సినిమా విడుదలకు ముందు ప్రతి వ్యాఖ్యానం ప్రచారానికే పనికివస్తుంది. కృతి సనాన్ బీచ్ లో పాకుతూ పాడిన పాట సీన్ జుగుప్స కలిగించిందంటూ వ్యాఖ్యానించి మహేష్ బాబు అభిమానుల ఆగ్రహానికి గురైంది సమంత. అందుకు దర్శకుడు సుకుమార్ నుంచి తీవ్ర స్థాయిలో నిరసన కూడా బయటకు వచ్చింది. ఇంతా చేసి ఆ సీన్ సినిమాలో లేకుండా కట్ చెయ్యటం సుకుమార్ ని వేదనకు గురిచేసింది, అది ఆగ్రహావేశాల రూపంలో సమంత మీద వెళ్ళగక్కేట్టుగా చేసింది.
అయితే అదంతా పూర్వగాధ. ఇప్పుడు మహేష్ బాబు సినిమా 1, నేనొక్కడినే కథ కూడా పూర్తయిపోయింది. చూడాల్సినవాళ్ళు చూసేసారు, దాని మీద వివిధ రకాల స్పందనలు కూడా బాగోలేదు, పరవాలేదు, బాగానేవుంది లాంటి వచ్చేసాయి, ఇక ఆ కొత్త వేడంతా తగ్గిపోయింది.
ప్రస్తుతం అంతా చల్లబడింది కాబట్టి సమంత, సుకుమార్ లు ఆటోనగర్ సూర్య ఆడియో వేడుకలో పక్కపక్కనే కూర్చుని కాసేపు చెవులు కొరుక్కుని పకపకలాడుతూ కూడా కనిపించారు.
అయితే మనం రివైండ్ చేసి చూస్తే, సుకుమార్ సమంత మీద ధ్వజమెత్తిన సమయంలో కూడా, ప్రత్యామ్నాయాన్ని సూచించారాయన. ట్విట్టర్లో నేరుగా రాయకపోతే నాతో ముందుగా మాట్లాడవచ్చుగా, సమంత అంటే నాకు వల్లమాలిన అభిమానం, మరోసారి సమంత మహేష్ తో నటిస్తుందంటూ కూడా చెప్పుకొచ్చారాయన. ఏ పుట్టలో ఏ పాముందో ఏ సమంతలో ఏం దాగుందో అనే భావన కూడా సుకుమార్ కి ఆ సమయంలో ఉన్నట్లుంది అందుకే తెగేవరకూ లాగే ధోరణికి పోకుండా భవిష్యత్తులో కలిసి పనిచేసే విధంగానే ఆయన ముందు జాగ్రత్త పడ్డారు. అంతేకాదు ఆ తర్వాత సమంతతో కలిసి మాట్లాడే అవకాశం రాగానే దాన్ని సద్వినియోగం కూడా చేసుకున్నారు సుకుమార్.
ఔరా, నిజం కోపాలనుకుని మనం కూడా అదే ధోరణిలో మాట్లాడుంటే దొరికిపోయేవాళ్ళం అనుకున్నారు వాళ్ళని చూసినవాళ్ళంతా.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more