TRS, MIM strategic enmity in poll bound GHMC మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

Why trs and mim turned as enemies in ghmc elections

TRS, CM KCR, MIM, Asaduddin owaisi, GHMC Elections, Akbaruddin owaisi, Minister KTR, KT RamaRao, TRS Government, Dethrone, Mumtaz Ahmed, Hyderabad, Telangana, Politics

Political heat flared up in poll bond Greater Hyderabad ahead of GHMC elections as the friends ruling TRS party and AIMIM party turned as enemies and are busy in verbal wars. While TRS leader, Minister KTR said that the party will win more seats in Old City which is a bastion to MIM. MIM party leader Asaduddin Owaisi said that there is no alliance with the TRS party in the upcoming GHMC elections.

మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

Posted: 11/24/2020 12:25 AM IST
Why trs and mim turned as enemies in ghmc elections

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను లేను.. నేను లేక నీవు లేవు.. అన్న డ్యూయట్ సాంగ్ ను పాడుకున్న పార్టీలు కాస్తా.. జీహెఛ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఎవరికి ఎవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక.. అంటూ విరహ గీతాన్ని పాడుకుంటున్నారు. ఈ విధంగా పరిస్థితులు ఎందుకు మారాయి.? ఈ మారిన పరిస్థితులు ఎవరికి ప్రయోజనం కలిగించనున్నాయి, అసలు ఈ విధింగా విడిపోయి విరహగీతం పాడుకుంటున్న రెండు రాజకీయ పార్టీలు ఏవి.? అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయా..

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్.. హైదరాబాదీ మషూర్ పార్టీ ఏఐఎంఐఎం (మజ్లిస్) పార్టీల మధ్య 2014 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చిగురించిన స్నేహబంధం గత ఏడేళ్లలో ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదిగింది. అలాంటిది టీఆర్ఎస్ పార్టీకి తాము బయట నుంచి కేవలం మద్దతును మాత్రమే అందిస్తున్నామని, తాము ప్రభుత్వంలో భాగం కాదని, జీహెచ్ఎంసీ ఎన్నికలలో తమ పార్టీకి ఎవరితోనూ పోత్తు లేదని.. తాము ఒంటరిగానే బరిలో నిలుస్తున్నామని ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించడం ఆసక్తిని రేపుతోంది. ఈ పరిణామాలపై రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ.. పాతబస్తీలో తమ పార్టీ గతంలో సాధించిన స్థానాలకన్నా రెట్టింపు సంఖ్యలో స్థానాలను కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

గత జీహెచ్ఎంసీ ఎన్నికలలో పాతబస్తీలో ఐదు స్థానాలను కైవసం చేసుకున్న తాము ఈ సారి పది కన్నా అధిక స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై ఎంఐఎం చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ మరింత దూకుడుగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి కేటీఆర్ కానీ లేక ఎవరైనా కానీ ఎంఐఎంతో పెట్టుకుంటే వారి పతనాన్ని కోరుకున్నట్లేనని అన్నారు. తమ పార్టీతో పెట్టుకుంటే కేవలం రెండు నెలల కాలంలో ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని హెచ్చరించారు. మిత్రులుగా వున్న ఈ రెండు పార్టీల మధ్య ఒక్కసారిగా ఇంతలా వైరం పెరగడానికి కారణాలు ఏమైవుంటాయన్న చర్చ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సాగుతొంది.

పాతబస్తీలో తమ పట్టుతప్పుతుందన్న భావనతోనే ఎంఐఎం.. టీఆర్ఎస్ పార్టీపై ఈ స్థాయిలో హెచ్చరికలు జారీ చేసిందా.? అన్న సందేహాలు కూడా ఉత్పన్నమవుతున్నాయి, అయితే ఇదంతా కేవలం తమపై వస్తున్న వ్యతిరేకతను దూరం చేసుకునేందుకు టీఆర్ఎస్ పార్టీ.. ఎంఐఎంతో కలసి ఆడుతున్న నాటకమని అనేవారు లేకపోలేదు. గత జీహెఛ్ఎంసీ ఎన్నికల నాటి నుంచి ఇప్పటి వరకు మజ్లిస్ పార్టీతో కలసి టీఆర్ఎస్ అంటకాగుతూ మతరాజకీయాలను ప్రోత్సహిస్తోందని.. టీఆర్ఎస్ కు ఓటు వేస్తే అది ఎంఐఎంకు వేసినట్టేనని ఇప్పటికే బీజేపి నేతలు అరోపించారు. ప్రజల మధ్య మతవైషమ్యాలను రెచ్చగోట్టి జీహెచ్ఎంసీ ఎన్నికలలోనూ లబ్దిపోందేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని బీజేపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అరోపించారు.

దీంతో నిజంగా మిత్రుల మధ్య ఆకస్మికంగా వచ్చిన వైరానికి కారణంగా బీజేపి నేతల ప్రచారమేనా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి, ఇప్పటికే ఈ నెల 3న జరిగిన దుబ్బాక ఉపఎన్నికలో నువ్వా-నేనా అన్నట్లు సాగినా.. చివరకు కొద్దిపాటి అధిక్యంతో టీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. దీంతో అదే జీహెచ్ఎంసీ ఎన్నికలలోనూ పునరావృతం అవుతుందని ఇప్పటికే బీజేపి నేతలు, కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇందుకు అనుగూణంగా బండి సంజయ్, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా ప్రచారం చేస్తున్నారు. దీంతో అదే జరిగి.. తమకు గతంలో వచ్చిన 99 స్థానాలు దక్కించుకోలేకపోతే అది పార్టీకి మరో వైఫల్యంగా మారుతుందని టీఆరఎస్ భావిస్తోందని, ఈ క్రమంలో తమ ప్రభుత్వం మైనారిటీల కొమ్ముకాస్తుందన్న వాదనలకు పూర్తిగా వ్యతిరేకించేలా ఎంఐఎంతో వ్యూహాత్మకంగా తెగదెంపులు చేసుకున్నట్లు ప్రజలను భ్రమింపచేస్తున్నారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more

  • Serial heroine neha mardha hot bikini show in tailand

    బికినీ వేసిన సీరియల్ హీరోయిన్...!

    Jun 04 | సినీ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా సీరియల్ లో నటించే హీరోయిన్స్ సైతం ఎదో ఒకరకంగా న్యూస్ లో హాట్ టాపిక్ గా మారుతున్నారు. పైగా హీరోయిన్స్ కి మేము ఏమాత్రం తీసిపోము అంటూ... Read more