వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్దమవుతుంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు గుర్రల కోసం వేట సాగిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కన్ను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ దివంగత ఎర్రం నాయుడుకు వియ్యంకుడైన ఆదిరెడ్డి అప్పారావు పై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఆ పార్టీ నాయకుడు పిల్లి సుభాస్ చంద్రబోస్ వేసిన గాలంలో ఆదిరెడ్డి పడినట్లు తెలుస్తోంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నగరానికి చెందిన ఆపార్టీ సీనియర్ నాయకుడు ఆదిరెడ్డి అప్పారావు ఎంపిక పూర్తయింది. ఈనెల 9వ తేదీన వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థ్ధిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. పార్టీ అధిష్ఠానం నుంచి ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ రావడంతో రాష్ట్ర రాజధానికి పయనమయ్యారు. హైదరాబాద్‌లో పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను కలిసి తదుపరి కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. చాలాకాలం టీడీపీలో కొనసాగిన ఆయన రాజమండ్రి అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి పార్టీని బలోపేతం చేశారు. గత ఎన్నికల్లో ఆయన సతీమణి ఆదిరెడ్డి వీరరాఘవమ్మను నగర మేయర్‌గా గెలిపించుకుని తన సత్తాను చాటుకున్నారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి ఆయనతో పాటు సుమారు పది మంది కార్పొరేటర్లతో ఆదిరెడ్డి అప్పారావు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ తీర్థపుచ్చుకున్నారు. అప్పట్లో రాజమండ్రి అర్బన్ లేదా రాజమండ్రి రూరల్ నియోజకవర్గాల్లో ఏదో ఒకటి ఆదిరెడ్డికి కేటాయిస్తారని ధీమాతోనే ఆయన వైఎస్‌ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆదిరెడ్డికి ఈ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు అవకాశాలు లేకపోవడంతో ఆయనను పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయించేందుకు నిర్ణయించింది. తొలుత మాజీ మంత్రి పిల్లి సుభాస్‌చంద్రబోస్‌ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో నిలపాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే బోస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేయకుండా ఆ స్థానంలో ఆదిరెడ్డి అప్పారావుకు అవకాశం కల్పించాలని కోరినట్టు సమాచారం. పిల్లి సుభాస్‌చంద్రబోస్ నడిపిన రాజకీయ తంత్రం ఫలించడంతో ఆదిరెడ్డికి ఎమ్మెల్సీ బరిలో నిలిచేందుకు అవకాశం ఏర్పడిందని ఆపార్టీ వర్గాలు తెలిపాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more