Singer Bamba Bakya passes away at 49 in Chennai ప్రముఖ సింగర్ బాంబా బాక్య ఆకస్మిక మరణం

Ponniyin selvan movie singer bamba bakiya passes away in chennai

Bamba Bakya, Bamba Bakya dies, Bamba Bakya singer, Bamba Bakya passes away, singer Bamba Bakya, Bamba Bakya hospital, Rajnikant, Vijay Thalapathy, Bamba Bakya songs, Bamba Bakya and ar rahman, ponniyin selvan, kollywood, Moives, Entertainment, latest kollywood news

Singer Bamba Bhakya passed away in Chennai due to illness. He was 49 and was undergoing treatment when he succumbed to a heart attack. He was rushed to the hospital on Thursday after he complained of discomfort. His sudden death has left his fans and the industry in shock.

సినీపరిశ్రమలో విషాదం.. ప్రముఖ సింగర్ బాంబా బాక్య ఆకస్మిక మరణం

Posted: 09/02/2022 12:45 PM IST
Ponniyin selvan movie singer bamba bakiya passes away in chennai

గత కొన్ని రోజులుగా వరుసగా సినిమా ఇండ‌స్ట్రీలో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తమ అద్భుత ప్రావిణ్యంతో ప్రేక్షకులను మంత్రముగ్గుల్ని చేసిన అనేక మంది ప్రముఖులు అనంతవాయువుల్లో ఐక్యం అవుతున్నారు. తాజాగా కాలీవుడ్ పరిశ్రమకు చెందిన ప్ర‌ముఖ సింగ‌ర్ బాంబా బాక్య (49) మృతి చెందాడు. కొన్నేళ్ల క్రితమే కోలీవుడ్ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈయన తన సుమధుర గాత్రంతో పాడిన పాటలు శ్రోతలను ఎంతగానే ఉత్తేజపర్చాయి. మరిన్ని చిత్రాల ద్వారా తమ మధురు గాత్రాన్ని అందించాల్సిన ఈయ‌న అకస్మాత్తుగా మరణించారు.

బాంబా బాక్య మృతికి కారణాలు ఏమై ఉంటాయన్న వివరాలు మాత్రం తెలియ‌లేదు. కాగా ప‌లు త‌మిళ మీడియా సంస్థ‌లు మాత్రం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతోనే బాంబా బాక్య మ‌ర‌ణించిన‌ట్లు తెలుపాయి. దీంతో ఆయన అభిమానులు అందోళనకు గురయ్యారు. తన పాటలతో ఉత్సాహాన్ని కల్గించిన గాయకుడు.. చిన్న వయస్సులోనే అనంతవాయువుల్లో ఐక్యం అయ్యాడని దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. త‌మిళంలో ప‌లు చార్ట్ బ‌స్ట‌ర్ పాట‌లు పాడి, సింగ‌ర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవ‌లే విడుద‌లైన‌ ‘పొన్నియిన్  సెల్వ‌న్‌’ లోని ‘పొంగేన‌ది’ పాటను ఈయ‌నే ఆల‌పించాడు. బాంబా బాక్య మ‌ర‌ణం ప‌ట్ల కోలీవుడ్ సీని ప్ర‌ముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్య‌క్తం చేస్తున్నారు.

బాంబా బాక్య ‘రోబో 2.0’ చిత్రంలో ‘పుల్లినంగ‌ల్’ పాట‌తో సినీ ప‌రిశ్ర‌మ‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ త‌ర్వాత ‘స‌ర్కార్’ చిత్రంలో ‘సింతాంగ‌రం’, పొన్నియిన్ సెల్వ‌న్‌లో ‘పొన్నిన‌ది’ వంటి ప‌లు పాట‌ల‌ను ఆల‌పించాడు. ఎక్కువ‌గా ఏ.ఆర్ రెహామాన్ సినిమాల్లోనే బాంబా బాక్య పాట‌లు పాడాడు. సినిమాల్లోకి రాక‌ముందు ఈయ‌న‌ డివోష‌న‌ల్ సాంగ్స్ పాడేవాడు. బాంబా బాక్య మ‌ర‌ణం ప‌ట్ల హీరో కార్తి ట్విట్ట‌ర్‌లో ‘బాంబే బాక్య ఆక‌స్మిక మ‌ర‌ణం భాద క‌లిగించింది. ఈ భాద‌ను, న‌ష్టాన్ని త‌ట్టుకునే శ‌క్తి ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు, స్నేహితుల‌కు ఉండాలిని ప్రార్థిస్తున్నాను’ అంటూ ఎమోష‌న‌ల్ ట్వీట్ చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles