Hari Hara Veera Mallu: Glimpse of power is here ‘హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు’‌: గ్లింప్స్ తో ఫ్యాన్స్ కు గూస్‌బంప్స్

Glimpse of power star pawan kalyan s hari hara veera mallu is out

HariHaraVeeraMallu, Power Glance, Power star Pawan Kalyan, Nidhhi Agerwal, Pawan Kalyan, Krish Jagarlapudi, MM Keeravaani, AM Rathnam, Dayakar Rao, Tollywood, Movies, Entertainment

The video glimpse of ‘Hari Hara Veera Mallu’ is out. On the occasion of Pawan Kalyan’s birthday, this teaser has been released. Directed by Krish, ‘Hari Hara Veera Mallu’ is a period drama with Pawan Kalyan essaying a legendary outlaw named Veera Mallu. The video glimpse has provided a glimpse of the ferocious nature of the outlaw.

పవన్ కల్యాణ్ ‘హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు’‌: గ్లింప్స్ తో ఫ్యాన్స్ కు గూస్‌బంప్స్

Posted: 09/02/2022 11:46 AM IST
Glimpse of power star pawan kalyan s hari hara veera mallu is out

పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.. భీమ్లా నాయక్ చిత్రం సూపర్ హిట్ కావడంతో ఆ తరువాత వస్తున్న ప్రాజెక్టు ‘హరిహర వీరమల్లు’ పై భారీ అంచనాలు అలుముకున్నాయి. రాజకీయాల్లోకి ఎంట్రీ చేసిన తరువాత కొన్నాళ్ల పాటు సినిమాలకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చిన పవన్ కల్యాణ్.. మూడేళ్ళ త‌ర్వాత ‘వ‌కీల్ సాబ్‌’తో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చాడు. గ‌తేడాది విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కాసుల వ‌ర్షం కురిపించింది. ఈ చిత్రం త‌ర్వాత ‘భీమ్లా నాయ‌క్‌’తో మ‌రో సాలిడ్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఇలా వరుస‌గా రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్లు రావ‌డంతో ప‌వ‌న్ అభిమానుల ఆనందానికి హ‌ద్దులు లేకుండా పోయాయి. ఇక హ్యాట్రిక్ విజయం దిశగా పవన్ దృష్టిసారించారు.

ప్ర‌స్తుతం ఈయ‌న ‘హరి హ‌ర వీర‌మ‌ల్లు’ అనే పీరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా చిత్రాన్ని చేస్తున్నాడు. క్రిష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ షూటింగ్ జ‌రుప‌కుంటుంది. వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయడంగా ప్రకటించింది చిత్రబృందం. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లపూడి దర్శకత్వంలో రూపోందుతున్న ఈ చిత్రం దాదాపుగా చిత్రం షూటింగ్ ఇప్ప‌టివ‌ర‌కు 50శాతం పూర్తయింద‌ని చిత్ర నిర్మాత దయాకర్ రావు తెలిపాడు. ఇక ఇవాళ పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మేక‌ర్స్ గ్లింప్స్‌ను విడుద‌ల చేశారు.

‘మెడ‌ల్ని వంచి, క‌థ‌ల్ని మార్చి, కొలిక్కితెచ్చే పనెట్టుకొని తొడకొట్టాడే.. తెలుగోడు’ అంటూ ప‌వ‌ర్ ఫుల్ నేప‌థ్య సంగీతంతో ‘హరి హ‌ర వీర‌మ‌ల్లు’ గ్లింప్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. గ్లింప్స్‌లో ప‌వ‌న్ స్క్రీన్ ప్ర‌జెన్స్ వేరే లెవ‌ల్లో ఉంది. కుస్తీలో ప్ర‌త్య‌ర్థుల‌ను మ‌ట్టిక‌రిపిస్తూ పులిలా విజృంభిస్తున్నాడు. ముఖ్యంగా కీర‌వాణి నేప‌థ్య సంగీతం అద్భుతంగా ఉంది. ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు జోడీగా నిధి అగ‌ర్వాల్, న‌ర్గీస్ ఫ‌క్రి హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. మెగా సూర్య ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై ఏ. ద‌యాక‌ర్ రావు నిర్మిస్తున్నాడు. ఎమ్‌. ఎమ్ కీర‌వాణి సంగీతం అందిస్తున్నాడు. పీరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles