పెద్ద అంచు ఉన్న ప్లెయిన్ కాటన్ చీర, నల్లని కురులను ముడిచి వేసిన జారుముడి, నుదుటన సింధూరం, మెడలో నల్లపూసలు, ఏమాత్రం హద్దులు దాటని హావభావాలు... మొగలిరేకులు సీరియల్ చూసేవారెవరైనా చెప్పేస్తారు ఇది ఎవరి వర్ణనో. అవును... ఆమె ముమ్మాటికీ శాంతియే. ఆర్కే నాయుడు భార్యగా, ఉదాత్తమైన స్త్రీమూర్తిగా ఆ పాత్రలో ఒదిగిపోయిన నటి... షీలాసింగ్. కళ్లతోనే భావాలను పలికిస్తూ ప్రేక్షకులను కళ్లు తిప్పుకోనివ్వకుండా చేసే షీలా విశేష్ తో చెప్పిన ముచ్చట్లు...
మీ బ్యాగ్రౌండ్ గురించి చెప్పండి?
పుట్టింది, పెరిగింది డోర్నకల్‌లో. నాన్న మూలాలు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్నాయి. అయితే చాన్నాళ్ల క్రితమే వరంగల్ వచ్చి స్థిరపడిపోయారు. అమ్మది ఆంధ్రప్రదేశే. ముగ్గురు అన్నయ్యలు, ఒక అక్కయ్య తర్వాత పుట్టాను.
నటన మీద ఆసక్తి ఎలా కలిగింది?
ఆసక్తి ఏం లేదు. మా అక్క అత్తవారిది హైదరాబాద్. అక్కడ వారి పరిచయస్తులొకరు ‘సీమసింహం’లో ఒక సీన్ కోసం ఫైట్లు చేసే అమ్మాయి కావాలని చెబితే, మా అక్క కుంగ్‌ఫూ వచ్చిన నన్ను తీసుకెళ్లింది. అలా తొలిసారి నటించాను.ఆ తర్వాత కెరీర్ ఎలా సాగింది?
‘సీమసింహం’ నాటికి నేను పదో తరగతి చదువుతున్నాను. అందులో నటించి వెళ్లి పరీక్షలు రాశాను. ఇంటర్లో చేరదామను కుంటుండగానే మరికొన్ని అవకాశాలు రావడంతో, చదువుకు స్వస్తి చెప్పి, నీ మనసు నాకు తెలుసు, చంటిగాడు, ధైర్యం వంటి కొన్ని సినిమాల్లో నటించాను.
మరి సీరియల్స్‌కి ఎందుకొచ్చారు?
సినిమాల్లో అన్నీ చిన్న చిన్న పాత్రలే వచ్చేవి. ఒక సీన్‌కో రెండు సీన్లకో పరి మితమైపోవడం విసుగనిపించింది. ఇక సినిమాలు చేయకూడదని పెళ్లి ప్రయత్నాలు చేస్తుండగా ప్రియాంక సీరియల్‌లో అవకాశం వచ్చింది. మంచి పాత్ర కావడంతో అటువైపు మళ్లాను. ఇంకా
ఏయే సీరియల్స్ చేశారు?
ప్రియాంక తర్వాత నటి మధుమణి ద్వారా బొమ్మరిల్లు సీరియల్లో ప్రధానపాత్ర వచ్చింది. మంచి పేరు రావడంతో అవ కాశాలు వరుసగా వచ్చాయి. మా ఇంటి ఆడపడుచు, సింధూరం, మొగలిరేకులు, కన్యాదానం... ఇలా సాగిపోతోంది.‘మొగలిరేకులు’ శాంతి గురించి చెప్పండి?
ఆ పాత్ర తెచ్చిన ఇమేజ్ అంతా ఇంతా కాదు. ఎక్కడికెళ్లినా అందరూ శాంతి శాంతి అంటూ వచ్చేవారు. ఆ అవకాశం కూడా మధుమణిగారి ద్వారానే వచ్చింది. అప్పటివరకూ ఎంతో మందిని చూశారట. అయినా ఎవరూ నచ్చలేదట. షూటింగ్ రెండు రోజులుందనగా నాకు కబురు వచ్చింది. వెళ్లడం, సెలెక్ట్ అవడం చకచకా జరిగిపోయాయి.
మిమ్మల్ని అందరికీ దగ్గర చేసిన శాంతికీ మీకూ పోలికలేమైనా ఉన్నాయా?
ఎంతమాత్రం లేవు. శాంతి నెమ్మదిగా ఉంటుంది. నచ్చినా నచ్చకపోయినా అన్నీ మనసులోనే దాచుకుని సర్దుకుపోతుంది. కానీ నేను అందుకు విరుద్ధం. నచ్చనిదాన్ని సహించను. ఇది సరికాదని ముఖమ్మీదే చెప్పేస్తాను. నేనే కాదు, ఎవరైనా అలా భరించడం మంచిది కాదు.
అంత ఉదాత్తమైన పాత్ర చేసి, ‘కన్యాదానం’లో విలన్ క్యారెక్టర్ ఎందుకు చేస్తున్నారు?
ఇదే ప్రశ్న నన్ను చాలామంది అడిగారు. ‘శాంతి’గా మిమ్మల్ని చూసి, ఇంత క్రూరమైన పాత్రలో చూడలేకపోతున్నాం అన్నారు. కానీ నా నటన చూశాక, అప్పుడు చేయవద్దన్నవాళ్లే ఇప్పుడు బాగా చేస్తున్నావంటున్నారు.మళ్లీ సినిమాల వైపు వెళ్లే ఆలోచన లేదా?
ఇప్పుడు హీరోయిన్లకే నటనకు ఆస్కార మున్న పాత్రలు అంతగా దొరకట్లేదు. ఇక నాలాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులకి ఎక్కడ దొరుకుతాయి! ‘రాఖీ’లో ఎన్టీఆర్ చెల్లెలి పాత్రలాంటివేమైనా దొరికితే చేస్తాను.
మీ కెరీర్‌లో బెస్ట్ కాంప్లిమెంట్...?
ఇండస్ట్రీలో అందరూ ‘షీలా మంచిది, తన పని తాను చేసుకుపోతుంది, బాగా కష్టపడుతుంది అంటూ ఉంటారు. ఓ ఆడపిల్లకి అంతకు మించిన కాంప్లిమెంట్ ఏం కావాలి!
పెళ్లి... పిల్లలు...?
పెళ్లయ్యింది. మా వారి పేరు కళ్యాణ్. బట్టల వ్యాపారం చేస్తారు. మాది ప్రేమ వివాహం. తను చాలా కూల్‌గా ఉంటారు. అన్నిట్లో సపోర్ట్ చేస్తారు. చాలా ప్రేమ నేనంటే. పిల్లలు ఇంకా లేరు.
భవిష్యత్ ప్రణాళికలు...?
పెద్దగా ఏం లేవు. ఇలాగే మంచి పాత్రలు చేస్తూ ముందుకు పోవాలి. అయితే ఏదైనా ఆధ్యాత్మిక సీరియల్లో దేవత పాత్ర చేయాలనుంది. ఆ చాన్స్ కూడా వస్తే హ్యాపీ!
పుట్టినరోజు : మే 16
నచ్చే రంగులు : నలుపు, తెలుపు, నీలం
నచ్చిన సినిమాలు : మాతృదేవోభవ, మూగమనసులు
నచ్చే హీరోలు : అమితాబ్, షారుఖ్, నాగార్జున, మహేష్‌బాబు
నచ్చే హీరోయిన్లు : సావిత్రి, శ్రీదేవి, సౌందర్య
(And get your daily news straight to your inbox)
Aug 24 | టెలివిజన్ సీరియళ్లలో నటించినవాళ్లను సినిమా ఇండస్ట్రీ చిన్నచూపు చూస్తుంది అంటారు కొందరు. టీవీ వాళ్లు సినిమాలకు సరిపోరు అంటారు ఇంకొందరు. ఇలాంటి కామెంట్లన్నింటికీ ఒకే ఒక్క సమాధానం... ప్రాచీ దేశాయ్. ‘కసమ్‌సే’ సీరియల్‌లో మెరిసి,... Read more
May 15 | 'బాలభవన్ ' నుండి 'బుల్లితెర ' వరకు కరుణ ప్రయాణం ... యావత్ టెలివిషన్ సీరియల్స్ అభిమానులనే ఉర్రూతలూగిస్తున్న సీరియల్ , శ్రీకాంత్ ప్రొడక్షన్స్ వారు అందించే 'మొగలిరేకులు' . ప్రతీ రోజు రాత్రి... Read more
Mar 26 | అందరికీ ఎలా గుర్తుండి పోవాలని కోరుకుంటారు?ఒక చెట్టులా... పుట్టలా... పక్షిలా... ప్రకృతిలో ఒక భాగంలా. అంతేతప్ప, ఓ గొప్ప వ్యక్తిగానో, మరో రకంగానో కాదు. తరచుగా వాడే మాట?నీ కాల్మొక్త! చాలాసార్లు నా నోటినుంచి... Read more
Mar 08 | సీరియల్‌లో హీరో అంటే ఎలా ఉంటాడు? కూల్‌గా, సాఫ్ట్‌గా, సింపుల్‌గా ఉంటాడు. ఇది గురుమీత్ చౌదరి రాక ముందు! అతడు అడుగుపెట్టాక సీరియల్ హీరో మారిపోయాడు. కండలు తిరిగిన శరీరం, రిచ్ లుక్‌తో మోడల్‌కి... Read more
Feb 26 | ప్రశాంతంగా కనిపిస్తాడు. అందంగా నవ్వుతాడు. అంతకంటే అందంగా నటిస్తాడు. అందరినీ ఆకట్టుకుని అలరిస్తాడు. అతడే రవికృష్ణ. ఇలా చెబితే ఎవరికీ తెలియకపోవచ్చు. మొగలిరేకులు ‘దుర్గ’ అంటే మాత్రం ఠక్కున గుర్తు పట్టేస్తారు. సెల్వస్వామి కొడుకుగా,... Read more