Tdp out to infuse young blood

TDP out to infuse young blood,bala krishna cm 2014, chandrababu naidu, telugu desam party, ntr junior, harish sankhar, balayya , ntr and balakrishna, tdp president nara chandrababu, BC,

TDP out to infuse young blood

TDP.gif

Posted: 06/26/2012 04:16 PM IST
Tdp out to infuse young blood

TDP out to infuse young blood

ఈసారి టీడీపీ తన ఆయుధాలను మార్చుతున్నట్లు కనబడుతుంది. ఎప్పుడు ఒకే ఆయుధంతో పోరాడే  టీడీపీ ఈసారి ఏకంగా  సరికొత్త యువ ఆయుధాలను రంగంలోకి దించుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలుగుదేశం పార్టీ బతికి బట్టకట్టాలంటే మళ్లీ మూలాల్లోకి వెళ్లక తప్పదా? అందులో భాగంగా పార్టీకి ఒక వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయా? జగన్‌ పార్టీ ప్రభంజనం నేపథ్యంలో పార్టీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి సృష్టించనున్నారా? ఆ మేరకు సీనియర్లు అధినేతపై ఒత్తిడి తీసుకువస్తున్నారా? ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న చర్చ ఇది. ఉప ఎన్నికల్లో దారుణ పరాజయం తర్వాత పార్టీలో జరుగుతున్న ఆత్మశోధన పలురకాల పరిష్కారాలు, ప్రత్యామ్నాయ మార్గాల దిశగా అడుగులు వేస్తున్నది. పార్టీకి పునాదిరాళ్లయిన బీసీలు దూరమవుతున్న విషయాన్ని గత కొద్ది కాలం నుంచీ జరుగుతున్న ఉప ఎన్నికల ద్వారా స్పష్టమవడటంతో మళ్లీ మూలాల్లోకి వెళ్లకపోతే పార్టీ కోలుకోలేదన్న విషయాన్ని పార్టీ సీనియర్లు గ్రహించారు. దానితో ప్రత్యామ్నాయ మార్గం దిశగా ఆలోచన మొదలయింది.

అందులో భాగంగా.. పార్టీకి ఒక వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి సృష్టించి, దానిని బీసీలకు ఇవ్వడం ద్వారా దూరమవుతున్న బీసీలకు దగ్గర కావాలన్న సూచనలు వస్తున్నట్టు వినిపిస్తోంది. పార్టీ రాజ్యాంగంలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి లేనప్పటికీ, ఇప్పటి అవసరాలు, భవిష్యత్‌ రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఆ పదవిని సృష్టించడం అనివార్యమని సీనియర్లు స్పష్టం చేస్తున్నారు. ఎన్టీఆర్‌ హయాంలో మాదిరిగా ఇప్పుడు బీసీలు మూకుమ్మడిగా పార్టీ వైపుఉండే అవకాశం లేదని, ప్రధాన కులాలను అన్ని పార్టీలూ ఆకర్షిస్తున్నందున, బీసీలంతా గంపగుత్తగా ఒకే పార్టీ లో లేని విషయాన్ని గుర్తు చేస్తున్నారు. తాజా ఉప ఎన్నిక ల్లో పార్టీకి దన్నుగా ఉన్న బీసీల ఓటు బ్యాంకు జగన్‌ పార్టీ కి కొంత భాగం, కాంగ్రెస్‌కు మరికొంత భాగం వెళ్లిన విష యాన్ని విశ్లేషించుకున్న సీనియర్లు..2014 ఎన్నికలు పార్టీకి ఇంకా కష్టంగా ఉంటాయని నిర్థరించుకున్నారు. పార్టీకి బీసీ నేతను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ను చేయడమే దీనికి ఏకైక పరిష్కారమార్గమని వారు స్పష్టం చేస్తున్నారు. యాదవ, గౌడ, మున్నూరు కాపు, మత్స్యకార, ముదిరాజు, పద్మ శాలి, కొప్పుల వెలమ, తూర్పు కాపు, కళింగ, శెట్టి బలిజ వంటి ప్రధాన బీసీ కులాలతో పాటు.. లెక్కలేనన్ని సంఖ్య లో ఉన్న ఎంబీసీ కులాలపై దృష్టి సారించవలసిన అవసరా న్ని సీనియర్లు గుర్తు చేస్తున్నారు. రజక, నాయి బ్రాహ్మణ వంటి కులాలు ప్రతి గ్రామంలోనూ ఉంటాయని అలాంటి వాటిపైనా దృష్టి సారించలసిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు. ఎన్టీఆర్‌ హయాంలో మాదిరిగా బీసీలు మళ్లీ పార్టీని విశ్వసించాలంటే ఆయా కులాలకు చెందిన వారిని ప్రొత్సహించాల్సిన అవసరం ఉందంటున్నారు.

అంతేకాకుండా  తెలుగుదేశం పార్టీ..  అందులో భాగంగా  పార్టీకి  యువరక్తాన్ని  ఎక్కించాలని  నిర్ణయించినట్లు తెలుస్తోంది.   ‘విజయం 2014’ అనే  పేరుతో  పార్టీని అన్ని వర్గాల ప్రజలకు దగ్గరగా  తీసుకెళ్లడం  ఎలా?  అన్నదానిపై  నియోజకవర్గ  , జిల్లా  సమన్వయ కమిటీలు  సమావేశాలు ఏర్పాటు  చేసి.. అక్కడి నుంచి వచ్చే సూచనలతో  రాష్ట్ర  స్థాయి లో   చర్చించి కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించింది. దీంతో  పాటు  యువత,  విద్యార్థి, మహిళా  విభాగాలపై  ఆ పార్టీ  ప్రత్యేక ద్రుష్టి   సారించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. యువతకు  గ్రామ, మండల స్థాయి నుంచి  రాష్ట్ర స్థాయి  వరకు అన్ని  స్థాయిల్లోనూ 40  శాతం  అవకాశాలు ఇవ్వాలని  అనుకుంటోంది.  దీనిలో  భాగంగా  ఇప్పటికే  పార్టీలో  ఉంటూ పని చేస్తున్న  యువ నేతల పేర్లను  పరిశీలించాలని  నిర్ణయించింది,  మరో వైపు  ఇప్పటికే పార్టీలో  ఉన్న సీనియర్  నేతల  స్థానంలో  వారి వారుసుల్ని  తీసుకొచ్చే దానిపైనా  మనసుపెట్టిందట.  కొత్త యువతకు  అధిక శాతం సీట్లు  ఇస్తూ.. రాజకీయ  వారసులకు  కూడా కొంత  శాతం ఇవ్వాలని  భావిస్తోంది.  ఇందులో భాగంగా  ఇప్పటికే  అనకాపల్లి నియోజక వర్గానికి  దాడి వీరభద్రరావు కుమారుడు  దాడి రత్నాకర్ ను  ఇన్ చార్జీగా  నియమించింది.  మాజీ మంత్రి  అయ్యన్నపాత్రుడు  కుమారుడు చింతకాయల  విజయ్ ను   కూడా  నర్నీపట్నం నుంచి  రానున్న రోజుల్లో  బరిలోకి  దించే అవకాశాలున్నాయాని   సమాచారం.  2014 నాటికి  టిడిపిలో  యువ రక్తం  ఎక్కించి .. ఎన్నికల బరిలోకి రంగం సిద్దం చేస్తున్నట్లు  ఆ పార్టీ నాయకులు అంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ileana in devudu chesina manushulu
Tendulkar greatest batsman to have played cricket lillee  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more