Interview with mogalirekulu fame karuna

mogalirekulu fame karuna, TV actress akaruna, mogalirekulu serial,

Telugu TV Serial mogalirekulu fame karuna interview

మొగలిరేకులు ఫేం కరుణతో

Posted: 05/15/2013 05:34 PM IST
Interview with mogalirekulu fame karuna

'బాలభవన్ ' నుండి 'బుల్లితెర ' వరకు కరుణ ప్రయాణం ...

యావత్ టెలివిషన్ సీరియల్స్ అభిమానులనే ఉర్రూతలూగిస్తున్న సీరియల్ , శ్రీకాంత్ ప్రొడక్షన్స్ వారు అందించే 'మొగలిరేకులు' . ప్రతీ రోజు రాత్రి 8.30 కి జెమినీ టీవీలో ప్రసారమయ్యే ఈ సీరియల్ లో హీరోతో సమానంగా ప్రేక్షకులని ఆకట్టుకున్తున్నది , హీరోయిన్ 'దేవి' ... ఇంతకుముందు ఈ పాత్రని ఇంకో ప్రముఖ నటి లిఖితా కామినీ పోషించారు ... కొన్ని అనివార్యకారణాల వల్ల ఈమను తప్పించి నటి కరుణని 'దేవి' పాత్రలో నటింపచేస్తున్నాం అని ఒకానొక రోజు ఈ సీరియల్ మొదలవ్వగానే వచ్చిన స్క్రోలింగ్ చూసిన ప్రేక్షకులు , నిరుత్సాహానికి గురయ్యారు . అయితే , ఆనతి కాలం లోనే తన నటనతో , పాత్రని అద్భుతంగా ఓన్ చేసుకుని 'దేవి' గా అందరి మన్ననలు పొందుతున్నారు కరుణ ... తన మనసులో భావాలని కరుణ పంచుకున్నారు ;

'దేవి' గా నటించడానికి ...

కాస్త కష్టపడాల్సి వచ్చింది . ఇంతకుముందు 'దేవి' గా నటించిన 'లిఖిత' ని ప్రేక్షకులు స్వీకరించారు . ఇటువంటి సమయం లో నేను ఆ పాత్రలో 'లిఖిత' ను రీప్లేస్ చెయ్యాలంటే , ఎంతో చాలెంజింగ్ గా భయంగా కూడా అనిపించింది . నాకు సీరియల్స్ చూసే అలవాటు లేనందువల్ల , నెట్ లో ఇంతకుమునుపు ఎపిసోడ్స్ చూసి , 'దేవి' పాత్రని అబ్జర్వ్ చేసి , ఓన్ చేసుకుని నటించడం ప్రారంభించాను . ఆనతి కాలం లోనే ప్రేక్షకులు నన్ను 'దేవి ' గా యాక్సెప్ట్ చెయ్యడం చాల ఆనందంగా ఉంది . కరుణ గా నేను అందరికీ సుపరిచితం అయినా , 'దేవి' అని అందరు నన్ను గుర్తుపడుతుంటే , నిజంగా చాలా ఆనందంగా ఉంది . ఇంతటి పేరున్న సీరియల్ లో హీరోయిన్ పాత్ర పోషించడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను .

అసలు 'దేవి' ఎలా అయ్యాను అంటే ...

జీ తెలుగు లో ప్రసారం అయ్యే '-పసుపు  కుంకుమ' సీరియల్ లో నర్మదా పాత్రలో నటిస్తున్నప్పుడు  ఈ సీరియల్ టీం తో కలిసి ఒక గేమ్ షో లో పాల్గోన్నాను . అప్పుడే 'మొగలిరేకులు ' ,దర్శకురాలు  మంజు మేమ్ నన్ను చూసారు . ఆ తరువాత  నా తోటి నటి , స్నేహితురాలు అంజు ని 'అగ్ని పూలు సీరియల్ షూటింగ్ లో కలవడానికి వెళ్ళినప్పుడు ' దేవి ' గా నటిస్తావా ? అని మంజు మేమ్ అడగటంతో 'దేవి' నయ్యాను . తరువాత డేట్స్ కుదరకపోవడం తో 'పసుపు - కుంకుమ' మానేయ్యవలసి వచ్చింది .

కుటుంబం , షూటింగ్ లు ఎలా సాధ్యం అంటే ...

ఇది మాత్రం నా అదృష్టం ... మా వారు యాడ్ ఫిలిం మేకర్ ... తను నాకు కావలసినంత స్వేచ్చ , సహకారం అందిస్తారు ... ఇక మాకో బాబు , నేను షూటింగ్ అంటూ వచ్చేసిన తరువాత , సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్ళేంతవరకు , వాడి ఆలనా - పాలనా మా అత్తమ్మ , ఆడపడుచే చూసుకుంటారు . అయినా , జీవితాంతం నటిగా కొనసాగాలన్న ఆలోచన లేదు . అనుకోకుండా , సమ్మర్ క్యాంప్ లో పాల్గొనడానికి వెళ్ళినప్పుడు సినిమా వాళ్ల ఆడిషన్స్ లో నటిగా మారాను . 'శంకర్ దాదా M.B.B.S.' వంటి చిత్రాలలో హేమా హేమీల తో కలసి నటించే అవకాసం పొందాను . తరువాత 'యువ' సీరియల్ తో బుల్లితెరకు పరిచయం అయ్యాను , ఇప్పుడు 'మొగలిరేకులు' సీరియల్ లో హీరోయిన్ పాత్రను పోషిస్తున్నాను . కొంత కాలం తరువాత , నా వాళ్ళను చూసుకుంటూ గ్రుహిణిగానే కొనసాగుతాను . నటించినంత కాలం మాత్రం మంచి పాత్రలు పోషించాలన్నదే నా ఆలోచన .

తన మనసులో మాటను పంచుకున్న కరుణ , తానూ ఆశించిన విధంగానే మరిన్ని మంచి పాత్రలు పోషించి , బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువవ్వాలని ఆశిద్దాం .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Interview with prachi desai

    టీవి కమ్ యాక్ట్రస్ ప్రాచీదేశాయ్

    Aug 24 | టెలివిజన్ సీరియళ్లలో నటించినవాళ్లను సినిమా ఇండస్ట్రీ చిన్నచూపు చూస్తుంది అంటారు కొందరు. టీవీ వాళ్లు సినిమాలకు సరిపోరు అంటారు ఇంకొందరు. ఇలాంటి కామెంట్లన్నింటికీ ఒకే ఒక్క సమాధానం... ప్రాచీ దేశాయ్. ‘కసమ్‌సే’ సీరియల్‌లో మెరిసి,... Read more

  • Interview with goreti venkanna

    ప్రజా గాయకుడు గోరేటి వెంకన్న

    Mar 26 | అందరికీ ఎలా గుర్తుండి పోవాలని కోరుకుంటారు?ఒక చెట్టులా... పుట్టలా... పక్షిలా... ప్రకృతిలో ఒక భాగంలా. అంతేతప్ప, ఓ గొప్ప వ్యక్తిగానో, మరో రకంగానో కాదు. తరచుగా వాడే మాట?నీ కాల్మొక్త! చాలాసార్లు నా నోటినుంచి... Read more

  • Tv actor gurmeet choudhary interview

    Mar 08 | సీరియల్‌లో హీరో అంటే ఎలా ఉంటాడు? కూల్‌గా, సాఫ్ట్‌గా, సింపుల్‌గా ఉంటాడు. ఇది గురుమీత్ చౌదరి రాక ముందు! అతడు అడుగుపెట్టాక సీరియల్ హీరో మారిపోయాడు. కండలు తిరిగిన శరీరం, రిచ్ లుక్‌తో మోడల్‌కి... Read more

  • Mogalirekulu ravi krishna interview

    మొగలిరేకులు రవి కృష్ణ ఇంటర్వ్యూ

    Feb 26 | ప్రశాంతంగా కనిపిస్తాడు. అందంగా నవ్వుతాడు. అంతకంటే అందంగా నటిస్తాడు. అందరినీ ఆకట్టుకుని అలరిస్తాడు. అతడే రవికృష్ణ. ఇలా చెబితే ఎవరికీ తెలియకపోవచ్చు. మొగలిరేకులు ‘దుర్గ’ అంటే మాత్రం ఠక్కున గుర్తు పట్టేస్తారు. సెల్వస్వామి కొడుకుగా,... Read more

  • Interview with sanaya irani

    ఇంటర్వ్యూ విత్ సానయ ఇరాని

    Jan 02 | కళకు భాషా భేదాలు ఉండవన్న మాట, నటన విషయంలో ముమ్మాటికీ నిజమేననిపిస్తుంది. కాబట్టే మన తెలుగు ప్రేక్షకులు డబ్బింగ్ సీరియల్స్‌ని సైతం ఆదరిస్తున్నారు. ఇటీవలి కాలంలో మనవారి మనసులు దోచుకున్న డబ్బింగ్ సీరియల్స్‌లో ‘చూపులు... Read more