Kiran Abbavaram's Meter first look out యంగ్ హీరోలో మైత్రీ బ్యానర్ నుంచి మరో మాస్ మూవీ.!

Kiran abbavaram goes impressive with meter first look out

Meter, Meter First look, Meter Title poster, kiran abbavaram, Kiran Abbavaram Meter, Mytri Movie makers, Mass moive, Tollywood, Movies, Entertainment

Meter is the title of actor Kiran Abbavaram’s upcoming film directed by Ramesh Kaduri. The makers released the film’s first look and title poster on Friday, marking the actor’s birthday. Meter is produced by Chiranjeevi and Hemalatha Pedamallu under Clap Entertainment in association with Mythri Movie Makers.

యంగ్ హీరోతో మైత్రి మూవీస్ మాస్ మూవీ.. ఫస్ట్ లుక్ రిలీజ్.!

Posted: 07/15/2022 09:24 PM IST
Kiran abbavaram goes impressive with meter first look out

ఏ మాత్రం గ్యాప్ రాకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన మాస్ టచ్ ఉండే పాత్రలను చేస్తూ వెళుతున్నాడు కిర‌ణ్ అబ్బ‌వ‌రం. ‘రాజావారు రాణిగారు’, ‘SR క‌ళ్యాణ మండ‌పం’ వంటి వ‌రుస హిట్ల‌తో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వ‌చ్చి న ‘సెబాస్టియ‌న్’ కాస్త నిరాశ‌ప‌రిచిన ఇటీవ‌లే వ‌చ్చిన ‘స‌మ్మ‌త‌మే’ మంచి విజ‌యం సాధించింది. ప్ర‌స్తుతం ఈయ‌న చేతిలో అర‌డ‌జ‌ను సినిమాలున్నాయి. అందులో ‘మీట‌ర్’ ఒక‌టి. ర‌మేష్ కాడూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ చిత్రం షూటింగ్ ద‌శ‌లో ఉంది. శుక్ర‌వారం కిర‌ణ్ అబ్బ‌వ‌రం బ‌ర్త్‌డే సందర్భంగా ‘మీట‌ర్’ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ తాజాగా విడుద‌ల చేశారు.

లేటెస్ట్‌గా విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌లో కిర‌ణ్ మాస్ లుక్‌లో ఉన్నాడు. చిత్రంలో వ‌చ్చే డ్యాన్స్ స్టిల్‌లా పోస్ట‌ర్ ఉంది. ఈ సినిమాలో కిర‌ణ్ పోలీస్ అధికారిగా క‌నిపించ‌నున్న‌ట్లు టాక్. అతుల్య ర‌వి ఈ చిత్రంతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో క్లాప్ ఎంట‌ర్టైన‌మెంట్స్ బ్యాన‌ర్‌పై చిరంజీవి, హేమ‌ల‌త నిర్మిస్తున్నారు. సూర్య ఈ చిత్రానికి క‌థ అందిస్తున్నాడు. సాయి కార్తిక్ స్వ‌రాల‌ని స‌మ‌కూరుస్తున్నాడు. ప్ర‌స్తుతం కిర‌ణ్ ‘నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని’, ‘రూల్స్ రంజ‌న్‌’, ‘విన‌రో భాగ్య‌ము విష్ణుక‌థ’ షూటింగ్‌ల‌ను ఏక‌కాలంలో జ‌రుపుతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles