Tv actress jiaa manek interview

Jiaa Manek, jiaa manek age,height,biography,profile,interview, serials,awards,tv show, jhalak dikhla ja and in Sath Nibhana Sathiya.

Jiaa Manek is a very cute, young and highly talented new face in the Indian Television. Jiaa Manek plays the lead role in Star Plus serial Saath Nibhaana Saathiya

Tv Actress Jiaa Manek.png

Posted: 11/07/2012 06:47 PM IST
Tv actress jiaa manek interview

JIaa_Manik_interview

Jiaa_manekఆమె మనకు పరిచయమై ఎన్నో రోజులు కాలేదు. కానీ అందరూ అప్పుడే ఆమె పేరును కలవరిస్తున్నారు. ‘కోడలా కోడలా కొడుకు పెళ్లామా’ అంటూ రోజూ పలకరిస్తున్నారు. ఆమె నవ్వితే ఆనందపడుతున్నారు. ఆమె ఏడిస్తే జాలిపడుతున్నారు. ఇదంతా ఆమె తన ప్రతిభతో సాధించింది. తెలుగుపిల్ల కాకపోయినా, తన సహజమైన నటనతో తెలుగువారి మనసుల్లోనూ స్థానం సంపాదించుకున్న జియా మానెక్ అంతరంగమిది...

పుట్టినరోజు : ఫిబ్రవరి 18, 1986
నచ్చే రంగు : నీలం, గులాబీ
నచ్చిన సినిమా : దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే
నచ్చే హీరో : సల్మాన్‌ఖాన్
నచ్చే హీరోయిన్ : కరీనా కపూర్
హాబీలు : పాటలు వినడం, డ్యాన్స్ చేయడం
డ్రీమ్‌రోల్ : ‘జబ్ వియ్ మెట్’లో కరీనా పాత్ర

మీ బ్యాగ్రౌండ్ గురించి ?

నేను గుజరాతీ అమ్మాయిని. అహ్మదాబాద్‌లో పుట్టాను. కానీ నాన్న ఉద్యోగరీత్యా మహారాష్ట్రలో పెరిగాను. మాస్ మీడియాలో డిగ్రీ చేశాను.నటన వైపు అడుగులు ఎలా పడ్డాయి ?
కాలేజీ రోజుల్లో అనుకోకుండా అవకాశం వస్తే ఆడిషన్ చేశాను. లక్కీగా ఎంపికయ్యాను. అమూల్, వాటికా లాంటి కొన్ని ప్రముఖ ఉత్పత్తుల వాణిజ్య ప్రకటనల్లో నటించాను. ఆ తర్వాత సీరియల్స్‌లో అవకాశం వచ్చింది.సీరియల్స్‌కి వచ్చేటప్పటికే

కెమెరా అనుభవం ఉందన్నమాట...?

ఉంది. కానీ ఆ అనుభవం వేరు. ఈ అనుభవం వేరు. యాడ్స్ అంటే హావ భావాలకు పరిమితి ఉంటుంది. ఏవో చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తే సరిపోతుంది. పైగా అవి కొన్ని క్షణాల్లో పూర్తయిపోతాయి. కానీ సీరియల్స్ అలా కాదు కదా! సంవత్సరాల తరబడి వస్తాయి. ఒక్కోసారి ఒక్కోసీన్ కొన్ని నిమిషాల పాటు నిరాటంకంగా కొనసాగుతుంది. అంతసేపు ఆ ఎమోషన్‌ని క్యారీ చేయడం అంత ఈజీ కాదు.

‘సాత్ నిభానా సాథియా (‘కోడలా కోడలా కొడుకు పెళ్లామా’కి హిందీమాతృక)కు ముందు ఎన్ని సీరియల్స్ చేశారు?

ఒక్కటే. అది కూడా చాలా చిన్న పాత్ర. కానీ ఈ సీరియల్‌లో ఏకంగా మెయిన్ రోల్‌కే ఎంపికయ్యేసరికి నా ఆనందం అంతా ఇంతా కాదు. ఒక్క సీరియల్‌తోనే ఊహించనంత పాపులరైపోయాను.బయట కనిపిస్తే జనం స్పందనెలా ఉంటుంది?
ఏం చెప్పమంటారు! సీరియల్లో నేను ఎప్పుడూ సంప్రదాయ దుస్తుల్లోనే ఉంటాను. కానీ బయట చాలా మోడర్న్‌గా ఉంటాను. అయినా గుర్తు పట్టేసి పలకరిస్తారు. బాగా నటిస్తారని మెచ్చుకుంటూ ఉంటారు. ఒక్క సీరియలే చేసినా ఇంత అభిమానమా అని ఆశ్చర్యంగా ఉంటుంది. కేవలం ఒక్క పాత్రతోనే అందరికీ ఇంత దగ్గరైపోయి నందుకు ఆనందంగా కూడా ఉంటుంది.

డ్యాన్స్ కూడా బాగా చేస్తారట కదా?

నాకు డ్యాన్స్ చాలా ఇష్టం. ఈ మధ్యనే ‘ఝలక్ దిఖ్‌లాజా’ అనే డ్యాన్స్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నాను. మాధురీ దీక్షిత్, దర్శకుడు కరణ్ జోహార్, ఫేమస్ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజాలు న్యాయ నిర్ణేతలు. పోటీలో గెలవకపోయినా అలాంటి గొప్పవారి ముందు డ్యాన్స్ చేసిన గొప్ప అనుభూతి దక్కింది.

చాలామంది సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వెళ్లిపోతారు. మీరూ అంతేనా?

ఇప్పటివరకూ అయితే అలాంటి ఆలోచన లేదు. వస్తే అప్పుడు ఆలోచిస్తాను. అయితే మంచి అవకాశం వస్తే నటిస్తానని చెబు తాను కానీ, సినిమాల్లోకి వెళ్లిపోతాను అని అనను. ఎందుకంటే నాకు గుర్తింపు నిచ్చిన సీరియల్స్ అంటే నాకు చాలా ఇష్టం.

Jiaa_manek_సీరియల్లో ఏడుస్తూనే ఉంటారు. బయట ఎలా ఉంటారు మీరు?

నేనంత ఎమోషనలేం కాదు. చాలా బలమైన ఆలోచనలు, భావాలు నావి. అలాగని సీరియస్సేం కాదు. చాలా కూల్‌గా ఉంటాను. నా వయసు అమ్మాయి ఎలా ఉండాలో అలాగే సరదాగా, ఆడుతూ పాడుతూ ఉంటాను. పార్టీలకు వెళ్తాను.

భవిష్యత్ ప్రణాళికలేమిటి?

పెద్దగా ఏమీ లేవు. నేను చాలా పాజిటివ్. ఏది జరిగినా మన మంచికే అనుకుంటాను. అందుకే ఏ అవకాశం వచ్చినా వినియోగించుకుంటూ ముందుకెళ్తాను తప్ప ఇది చేయాలి, ఇది చేయకూడదు అని ముందే నిర్దేశించుకోను.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

 • Interview with prachi desai

  టీవి కమ్ యాక్ట్రస్ ప్రాచీదేశాయ్

  Aug 24 | టెలివిజన్ సీరియళ్లలో నటించినవాళ్లను సినిమా ఇండస్ట్రీ చిన్నచూపు చూస్తుంది అంటారు కొందరు. టీవీ వాళ్లు సినిమాలకు సరిపోరు అంటారు ఇంకొందరు. ఇలాంటి కామెంట్లన్నింటికీ ఒకే ఒక్క సమాధానం... ప్రాచీ దేశాయ్. ‘కసమ్‌సే’ సీరియల్‌లో మెరిసి,... Read more

 • Interview with mogalirekulu fame karuna

  మొగలిరేకులు ఫేం కరుణతో

  May 15 | 'బాలభవన్ ' నుండి 'బుల్లితెర ' వరకు కరుణ ప్రయాణం ... యావత్ టెలివిషన్ సీరియల్స్ అభిమానులనే ఉర్రూతలూగిస్తున్న సీరియల్ , శ్రీకాంత్ ప్రొడక్షన్స్ వారు అందించే 'మొగలిరేకులు' . ప్రతీ రోజు రాత్రి... Read more

 • Interview with goreti venkanna

  ప్రజా గాయకుడు గోరేటి వెంకన్న

  Mar 26 | అందరికీ ఎలా గుర్తుండి పోవాలని కోరుకుంటారు?ఒక చెట్టులా... పుట్టలా... పక్షిలా... ప్రకృతిలో ఒక భాగంలా. అంతేతప్ప, ఓ గొప్ప వ్యక్తిగానో, మరో రకంగానో కాదు. తరచుగా వాడే మాట?నీ కాల్మొక్త! చాలాసార్లు నా నోటినుంచి... Read more

 • Tv actor gurmeet choudhary interview

  Mar 08 | సీరియల్‌లో హీరో అంటే ఎలా ఉంటాడు? కూల్‌గా, సాఫ్ట్‌గా, సింపుల్‌గా ఉంటాడు. ఇది గురుమీత్ చౌదరి రాక ముందు! అతడు అడుగుపెట్టాక సీరియల్ హీరో మారిపోయాడు. కండలు తిరిగిన శరీరం, రిచ్ లుక్‌తో మోడల్‌కి... Read more

 • Mogalirekulu ravi krishna interview

  మొగలిరేకులు రవి కృష్ణ ఇంటర్వ్యూ

  Feb 26 | ప్రశాంతంగా కనిపిస్తాడు. అందంగా నవ్వుతాడు. అంతకంటే అందంగా నటిస్తాడు. అందరినీ ఆకట్టుకుని అలరిస్తాడు. అతడే రవికృష్ణ. ఇలా చెబితే ఎవరికీ తెలియకపోవచ్చు. మొగలిరేకులు ‘దుర్గ’ అంటే మాత్రం ఠక్కున గుర్తు పట్టేస్తారు. సెల్వస్వామి కొడుకుగా,... Read more

Today on Telugu Wishesh