ఇప్పడు వైఎస్ఆర్ కాంగ్రెస్ కోట బీటులువారుతుంది. మొన్నటి వరకు మాది కంచుకోట అని చెప్పిన వారు మెల్ల మెల్లగా జగన్ కోటనుండి బయటకు వస్తున్నారు. అసలు జగన్ కోటలో నుండి ఎందుకు బయటికి వస్తున్నారు? అలా బయటి వచ్చిన వారు జగన్ కోట గురించి ఏం చెబుతున్నారు? జగన్ నుండి నాయకులు ఎందుకు విడిపోతున్నారు? అనే ప్రశ్నలు ప్రతి సామన్యుడి మనసులో మెదులుతున్నవే.
జగన్ వర్గంలో ఒక వికెట్ పడిపోయింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని, జగన్‌ను పూర్తిగా సమర్థిస్తూ, ఇప్పటిదాకా కాంగ్రెస్ నాయకత్వంపై విమర్శల వర్షం గుప్పించిన ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి హఠాత్తుగా కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశానికి హాజరయ్యారు. జగన్ వర్గం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సాంకేతికంగా కాంగ్రెస్‌కే చెందినప్పటికీ, వారికి ఆహ్వానాలు పంపలేదని చీఫ్ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి సమావేశానికి కొద్ది సేపటి ముందు ప్రకటించారు. అయినప్పటికీ పుల్లా పద్మావతి సమావేశానికి హాజరు కావటం కాంగ్రెస్ నేతలనే ఆశ్చర్యా నికి గురి చేసింది.
వరంగల్ జిల్లాకు చెందిన పుల్లా భాస్కర్, పుల్లా పద్మావతి దంపతులు గత కొంతకాలంగా జగన్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. తమ జిల్లాకే చెందిన ఎమ్మెల్యే కొండా సురేఖ, ఆమె భర్త, ఎమ్మెల్సీ కొండా ముర ళికి అమిత ప్రాధాన్యం ఇస్తూ తమను చిన్న చూపు చూ స్తున్నారని, ఎలాంటి సమాచారం అందించకుండా, గుర్తింపు ఇవ్వకుండా అవమానాలకు గురి చేస్తున్నారని పుల్లా భాస్కర్, పద్మావతి తమ సన్నిహితులతో కొంతకాలం నుంచి చెబుతున్నారు. ఈ మధ్య జగన్ పర్యటనల్లో కానీ, దీక్షల్లో కానీ వారు పాల్గొనటం మానేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయానికి రావటమే మానుకున్నారు.
పుల్లా పద్మావతి హఠాత్తుగా మారిపోవటానికి వెనుక వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, చీఫ్ విప్ గండ్ర వెం టరమణారెడ్డి ప్రమేయం ఉందని విశ్వసనీయంగా తెలిసింది. గత కొంతకాలంగా గండ్ర ఈ దంపతులిద్దరినీ తిరిగి కాంగ్రెస్ వైపు తిప్పేందుకు గట్టి ప్రయత్నాలు చేశారని, అవి ఫలించినందుకే పద్మావతి సీఎల్పీ సమావేశానికి హాజరయ్యారని సమాచారం.
పద్మావతి బాటలోనే ప్రస్తుతం జగన్ వర్గంలో ఉన్న మరి కొందరు నడిచే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. జగన్‌పై ఆర్థిక నేరాలు, అక్రమ ఆస్తుల ఉచ్చు రోజు రోజుకూ బిగుస్తుండటం, ఆయన తల్లి విజయమ్మ దాఖలు చేసిన కేసులు కోర్టులలో చిత్తవు తుండటం, అన్నిటికీ మించి అనర్హత వేటు పడితే జగన్ మళ్ళీ టికెట్లు ఇచ్చినా గెలుస్తామన్న గ్యారంటీ లేకపోవటం వంటి కారణాలు జగన్ వర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఇతర నేతలను పునరాలోచనలో పడేస్తున్నట్టు సమాచారం. ఈ ఆలోచనతోనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనర్హత విషయంలో కాస్త నిదానంగా ఆలోచి స్తున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే మొదట్లో జగన్ వర్గంలో ఉన్న ఎమ్మె ల్యేలు కొందరు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more