క సమాధానం... ప్రాచీ దేశాయ్. ‘కసమ్‌సే’ సీరియల్‌లో మెరిసి,... Read more

  • Interview with mogalirekulu fame karuna

    మొగలిరేకులు ఫేం కరుణతో

    May 15 | 'బాలభవన్ ' నుండి 'బుల్లితెర ' వరకు కరుణ ప్రయాణం ... యావత్ టెలివిషన్ సీరియల్స్ అభిమానులనే ఉర్రూతలూగిస్తున్న సీరియల్ , శ్రీకాంత్ ప్రొడక్షన్స్ వారు అందించే 'మొగలిరేకులు' . ప్రతీ రోజు రాత్రి... Read more

  • Interview with goreti venkanna

    ప్రజా గాయకుడు గోరేటి వెంకన్న

    Mar 26 | అందరికీ ఎలా గుర్తుండి పోవాలని కోరుకుంటారు?ఒక చెట్టులా... పుట్టలా... పక్షిలా... ప్రకృతిలో ఒక భాగంలా. అంతేతప్ప, ఓ గొప్ప వ్యక్తిగానో, మరో రకంగానో కాదు. తరచుగా వాడే మాట?నీ కాల్మొక్త! చాలాసార్లు నా నోటినుంచి... Read more

  • Tv actor gurmeet choudhary interview

    Mar 08 | సీరియల్‌లో హీరో అంటే ఎలా ఉంటాడు? కూల్‌గా, సాఫ్ట్‌గా, సింపుల్‌గా ఉంటాడు. ఇది గురుమీత్ చౌదరి రాక ముందు! అతడు అడుగుపెట్టాక సీరియల్ హీరో మారిపోయాడు. కండలు తిరిగిన శరీరం, రిచ్ లుక్‌తో మోడల్‌కి... Read more

  • Interview with sanaya irani

    ఇంటర్వ్యూ విత్ సానయ ఇరాని

    Jan 02 | కళకు భాషా భేదాలు ఉండవన్న మాట, నటన విషయంలో ముమ్మాటికీ నిజమేననిపిస్తుంది. కాబట్టే మన తెలుగు ప్రేక్షకులు డబ్బింగ్ సీరియల్స్‌ని సైతం ఆదరిస్తున్నారు. ఇటీవలి కాలంలో మనవారి మనసులు దోచుకున్న డబ్బింగ్ సీరియల్స్‌లో ‘చూపులు... Read more