Chiyaan Vikram's Cobra trailer out విక్రమ్ ‘కొబ్రా’ టీజర్: అంచనాలను పెంచేసింది..

Cobra teaser chiyaan vikram impresses with his various avatars and promises a ride of thriller action

Cobra, Official Teaser, Chiyaan Vikram, AR Rahman, R Ajay Gnanamuthu, 7 Screen Studio, S.S. Lalit Kumar, Thumbi Thullal, corbra tamil songs, Rahman songs, rahman tamil songs, vikram vikram tamil songs, cora teaser, cobra trailer, cobra songs, Tollywood, movies, Entertainment

The teaser of Chiyaan Vikram's highly anticipated and awaited film Cobra has been released. The film promises to be high on thrilling and action points, which will definitely keep audiences hooked to the screen. The actor is also seen donning various avatars and it looks super intriguing. Cobra is all set to release in theaters on August 31.

అంచనాలను అమాంతం పెంచేసిన విక్రమ్ ‘కొబ్రా’ టీజర్

Posted: 08/24/2022 03:45 PM IST
Cobra teaser chiyaan vikram impresses with his various avatars and promises a ride of thriller action

విక్రమ్ హీరోగా రూపోందుతున్న 'కోబ్రా' సినిమా ఇటీవల ఆయన అనారోగ్యం బారిన పడటంతో వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఆయన గుండెపోటుకు గురయ్యారంటూ మీడియా వార్తలను వెలువరించినా.. వాటిని కుటుంబసభ్యులు తోసిపుచ్చారు. విక్రమ్ కు చాతిలో నొప్పివచ్చిందని.. అయితే అది గుండెపోటు మాత్రం కాదని వారు తెలిపారు. ఈ విషయాన్నే ఆసుపత్రిలోని వైద్యులు కూడా నిర్థారించారని వారు తెలిపారు. దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ నెలాఖరున ఆయన నటించిన తాజా చిత్రం కోబ్రా విడుదల కానున్న విషయం తెలిసిందే.

సెవెన్ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి, అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించాడు. ఈ నెల 31వ తేదీన ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులోను విడుదల చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్టయినర్ జోనర్లో రూపొందిన ఈ సినిమాలో కథానాయికగా శ్రీనిధి శెట్టి కనిపించనుంది. నిన్న ఈ సినిమా నుంచి తెలుగు టీజర్ ను వదిలారు. విక్రమ్ తో పాటు ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ టీజర్ ఆసక్తిని రేకెత్తించింది. చాలా ఫాస్టుగా ఈ టీజర్ 3 మిలియన్ ప్లస్ వ్యూస్ ను దక్కించుకోవడం విశేషం.

ఏఆర్ రెహ్మాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా అనిపించేలా ఉంది. విక్రమ్ ఎప్పటిలానే విలక్షణమైన నటనను కనబరిచాడు. ఈ సినిమా కోసం భారీ స్థాయిలో ఖర్చు చేసినట్టుగా టీజర్ ను చూస్తేనే తెలుస్తోంది. చాలా కాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న విక్రమ్, ఈ సినిమాతో ఆ నిరీక్షణ ఫలిస్తుందని భావిస్తున్నాడు. ఇర్ఫాన్ పఠాన్ .. కేఎస్ రవికుమార్ .. సత్యదేవ్ .. మృణాళిని రవి .. మియా జార్జ్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cobra  Official Teaser  Chiyaan Vikram  AR Rahman  R Ajay Gnanamuthu  7 Screen Studio  Tollywood  

Other Articles