Andrew symonds quits all forms of cricket

Andrew Symonds quits all forms of cricket, Andrew Symonds Latest News, Photos, Biography, Videos and Wallpapers.

Andrew Symonds quits all forms of cricket

Andrew.gif

Posted: 02/17/2012 04:03 PM IST
Andrew symonds quits all forms of cricket

Andrew Symonds quits all forms of cricket

ఆస్ట్రేలియన్‌ మాజీ ఆల్‌-రౌండర్‌, మోస్ట్‌ టాలెంటెడ్‌ ఆండ్రూ సైమండ్స్‌ అన్నిరకాల క్రికెట్‌కూ గుడ్‌బై చెప్తున్నట్లు ప్రకటించాడు. కెరీర్‌ మొత్తం గొడవలూ, కాంట్రవర్సీలతో కాలక్షేపం చేసిన 36 ఏళ్ల సైమో కుటుంబ కారణాల వలన తన క్రికెట్‌ జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు తెలిపాడు. మూడేళ్ల క్రితం ఇంగ్లండ్‌లో జరిగిన వరల్డ్‌ టీ20 మధ్యలోనే అర్థంతరంగా క్రికెట్‌ ఆస్ట్రేలియా బయటకు పంపించడంతో అప్పటినుంచి ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌కూడా ఆడలేదు. కాని దేశీయ క్రికెట్‌లో పాలుపంచుకున్నాడు. ఇక చెప్పుకోడానికి ఉన్న ఏకైక కాంట్రాక్ట్‌ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌. కాని ఈ ఏడాది ఐపీఎల్‌లో పాల్గొనలేనని చెప్పాడు. ‘‘తక్షణమే క్రికెట్‌నుంచి వైదొలుగుతున్నాను. అన్నిరకాల క్రికెట్‌కు రిటైర్మెంట్‌ చెప్తున్నాను’’ అని సైమండ్స్‌ ప్రకటించాడు. ‘‘ముంబై ఇండియన్స్‌ కాంట్రాక్ట్‌కు ఇదే చివరి ఏడాది కాని దాన్ని ఫుల్‌ ఫిల్‌ చేయలేకపోతున్నందుకు విచారిస్తున్నాను. ముంబై ఇండియన్స్‌, ఐపీఎల్‌ చాలా సపోర్ట్‌ను ఇచ్చాయి. కాని నా మొదటి సంతానం కారణంగా వీటికి దూరంగా ఉండాలని భావిస్తున్నాను’’ అని సైమో తలిపాడు.

సైమండ్స్‌కు ఎంత టాలెంట్‌ ఉన్నా అతడు ఎల్లపుడూ వివాదాలతో సావాసం చేస్తుండడం అతడిని క్రికెట్‌లో ఏకాకిగా నిలుచోబెట్టింది. మద్యానికి బానిసైన సైమోను సెలెక్టర్లు 2005ఇంగ్లండ్‌ టూర్‌ నుంచి తొలగించారు. బంగ్లాదేశ్‌తో సిరీస్‌ సందర్భంలో పబ్‌లో ఫుల్‌గా తాగి గొడవపడడం సైమోను దోషిగా నిలబెట్టాయి. ఇక సైమో జీవితంలో మర్చిపోలేని వివాదం 2008 జనవరిలో జరిగింది.భారత్‌తో జరిగిన సిడ్నీ టెస్టులో సైమో-భజ్జీ వివాదం అతడి కెరీర్‌లో ఓ మచ్చలా ముద్రపడిపోయింది. భజ్జీ తనను జాతిపరంగా తిట్టాడని అప్పట్లో సైమో వివాదాస్పదమయ్యాడు. ఆతర్వాత జరిగిన పరిణామాలతో భజ్జీ బ్యాన్‌ నుంచి ఫైన్‌ తో సరిపెట్టుకున్నాడు. కాని సైమో మాత్రం ఆస్ట్రేలియా-బీసీసీఐ కుమ్మకై్క వివాదాన్ని నీరుగార్చాయని ఆరోపణలు చేశాడు.

ఈ ఆరోపణలే అతడి క్రీడా జీవితాన్ని మసకబార్చాయి. ఆతర్వాత ఏడాది సైమోను ఇంటర్నేషనల్‌ క్రికెట్‌నుంచి దూరం చేశాయి. బంగ్లాదేశ్‌ టూర్‌ నేపథ్యంలో ఏర్పాటు చేసిన టీమ్‌ మీటింగ్‌ను ఎగ్గోట్టి చేపల వేటకు వెళ్లాడు. దీన్ని క్రికెట్‌ ఆస్ట్రేలియా తీవ్రంగా పరిగణించింది. దీంతో ఆతర్వాత జరిగిన భారత్‌ టూర్‌, సౌతాఫ్రికా టూర్లకు అతడిని ఎంపిక చేయలేదు. ఇక 2009లో ఇంగ్లండ్‌ లో జరిగిన టీ20వరల్డ్‌ కప్‌కు సైమోను నిరూపించుకునేందుకు అతడికి మరో ఛాన్స్‌ను ఇచ్చారు. కాని అక్కడ మద్యం సేవించి గొడవకు దిగాడన్న కారణంతో మధ్యలోనే అతడిని జట్టునుంచి తప్పించారు. దీంతో అతడి ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కెరీర్‌కు తెరపడింది.

వరల్డ్‌ కప్‌ విన్నర్‌ ఆస్ట్రేలియన్‌ పోరాట యోధుడు ఆండ్రూ సైమండ్స్‌ రెండు సార్లు వరల్డ్‌ కప్‌ ఛాంపియన్‌గా నిలిచిన ఆసీస్‌ జట్టులో భాగస్థుడయ్యాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సైమండ్స్‌ మాస్టర్‌ గా పేరుపొందాడు. బ్యాటింగ్‌లో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాలన్నా.. బెబ్బులిలా ఫీల్డింగ్‌ చేయాలన్నా సైమోవల్లే సాధ్యం. అదీగాక బంతితో మీడియం పేస్‌, స్పిన్‌ బౌలింగ్‌ వేయగల సమర్థుడు. ఈ సమర్థతే అతడికి అప్పటికే లెజెండ్స్‌తో నిండిపోయిన జట్టులోకి తీసుకొచ్చింది. 2000 దశకం మొదట్లో అతడి ఆటను చూసి అందరూ విస్మయం చెందారు. 2003వరల్డ్‌ కప్‌లో అతడు పాకిస్తాన్‌ పై బాదిన సెంచరీ షేన్‌ వార్న్‌ వల్ల మసకబారింది. అతడి హీరోయిక్‌ సెంచరీ తర్వాత వార్న్‌డోపింగ్‌లో పట్టుబడిపోయాడు. ఆతర్వాత అతడు వన్డే క్రికెట్‌లో ఏకాకిగా మిగిలిపోయాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajinikanth kamal hassan teaming up news turn false
Mlc pulla padmavathi attend the assembly  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more