రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన గ్యాస్ కోతను ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తనదైన శైలిలో అడ్డుకోవడం సహచర మంత్రులను ఆశ్చర్యపరించిందట. రాష్ట్ర కాంగ్రెస్ లో ఆయన పట్టును బాగా పెంచినట్లు కనబడుతుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. మన రాష్ట్రానికి రావాల్సిన గ్యాస్ కోటాను ఇవ్వకపోవడం పై కొంతకాలంగా సంబంధిత కేంద్ర మంత్రులకు లేఖలు రాస్తున్నప్పటికీ ఎవరూ స్పందించలేదని స్వయంగా .. కిరణ్ ఢిల్లీకి వెళ్లి గ్యాస్ మంటలను రగిలించినట్లు ఢిల్లీ మీడియా వర్గాలు అంటున్నాయి. కిరణ్ పెట్టిన గ్యాస్ మంటలకు పెట్రోలియం శాఖ మంత్రిగా ఉన్న జైపాల్ రెడ్డి పూర్తి గా చేతులు ఎత్తేసినట్లు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కిరణ్ దెబ్బకు ఒక్క రోజులోనే గ్యాస్ సమస్యను పరిష్కరించుకుని .. విజయం తో హైదరాబాద్ లో అడుగుపుట్టాడు మన ముఖ్యమంత్రి కిరణ్. ఎట్టకేలకు కేంద్రం దిగివచ్చింది. ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన గ్యాస్ ను తిరిగి ఇవ్వాలని ప్రధానమంత్రి కార్యాలయం పెట్రోలియం శాఖను ఆదేశించింది.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక బృందం ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలిసి విజ్ఞప్తి చేసిన నేపధ్యంలో ఆయన అన్ని విషయాలను పరిశీలించి తిరిగి గ్యాస్ కేటాయించడానికి అంగీకరించారు. రత్నగిరి ప్రాజెక్టుకు కేటాయించిన గ్యాస్ ను రద్దు చేశారు.ఈ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డికి మధ్య విబేదాలు ఏర్పడ్డాయి. ఒక దశలో జైపాల్ రెడ్డి ఈ విషయంలో ఆత్మరక్షణలో పడ్డారన్న భావన కలిగించింది. కొందరు కాంగ్రెస్ నేతలు మినహాయించి విపక్షాలతో సహా పలువురు ఈ విషయంలో జైపాల్ రెడ్డినే తప్పు పట్టారు. కాగా కిరణ్ ప్రధానిని కలిసి గ్యాస్ సాధించడంతో ఆయనదే పైచేయి అయిందని అనుకోవచ్చు. ఇంతవరకు కిరణ్ ను అభినందించవచ్చు. ఆయన ప్రధానితో పాటు సోనియాగాంధీ, వీరప్ప మొయిలీ, ఆంటోనిలను కలిసి గ్యాస్ అంశంపై తీవ్రంగా కృషి చేసినట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more