ఆమె రూపం ఎంత అందంగా ఉంటుందో, నటన కూడా అంతే అందంగా ఉంటుంది. అందుకే నీరజ... తెలుగు ప్రేక్షకులు మనసులు గెలుచుకుంది. తులసీదళం, వసంతకోకిల, పద్మవ్యూహం, రక్త సంబంధం వంటి సీరియల్స్‌లో విభిన్నమైన పాత్రలు పోషించి, రెండు సార్లు నందిని గెల్చుకున్న ఆమె... పంచుకున్న భావాలు.
ఎక్కడ పుట్టారు? ఎలా నటి అయ్యారు?
పుట్టింది మచిలీపట్నం. పెరిగినదంతా హైదరాబాద్‌లో. మోడలింగ్ అంటే ఆసక్తి కావడంతో తరచూ వాణిజ్య ప్రకటనల్లో నటించేదాన్ని. అనుకోకుండా యండమూరి వీరేంద్రనాథ్ ‘తులసీదళం’ సీరియల్‌లో అవకాశం రావడంతో నటినయ్యాను.
ఇంతవరకూ ఎన్ని సీరియల్స్ చేశారు?
పద్నాలుగు చేశాను. ‘పసుపు-కుంకుమ’ నా పదిహేనో సీరియల్.ఇన్నేళ్ల కెరీర్‌లో కేవలం పద్నాలుగేనా?ఒక సమయంలో ఒక్క సీరియల్ చేయడానికే ఇష్టపడతాను. అందువల్లే పన్నెండేళ్లలో పద్నాలుగు సీరియల్సే చేశాను. మొదట నేను బాగా చేయగలనో లేదో చూద్దామని నటించడానికి సిద్ధ పడ్డాను. మొదటి సీరియల్‌కే మంచి పేరు రావడంతో నాపై నాకు నమ్మకం కలిగి కొన సాగించాను. అందుకే మంచి పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ వెళ్తాను తప్ప ఎక్కువ చేసేయాలన్న తపన లేదు. అయినా ఎన్ని చేశామన్నది కాదు, ఎంత మంచివి చేశామన్నదే ముఖ్యం!
ఇంతవరకూ చేసినవాటిలో నచ్చిన పాత్ర...?
‘వసంత కోకిల’ (దూరదర్శన్)లో చేసినది. పెర్‌ఫార్మెన్స్‌కి ఎంతో అవకాశమున్న పాత్ర. నిజానికది నా రెండో సీరియలే. అయినా నామీద నమ్మకంతో దర్శకులు ఉప్పలపాటి నారాయణరావు నాకు అవకాశమిచ్చారు. దానికి నాకు నంది అవార్డు వచ్చింది.
ఎప్పటికైనా చేయాలనుకుంటున్న పాత్ర ఏదైనా ఉందా?
అలాంటిదేం లేదు. ఇంతవరకూ చేసినట్టు గానే ఇకముందు కూడా రొటీన్‌గా కాకుండా వెరైటీగా ఉన్న పాత్రలే చేస్తాను. అయితే ఎందుకో సినిమాల్లో ఉన్నంత వైవిధ ్యతను ఇప్పటికీ సీరియల్స్‌లో చూపించలేకపోతున్నారు.
మీ కెరీర్‌లో బెస్ట్ కాంప్లిమెంట్?
‘వసంత కోకిల’లో కె.వి.వి.సత్యనారాయణ నాతో కలసి నటించారు. మొదట్లో ఆయనతో ఎవరో అన్నారట- ‘ఆవిడ చాలా మంచి నటి. నువ్వు ఆవిడ పక్కన నిలబడలేవు’ అని. దాంతో ఆయన కాస్త కంగారుపడ్డారట. తర్వాత తండ్రి చనిపోయిన సీన్ ఒకటి చేస్తున్నప్పుడు, నేను ఏడుస్తుంటే చూసి ఆయన కూడా ఏడ్చేశారట. తర్వాత నాతో అన్నారు, ‘నిజంగానే మీరు చాలా గొప్ప నటి. మీరు ఏడుస్తుంటే నాకు ఏడుపు ఆగలేదు’ అని!
నటిగా మీ ప్లస్/మైనస్ పాయింట్స్...?
నా ఫేస్ నాకు ప్లస్. ఎలాంటి భావమైనా త్వరగా కనిపిస్తుంది నా ముఖంలో. నాకు జ్ఞాపకశక్తి కూడా చాలా ఎక్కువ . ఎంత పెద్ద డైలాగ్ అయినా గుర్తుపెట్టుకుని చెప్పేస్తాను. ప్రామ్టింగ్ తీసుకోను. ఇక మైనస్ అంటే... పెళ్లయ్యాక కాస్త లావయ్యాను. మైనస్ అంటున్నారు... ఏమైనా ఇబ్బందులొచ్చాయా?సీరియల్స్ వరకూ లేదు. కానీ రెండు సినిమా అవకాశాలు పోయాయి. దిల్ రాజు నిర్మిస్తోన్న రెండు సినిమాల్లో నటించమని చాలారోజుల పాటు అడిగారు. కాకపోతే రెండు నెలలు టైమిస్తాం, కాస్త లావు తగ్గమన్నారు. కానీ నేను ఊ అనలేక పోయాను. ఎందుకంటే తక్కువ టైమ్‌లో ఒళ్లు తగ్గించుకోడానికి ఏవేవో చేసి లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే ఒప్పుకోలేకపోయాను.
సినిమా రంగంలో స్థిరపడాలని ఎప్పుడూ అనుకోలేదా?
లేదు. ఇప్పటికి నేను చేసినవి మూడే మూడు సినిమాలు. వంశీగారు నాకు చాలా ఇష్టమైన దర్శకుడు కావడంతో ‘దొంగ రాముడు అండ్ పార్టీ’లో చేశాను. చిన్న పాత్ర అయినా ఆయన దర్శకత్వంలో నటించడం ఆనందమే కదా! ఆ తర్వాత శంకర్, పోరంబోకు సినిమాలు చేశాను. అవి కూడా... మీరు చేస్తే బాగుంటుందని ఎవరో తెలిసినవాళ్లు బలవంతం చేయడం వల్ల చేశాను తప్ప, నాకు అంతగా ఆసక్తి లేదు. నటిగా నీరజ గురించి తెలుసుకున్నాం.
వ్యక్తిగా నీరజ ఎలా ఉంటారు?
నేను చాలా ముక్కుసూటి మనిషిని. దానివల్ల వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అయినా నేను ఇలాగే ఉంటాను. ఆడపిల్ల బయటికొచ్చి పని చేస్తోందంటే, అది వాళ్ల నిస్సహాయత అనుకునేవాళ్లు చాలామంది ఉన్నారు. తక్కువ చేసి మాట్లాడతారు. తప్పుడు కామెంట్లు చేస్తారు. అలాంటివాళ్లను నేను సహించను. తగిన సమాధానం చెప్తాను. అవసరమైతే కొడతాను కూడా. అది తప్పని నేననుకోను. అసలు నేనే కాదు, ప్రతి ఆడపిల్లా అలాగే ఉండాలి.
భవిష్యత్ ప్రణాళికలేంటి...?
ప్రత్యేకంగా ఏమీ లేవు. నటిగా మంచి పాత్రలు చేస్తూ పోతాను. అయితే ఒకటి. నాకు నా కుటుంబమే అన్నిటికంటే ముఖ్యం. నేను, నా భర్త, కొన్నాళ్ల తర్వాత మా పిల్లలు. వాళ్లకు చేయాల్సినదంతా చేసిన తర్వాతే ఇతర విషయాలకు ప్రాముఖ్యతనిస్తాను. అది కెరీరైనా... మరేదైనా సరే!
మావారు నవీన్ మొదట సీరియల్ దర్శకుడు. ఇప్పుడు సినిమాల్లోకి వెళ్లారు. ‘తులసీదళం’లో నన్ను చూసినప్పటి నుంచీ తను నన్ను ఇష్టపడ్డారట! ఆయన్ని పెళ్లి చేసుకోవడం నిజంగా నా అదృష్టం. ఈ ప్రపంచంలో భర్తలంతా నవీన్‌లా ఉంటే ఆడవాళ్లకు అసలు కష్టాలే ఉండవు!
(And get your daily news straight to your inbox)
Aug 24 | టెలివిజన్ సీరియళ్లలో నటించినవాళ్లను సినిమా ఇండస్ట్రీ చిన్నచూపు చూస్తుంది అంటారు కొందరు. టీవీ వాళ్లు సినిమాలకు సరిపోరు అంటారు ఇంకొందరు. ఇలాంటి కామెంట్లన్నింటికీ ఒకే ఒక్క సమాధానం... ప్రాచీ దేశాయ్. ‘కసమ్‌సే’ సీరియల్‌లో మెరిసి,... Read more
May 15 | 'బాలభవన్ ' నుండి 'బుల్లితెర ' వరకు కరుణ ప్రయాణం ... యావత్ టెలివిషన్ సీరియల్స్ అభిమానులనే ఉర్రూతలూగిస్తున్న సీరియల్ , శ్రీకాంత్ ప్రొడక్షన్స్ వారు అందించే 'మొగలిరేకులు' . ప్రతీ రోజు రాత్రి... Read more
Mar 26 | అందరికీ ఎలా గుర్తుండి పోవాలని కోరుకుంటారు?ఒక చెట్టులా... పుట్టలా... పక్షిలా... ప్రకృతిలో ఒక భాగంలా. అంతేతప్ప, ఓ గొప్ప వ్యక్తిగానో, మరో రకంగానో కాదు. తరచుగా వాడే మాట?నీ కాల్మొక్త! చాలాసార్లు నా నోటినుంచి... Read more
Mar 08 | సీరియల్‌లో హీరో అంటే ఎలా ఉంటాడు? కూల్‌గా, సాఫ్ట్‌గా, సింపుల్‌గా ఉంటాడు. ఇది గురుమీత్ చౌదరి రాక ముందు! అతడు అడుగుపెట్టాక సీరియల్ హీరో మారిపోయాడు. కండలు తిరిగిన శరీరం, రిచ్ లుక్‌తో మోడల్‌కి... Read more
Feb 26 | ప్రశాంతంగా కనిపిస్తాడు. అందంగా నవ్వుతాడు. అంతకంటే అందంగా నటిస్తాడు. అందరినీ ఆకట్టుకుని అలరిస్తాడు. అతడే రవికృష్ణ. ఇలా చెబితే ఎవరికీ తెలియకపోవచ్చు. మొగలిరేకులు ‘దుర్గ’ అంటే మాత్రం ఠక్కున గుర్తు పట్టేస్తారు. సెల్వస్వామి కొడుకుగా,... Read more